కాలం మదిలో...కరిగిన జ్ఞాపకాలు | 2013 roundup of gunturu district | Sakshi
Sakshi News home page

కాలం మదిలో...కరిగిన జ్ఞాపకాలు

Published Tue, Dec 31 2013 1:03 AM | Last Updated on Sat, Sep 2 2017 2:07 AM

2013

2013

జనవరి
 1న- పేరేచర్ల సమీపంలోని కైలాసగిరిలో విశ్వకల్యాణ మహాయజ్ఞం ప్రారంభమైంది.
 8న- హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో ఉన్న గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావును గుంటూరు పోలీసులు అరెస్టు చేశారు.
 18న- నాగార్జున విశ్వవిద్యాలయం ఎదుట హిందూ చైతన్య శిబిరం ప్రారంభమైంది. ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్‌భగవత్, బీజేపీ నేత వెంకయ్య నాయయుడులు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.   
 28న-  బైబిల్ మిషన్ మహాసభలుప్రారంభమయ్యాయి.  ముఖ్య అతిథులుగా వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నాయకురాలు వై.ఎస్.విజయమ్మ, బ్రదర్ అనిల్‌కుమార్‌లు హాజరయ్యారు.
 
 ఫిబ్రవరి
 1న- సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆవరణలో విద్యార్థి గర్జన జరిగింది.
 5న- జిల్లాలో చంద్రబాబు నాయుడు ‘మీకోసం వస్తున్నా’ పాదయాత్ర మొదలు పెట్టారు.
 16న- జిల్లా అంతటా భారీ వర్షం కురిసింది. గుంటూరునగరం పూర్తిగా జలమయం అయింది.
 21న- కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల శాసనమండలి ఎన్నికలకు పోలింగ్‌జరిగింది.
 24న-గుంటూరు మిర్చి యార్డులో జరిగిన అక్రమాలపై రెండవ విడతవిచారణ జరిగింది.
 28న  పిడుగురాళ్ల మండలం పందిటివారిపాలెం నుంచి వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్రను ప్రారంభించారు.
 మార్చి
 1న- జెడ్పీ సీఈవో జయప్రకాశనారాయణ నల్గొండ జిల్లా సీఈవోగా బదిలీ అయ్యారు.
 1న - సమాచారహక్కు కమిషనర్ విజయబాబు జిల్లాలో పర్యటించారు.
 2న - డీసీసీబీ చైర్మన్‌గా ముమ్మనేని వెంకట సుబ్బయ్య ఏకగ్రీవంగా, డీసీఎంఎస్ అధ్యక్షుడిగా ఇక్కుర్తి సాంబశివరావు ఎన్నికయ్యారు.
 3న - ఆప్కో చైర్మన్‌గా మంగళగిరికి చెందిన మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావు నియమితులయ్యారు.
 15న - గుంటూరులో డివిజన్‌స్థాయి రైల్‌మేళా ప్రారంభమయ్యాయి.
 21న- జిల్లా జాయింట్ కలెక్టర్‌గా మురళీధర్‌రెడ్డి బాధ్యతలు స్వీకారం
 
 ఏప్రిల్
  3న - కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన పరిష్కారం సెల్‌ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి హాజరయ్యారు.
 3న - గురజాలను రెవెన్యూ డివిజన్‌గా ప్రభుత్వం ప్రకటించింది.
 6న - తెనాలిలో వైభవంగా తిరుమలేశుని కల్యాణం జరిగింది.  టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు, స్పీకర్ నాదెండ్ల మనోహర్ హాజరయ్యారు.
 11న  -సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఫిరంగిపురంలో పర్యటించారు.
 17న - గుంటూరు మున్సిపల్ కమిషనర్‌గా కె.వెంకటేశ్వర్లు నియమితులయ్యారు.
 27న - రాష్ట్ర గవర్నర్ నరసింహన్ మంగళగిరి లక్ష్మీనరసింహస్వామిని దర్శించారు.
 
 మే
 
 3న - రొంపిచర్ల మండలం అన్నవరప్పాడు సమీపంలో లారీ ఢీ కొని ఇద్దరు మహిళలు దుర్మరణం చెందారు.
 9న - గుంటూరులో జరిగిన రైతు సదస్సుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి హాజరయ్యారు.
 12న - పిడుగుపాటుకు చౌడవరం, యడ్డపాడు, నాదెండ్ల ప్రాంతాలకు చెందిన ముగ్గురు మృతి చెందారు.
 19న - చిలకలూరిపేట సమీపంలోని చౌడవరం వద్ద జరిగిన రోడ్డుప్రమాదంలో ముగ్గురు మరణించారు. మృతుల్లో మాజీ జెడ్పీటీసీ మల్లెల సత్యనారాయణ కూడా ఉన్నారు.
 20న- బీఆర్‌స్టేడియంలో జరిగిన 10వ యూత్ ఫెస్టివల్ పోటీల్లో ఓవరాల్ చాంఫ్‌గా కేరళ జట్టు నిలిచింది.
 26న-   బాపట్లలో ముగిసిన ప్రథమాంధ్ర మహాసభ శతాబ్ధి వే డుకలకు తమిళనాడు గవర్నర్ రోశయ్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
 
 జూలై
 
 3న  - జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.
 10న  - హక్కుల సాధన కోసం జిల్లా వ్యాప్తంగా అంగన్‌వాడీ వర్కర్లు కలెక్టరేట్‌కు ఎదురు ధర్నా నిర్వహించారు.
 13న - పంచాయతీ ఎన్నికలకు జిల్లా వ్యాప్తంగా ప్రచార పర్వం ముగిసింది.
 23న  - జిల్లాలో తొలిదశ పంచాయతీ ఎన్నికలకు పోలింగ్‌పూర్తి. అధిక పంచాయతీలను కైవసం చేసుకున్న వైఎస్‌ఆర్‌సీపీ
 25న - రాష్ట్ర విభజన వ్యవహారంలో కాంగ్రెస్ తీరుకు నిరసనగా వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మేకతోటి సుచరితలు రాజీనామా చేశారు.
 
 జూన్
 17న - రాజ్యసభ సభ్యులు జేడీ శీలం కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
 18న-  మాజీ క్రికెటర్ పద్మ శ్రీ వీవీఎస్ లక్ష్మణ్ మంగళగిరిలోని ఏసీఏ క్రికెట్ అకాడమీని సందర్శించి ఔత్సాహిక క్రీడాకారుల్ని అభినందించారు.
 19న - ప్రముఖ ఆలూరి భుజంగరావు గుంటూరులో మరణించారు. అంత్యక్రియలకు వరవరరావు, హాజరయ్యారు.
 24న  - చిలకలూరిపేటలో వైఎస్‌ఆర్‌సీపీ ప్రాంతీయ సదస్సు. ముఖ్యఅతిథిగా వైఎస్ విజయమ్మ హాజరు. ఇదే రోజున కేంద్రమంత్రులు చిరంజీవి, జేడీ శీలం, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలు గుంటూరులో పర్యటించారు.
 
 ఆగస్టు
 2న - జిల్లాలో మొదలైన సమైక్యాంధ్ర ఆందోళనలు, మొదటి వైఎస్‌ఆర్‌సీపీ ప్రారంభించింది.
 12న - సమైక్యాంధ్ర కోసం జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు సమ్మెలో పాల్గొనడంతో బస్సులన్నీ నిలిచిపోయాయి.
 15న - హైదరాబాద్ నుంచి గుంటూరు వస్తోన్న టీడీపీ నేత,గుంటూరు మాజీ ఎంపీ లాల్‌జాన్‌బాషా రోడ్డుప్రమాదంలో దుర్మరణం చెందారు.
 18న - రాష్ట్రానికి సమన్యాయం జరగాలని కోరుతూ వైఎస్ విజయమ్మ గుంటూరులో సమరదీక్ష చేపట్టారు.
 24న  -  సమరదీక్షలో ఉన్న వైఎస్ విజయమ్మను  పోలీసులు అర్ధరాత్రి అరెస్టు చేశారు.
 
 సెప్టెంబర్

   2న - జిల్లాలో చంద్రబాబునాయుడు ఆత్మగౌరవయాత్ర ప్రారంభమైంది.
 11న - జిల్లాలో షర్మిల సమైక్య శంఖారావం ప్రారంభమైంది.
 15న -సమైక్యాంధ్ర ఉద్యమం జిల్లావ్యాప్తంతా ఉవ్వెత్తున ఎగసిపడింది.
 18న - అనుమతి లేకుండా సమైక్య సభలు జరిపారని కోడెల, పత్తిపాటి, జీవీలపై పోలీసుల కేసు నమోదు  చేశారు.
 23న - వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి బెయిల్ లభించిన కారణంగా జిల్లా అంతటా సంబరాలు అంబరాన్నంటాయి.
 
 అక్టోబర్
 2న  - సమైక్యాంధ్ర కోసం జిల్లా వ్యాప్తంగా వైఎస్‌ఆర్‌సీపీ దీక్షలు ప్రారంభం
 4న  - సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలో 72 గంటల బంద్ ప్రారంభమై విజయవంతమైంది.
 8న - జిల్లాకు కొత్త జాయింట్ కలెక్టర్‌గా వివేక్‌యాదవ్ బాధ్యతలు స్వీకరించారు.
 10న - జిల్లాను తాకిని పై-లీన్ తుపాను రైతాంగాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. 22 నుంచి 27 వరకూ కురిసిన భారీ వర్షాలు రైతుల్ని నట్టేట ముంచాయి.  
 
  నవంబర్
  6న - సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా జిల్లా అంతటా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రహదారుల బంద్ కార్యక్రమాన్ని నిర్వహించింది.
 9న  - తెనాలికి చెందిన ప్రముఖ సినీహాస్యనటుడు ఏవీఎస్ కన్నుమూత.  జిల్లా కళారంగం విషాదంలో మునిగిపోయింది.
 11న - జిల్లా అంతటా ప్రభుత్వం రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంభించింది.
 14న - మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణారావు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్‌ఆర్‌సీపీలో చేరారు.
 
 
 డిసెంబర్
 4న  - కృష్ణా మిగులు జలాల్లో న్యాయం చేయాలన్న డిమాండ్‌తో వైఎస్ విజయమ్మ పులిచింతల ప్రాజెక్టు దగ్గర ధర్నా నిర్వహించారు.
 7న - పులిచింతల ప్రాజెక్టును సీఎం కిరణ్‌కుమార్ ప్రారంభించారు.
 8న - ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గం వైఎస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త గొట్టిపాటి నరశింహారావు మరణించడంతో ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు వైఎస్ జగన్ చిలకలూరిపేట వచ్చారు.
 9న  - మాజీ ఎంపీ  మాదాల నారాయణస్వామి గుంటూరులో కన్నుమూశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement