yarapatineni srinivasarao
-
‘అది తెలిసే చంద్రబాబు చిల్లర వేషాలు’
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా టీడీపీ నేతలపై విమర్శలు గుప్పించారు. యరపతినేని కేసు సీబీఐకి వెళ్తోందని తెలియగానే చంద్రబాబు మళ్లీ చిల్లర వేషాలు మొదలు పెట్టారని ఆరోపించారు. పల్నాడులో అరాచకాలు బయటకు రాకుండా చంద్రబాబు ఎదురు దాడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే బాబు డ్రామా వికటించినా.. నిద్ర పోతున్న పల్నాడుయేతర పచ్చనేతలను మేల్కొల్పిందన్నారు. ఫలితంగానే చలో ఆత్మకూర్‌కు ప్రత్తిపాటి, కోడెల, యరపతినేని రాకపోయినా.. అచ్చెన్నాయుడు, కాలువ శ్రీనివాసులు వచ్చారని విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు. ‘పల్నాడు ప్రాంతంలో చట్టంతో దోబూచులాడుతున్న తీసేసిన తాహసీల్దార్లకు ధైర్యాన్ని ఇవ్వడానికి చంద్రబాబు గారు చేపట్టిన డ్రామా వికటించినా.. నిదురపోతున్న పల్నాడుయేతర పచ్చనేతలను మేల్కొల్పింది. ప్రత్తిపాటి, కోడెల, యరపతినేని రాకపోయినా, బహుదూరాల నుంచి అచ్చెన్నాయుడు, కాలువ శ్రీనివాసులు వచ్చారు’ అన్నారు. ‘గత ఏడాది తన ‘వాళ్లపై’ ఐటి, ఈడీలు కేసులు పెడితే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని, మోదీని గద్దె దింపుతానని చంద్రబాబు వార్నింగులిచ్చేవాడు. ఇప్పడు యరపతినేని కేసు సీబీఐకి వెళ్తోందని తెలియగానే మళ్లీ చిల్లర వేషాలు మొదలు పెట్టాడు. పల్నాడులో అరాచకాలు బయటకు రాకుండా ఎదురు దాడి చేస్తున్నాడు’ అని విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. (చదవండి: టీడీపీ నేతల బండారం బట్టబయలు) -
రెండు వర్గాల ఘర్షణకు రాజకీయ రంగు!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఉద్యోగాల విప్లవం, వరుసగా పలు సంక్షేమ పథకాల అమలుతో ప్రభుత్వానికి లభిస్తున్న ఆదరణతో ఆందోళన చెందుతున్న ప్రతిపక్ష నేత చంద్రబాబు దీని నుంచి జనం దృష్టి మళ్లించడమే లక్ష్యంగా పల్నాడు ముసుగులో రాజకీయ క్రీడకు తెరతీశారు. పల్నాడును అక్రమ మైనింగ్‌తో కబళించిన యరపతినేని శ్రీనివాసరావు, కుటుంబంతో కలసి అధికార దుర్వినియోగానికి పాల్పడిన కోడెల శివప్రసాదరావు అక్రమాలపై ఐదేళ్లలో ఏనాడూ నోరు మెదపకుండా ఇప్పుడు ఓ గ్రామంలో రెండు వర్గాల మధ్య జరిగిన చిన్నపాటి ఘర్షణను చంద్రబాబు భూతద్దంలో చూపుతూ నానా రభస సృష్టిస్తున్నారు. పునరావాసానికి టీడీపీలోనే మద్దతు కరువు తన హయాంలో పల్నాడులో జరిగిన అరాచకాలను మరచిపోయి వైఎస్సార్సీపీ బాధితుల పునరావాస కేంద్రం పేరుతో చంద్రబాబు ప్రారంభించిన నాటకానికి సొంత పార్టీలోనే మద్దతు కరువవడం గమనార్హం. ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలను శాంతి భద్రతల సమస్యగా, కక్ష సాధింపుగా చిత్రీకరిస్తూ రాజకీయ లబ్ధి పొందేందుకు వారం నుంచి శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. పునరావాస కేంద్రం ఏర్పాటును టీడీపీ నాయకులే పట్టించుకోలేదు. చంద్రబాబు రాద్ధాంతానికి ఎంచుకున్న ఆత్మకూరు గ్రామం గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో ఉండగా అక్కడి నుంచి బాధితుల పేరుతో కొందరిని పునరావాస కేంద్రంలో ఉంచారు. మాచర్లలో టీడీపీ తరఫున పోటీచేసి ఓడిపోయిన అంజిరెడ్డి ఇంతవరకూ ఆ కేంద్రం ఛాయలకే రాలేదు. టీడీపీ అధికారంలో ఉండగా గురజాలతోపాటు మాచర్ల నియోజకవర్గాల్లో దౌర్జన్యాలు సాగించిన యరపతినేని శ్రీనివాసరావు చివరిరోజు వరకూ అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. చంద్రబాబు ఒత్తిడితో మంగళవారం బలవంతంగా అక్కడకు వచ్చి కొద్దిసేపు ఉండి వెళ్లిపోయారు. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కూడా దీన్ని పట్టించుకోకపోగా మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ తదితరులు అంటీముట్టనట్టు వ్యవహరించారు. పల్నాడు పేరుతో హంగామా చేసినా ఆ ప్రాంతానికి చెందిన టీడీపీ ముఖ్య నాయకులే ఈ తంతుకు తూతూమంత్రంగా హాజరవటాన్ని బట్టి ఇదంతా చంద్రబాబు మంత్రాంగమేనని స్పష్టమవుతోంది. యరపతినేని, కోడెల దురాగతాలను కప్పిపుచ్చే యత్నం గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటు, సచివాలయాల్లో లక్షల సంఖ్యలో ఉద్యోగ నియామకాలు ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. ఒక్క రిమార్కు కూడా లేకుండా 20 లక్షల మంది అభ్యర్థులకు విజయవంతంగా పరీక్షలను నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వంపై యువతలో ఆదరణ మరింత పెరిగిన నేపథ్యంలో దానిపై చర్చ జరగకుండా చేసే దురుద్దేశంతో చంద్రబాబు ఈ రాద్ధాంతం మొదలుపెట్టారు. సంక్షేమ పథకాల ద్వారా ముందుకెళుతున్న ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టడం, శాంతి భద్రతల సమస్యను సృష్టించడం ద్వారా రాజకీయ లబ్ధి పొందేందుకు వైఎస్సార్సీపీ బాధితుల పునరావాస కేంద్రం పేరుతో హడావుడి చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందుకే పల్నాడుకు చెందిన టీడీపీ నాయకులు ముందుకు రాకపోయినా బాధితులున్నారంటూ హంగామా చేస్తున్నారనే వాదన వినిపిస్తోంది. ఐదేళ్లు పల్నాడులో యరపతినేని శ్రీనివాసరావు చేసిన అరాచకాలపై చంద్రబాబు నోరు మెదపలేదు. అక్రమ మైనింగ్, పోలీసు వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకుని యరపతినేని చేసిన సెటిల్మెంట్లు, దందాలకు చంద్రబాబు తనయుడు, మాజీ మంత్రి లోకేష్ అండగా నిలిచారు. యరపతినేని అక్రమ మైనింగ్‌ను కోర్టు తప్పు పట్టగా ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని సీబీఐకి అప్పగించాలని నిర్ణయించింది. మరోవైపు టీడీపీ హయాంలో స్పీకర్‌గా పనిచేసిన కోడెల శివప్రసాదరావు, ఆయన కుమారుడు, కుమార్తె సాగించిన దౌర్జన్యాలపై బాధితులు పోలీస్ స్టేషన్లకు క్యూ కట్టిన విషయం తెలిసిందే. వీటన్నింటిపై మౌనముద్ర వహించిన చంద్రబాబు పల్నాడులో ఏదో జరిగిపోయిందని దుష్ప్రచారం చేయడం ద్వారా తమ పార్టీ నేతల దురాగతాలను కప్పిపెట్టే వ్యూహం కూడా ఉన్నట్లు చెబుతున్నారు. బురద చల్లడమే లక్ష్యం శాంతిభద్రతల సమస్య ఉందని తప్పుడు ప్రచారం చేయడం ద్వారా ప్రభుత్వంపై బురద జల్లడం, యరపతినేని, కోడెల తదితరుల అరాచకాలను కప్పి పుచ్చడం, సంక్షేమ కార్యక్రమాలపై చర్చ జరగకుండా ప్రజలను తప్పుదోవ పట్టించడమే లక్ష్యంగా చంద్రబాబు ఇప్పుడు చలో ఆత్మకూరు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. గుంటూరులో ఏర్పాటుచేసిన బాధితుల పునరావాస కేంద్రానికి తరలించిన వారిపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందులో కొందరు పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చారని, టీడీపీ నేత జీవీ ఆంజనేయులు రోజుకు రూ.7 వేల చొప్పున ఇచ్చి కొందరిని బాధితులుగా చూపిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. నేతల గృహ నిర్బంధం వైఎస్సార్సీపీ, టీడీపీ చలో ఆత్మకూరుకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడడంతో ఇరు పార్టీల నేతలను పోలీసులు గృహ నిర్భంధం చేస్తున్నారు. జిల్లాల నుంచి గుంటూరుకు బయలుదేరిన నాయకులను పోలీసులు మంగళవారం సాయంత్రం నుంచే ఎక్కడికక్కడ నిలిపివేయడం ప్రారంభించారు. చలో ఆత్మకూరుకు అనుమతి లేదని ప్రకటించిన డీజీపీ గౌతమ్ సవాంగ్ ఎవరూ ఈ కార్యక్రమానికి రావద్దని స్పష్టం చేశారు. అయినా పలు జిల్లాల నుంచి వైఎస్సార్సీపీ, టీడీపీ నాయకులు ఆత్మకూరుకు బయలుదేరుతున్నారనే సమాచారంతో పోలీసులు చర్యలు చేపట్టారు. -
మైనింగ్ మాఫియాకు మూడినట్టే..!
సాక్షి, అమరావతి బ్యూరో/సాక్షి అమరావతి: గుంటూరు జిల్లా పల్నాడులో టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అక్రమ మైనింగ్ వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) విచారణ కోరాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంపై పల్నాడు ప్రజల్లో, యరపతినేని బాధితుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సీబీఐ విచారణతో గత ఐదేళ్లుగా యరపతినేని సాగించిన ఖనిజ దందా, మనీలాండరింగ్, భూమాఫియా వ్యవహారాలు బట్టబయలవుతాయని మేధావులు, అధికారులు అంటున్నారు. ‘తెల్ల సున్నపురాయి తవ్విన గోతులను కొలిస్తే ఎన్ని టన్నులు అక్రమంగా (మైనింగ్ లీజు, పర్మిట్లు లేకుండా) తవ్వారో తేలిపోతుంది. దీంతో ఖజానాకు ఎంత రాయల్టీ, పెనాల్టీ ఎగవేశారో బట్టబయలవుతుంది. ఖజానాకు జరిగిన నష్టంతోపాటు అపరాధ రుసుం కూడా వసూలు చేయడానికి సీబీఐ విచారణ దోహదపడుతుంది. యరపతినేని సాగించిన అక్రమ మైనింగ్, ప్రశ్నించినవారిపై పెట్టిన అక్రమ కేసులు, సాగించిన అరాచకాలు ఒక్కొక్కటిగా బయట్టబయలవుతాయి. దీంతో ఆయన శిక్ష నుంచి తప్పించుకోలేరు’ అని అధికారులతోపాటు టీడీపీ వర్గాలు కూడా అభిప్రాయపడుతున్నాయి. మరోవైపు అక్రమ మైనింగ్ వ్యవహారంతో సంబంధం ఉన్న టీడీపీ నేతలు హడలిపోతున్నారు. తమ గుట్టు రట్టు అవుతుందని ఆందోళన చెందుతున్నారు. యరపతినేనికి సహకరించిన అధికారులు కూడా బెంబేలెత్తిపోతున్నారు. యరపతినేని కేసు పూర్వాపరాలివీ.. - టీడీపీ ప్రభుత్వ పెద్దల అండతో గురజాల నియోజకవర్గంలోని కోనంకి, కేశానుపల్లి, నడికుడి, తదితర క్వారీల్లో 96 లక్షల టన్నుల తెల్ల సున్నపురాయిని లీజులు తీసుకోకుండా, పర్మిట్లు లేకుండా అక్రమంగా తవ్వుకున్న నాటి టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు - ఎలాంటి అనుమతులు లేకుండా తవ్వకాలకు వేల టన్నుల పేలుడు పదార్థాల వినియోగం - ప్రభుత్వానికి ఎటువంటి రాయల్టీ, పెనాల్టీ చెల్లించకుండా రూ.536 కోట్ల దోపిడీ - అక్రమ మైనింగ్‌పై హైకోర్టులో 2015లో పిల్ దాఖలు చేసిన కె.