పనాజీ: పదిహేనేళ్ల విదేశీ బాలిక రేప్, హత్య కేసులో ఇద్దరు బీచ్ వర్కర్లు శుక్రవారం నిర్దోషులుగా విడుదలయ్యారు. 2008లో బ్రిటన్ కు చెందిన స్కార్లెట్ కీలింగ్ అనే బాలికను గోవాలోని అంజునా బీచ్ లో ఇద్దరు వ్యక్తులు రేప్ చేసి అనంతరం హతమార్చారు. బాధితురాలి శరీరంలోకి పెద్ద మొత్తంలో డ్రగ్స్ ఎక్కించిన నిందితులు ఆమె మరణించే వరకూ హింసించారు.
కేసును దర్యాప్తు చేసిన పోలీసులు బీచ్ లో పనిచేసే శాంసన్ డిసౌజా, ప్లసిడొ కర్వాల్హోలను అరెస్టు చేశారు. దాదాపు ఎనిమిదేళ్ల పాటు ఈ కేసును విచారించిన గోవా బాలల కోర్టు నిందితులు శాంసన్, ప్లసిడోలను నిర్ధోషులుగా తేల్చుతూ శుక్రవారం సంచలన తీర్పునిచ్చింది. కోర్టు తీర్పుపై స్పందించిన బాధితురాలి తల్లి .. తీర్పు తనను షాక్ కు గురిచేసినట్లు చెప్పారు.
గోవా రేప్ కేసు నిందితుల విడుదల
Published Fri, Sep 23 2016 4:41 PM | Last Updated on Sat, Aug 25 2018 6:21 PM
Advertisement