గురవాచారి.. - అక్రమ మైనింగ్‌ను నిలిపివేయాలని, అక్రమంగా తరలించిన ఖనిజానికి రాయల్టీని పెనాల్టీతో సహా వసూలు చేయాలని 2016లో ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు - అసలు నిందితుడు యరపతినేనిని వదిలేసి అనామకులైన 11 మందిపై కేసులు పెట్టి చేతులు దులుపుకున్న మైనింగ్ అధికారులు - ఎంత ఖనిజాన్ని అక్రమంగా తరలించారో లెక్కకట్టని వైనం. రాయల్టీని పెనాల్టీతో సహా వసూలు చేయకుండా హైకోర్టు ఉత్తర్వుల పట్ల నిర్లక్ష్యం అక్రమ మైనింగ్‌లో యరపతినేని హస్తాన్ని ధ్రువీకరించిన లోకాయుక్త - హైకోర్టు, లోకాయుక్త ఆదేశాలను టీడీపీ సర్కార్ తేలికగా తీసుకోవడంతో అక్రమ మైనింగ్‌పై శాటిలైట్ చిత్రాల ద్వారా ఆధారాలు సేకరించి 2016లో హైకోర్టులో పిల్ దాఖలు చేసిన మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డి - గతేడాది హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో కేసు తీవ్రతను తగ్గించేందుకు సీఐడీకి అప్పగించిన టీడీపీ సర్కార్ నిజమైన దోషులను శిక్షించాలి పల్నాడులో జరిగిన అక్రమాలను వెలికితీయడానికి కేసును సీఎం సీబీఐకి అప్పగించారు. నిజమైన దోషులను శిక్షించాలి. దోచుకున్న సొమ్మును వడ్డీతో సహా వసూలు చేయాలి. –కాసు మహేశ్ రెడ్డి, గురజాల ఎమ్మెల్యే శుభపరిణామం అక్రమాలు, అన్యాయం చేసినవారు చట్టానికి ఎప్పుడూ అతీతులు కారు. కోర్టు సూచన మేరకు ప్రభుత్వం అక్రమ మైనింగ్ కేసును సీబీఐకి అప్పగించడం శుభ పరిణామం. – టీజీవీ కృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ -
ప్రజాప్రతినిధుల నిర్బంధం అప్రజాస్వామికం
-
ఇసుక మాఫియా : టీడీపీ ఎమ్మెల్యేపై హైకోర్టు ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్ : టీడీపీ సీనియర్ నేత, గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుపై మైనింగ్ ఆరోపణల వ్యవహారంలో హైకోర్టు తీవ్ర వాఖ్యలు చేసింది. ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మైనింగ్ విషయమై బుధవారం నాడు హైకోర్టులో విచారణ జరిగింది. మైనింగ్ చేస్తూ ప్రభుత్వానికి పన్నులు చెల్లించకపోవడం విషయమై హైకోర్టు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. మైనింగ్ పన్నులను ఎందుకు వసూలు చేయలేదో చెప్పాలని కోర్టు అధికారులను ప్రశ్నించింది. ప్రభుత్వ ఖజానాకు ఎంత నష్టం వాటిల్లిందో కాగ్ ద్వారా దర్యాప్తు జరిపిస్తామని స్పష్టం చేసింది. మైనింగ్ వ్యవహారంపై శ్రీనివాసరావుకు నోటీసులు కూడా జారీ చేసింది. సీబీఐ, కాగ్, కేంద్ర మైనింగ్ శాఖలను సుమోటోగా ప్రతివాదులుగా చేర్చింది. అనంతరం తదుపరి విచారణను ఆగస్టు 21కి వాయిదా వేసింది. -
‘లోకేష్‌కు కప్పం కడుతున్న ఎమ్మెల్యే’
సాక్షి, గుంటూరు : టీడీపీ నేతలు అధికార మదంతో ప్రవర్తిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. సహజ వనరులను అడ్డంగా దోచుకుంటున్న గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ ఆగడాలకు అధికారులు వంత పాడుతున్నారని అన్నారు. పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు కొడుకు లోకేష్ బాబుకు కప్పం కడుతూ మైనింగ్ పేరుతో శ్రీనివాస్ అందినంత దోచుకుంటున్నారని అంబటి ఆరోపించారు. గురజాలలో ఇంత బహిరంగ దోపిడీ జరుగుతున్న అధికారులు చోద్యం చూస్తున్నారని విమర్శించారు. గురజాల వైఎస్సార్ సీపీ సమన్వయకర్త కాసు మహేష్ రెడ్డి మట్లాడుతూ.. పవిత్రమైన పల్నాడులో గంజాయి, నాటు సారా ఏరులై పారుతోందని ధ్వజమెత్తారు. మైనర్ బాలికపై టీడీపీ నేతలు, కార్యకర్తలు అత్యాచారానికి పాల్పడటం సిగ్గుచేటని అన్నారు. మైనింగ్ అక్రమాలకు పాల్పడుతున్న ఎమ్మెల్యే యరపతినేనిపై సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేపై ఆరోపణలు నిరూపించలేకపోతే రాజకీయం సన్యాసం తీసుకుంటానని మహేష్ రెడ్డి సవాల్ చేశారు. -
కాలం మదిలో...కరిగిన జ్ఞాపకాలు
జనవరి 1న- పేరేచర్ల సమీపంలోని కైలాసగిరిలో విశ్వకల్యాణ మహాయజ్ఞం ప్రారంభమైంది. 8న- హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో ఉన్న గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావును గుంటూరు పోలీసులు అరెస్టు చేశారు. 18న- నాగార్జున విశ్వవిద్యాలయం ఎదుట హిందూ చైతన్య శిబిరం ప్రారంభమైంది. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్‌భగవత్, బీజేపీ నేత వెంకయ్య నాయయుడులు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. 28న- బైబిల్ మిషన్ మహాసభలుప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథులుగా వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నాయకురాలు వై.ఎస్.విజయమ్మ, బ్రదర్ అనిల్‌కుమార్‌లు హాజరయ్యారు. ఫిబ్రవరి 1న- సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆవరణలో విద్యార్థి గర్జన జరిగింది. 5న- జిల్లాలో చంద్రబాబు నాయుడు ‘మీకోసం వస్తున్నా’ పాదయాత్ర మొదలు పెట్టారు. 16న- జిల్లా అంతటా భారీ వర్షం కురిసింది. గుంటూరునగరం పూర్తిగా జలమయం అయింది. 21న- కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల శాసనమండలి ఎన్నికలకు పోలింగ్జరిగింది. 24న-గుంటూరు మిర్చి యార్డులో జరిగిన అక్రమాలపై రెండవ విడతవిచారణ జరిగింది. 28న పిడుగురాళ్ల మండలం పందిటివారిపాలెం నుంచి వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్రను ప్రారంభించారు. మార్చి 1న- జెడ్పీ సీఈవో జయప్రకాశనారాయణ నల్గొండ జిల్లా సీఈవోగా బదిలీ అయ్యారు. 1న - సమాచారహక్కు కమిషనర్ విజయబాబు జిల్లాలో పర్యటించారు. 2న - డీసీసీబీ చైర్మన్‌గా ముమ్మనేని వెంకట సుబ్బయ్య ఏకగ్రీవంగా, డీసీఎంఎస్ అధ్యక్షుడిగా ఇక్కుర్తి సాంబశివరావు ఎన్నికయ్యారు. 3న - ఆప్కో చైర్మన్‌గా మంగళగిరికి చెందిన మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావు నియమితులయ్యారు. 15న - గుంటూరులో డివిజన్‌స్థాయి రైల్మేళా ప్రారంభమయ్యాయి. 21న- జిల్లా జాయింట్ కలెక్టర్‌గా మురళీధర్‌రెడ్డి బాధ్యతలు స్వీకారం ఏప్రిల్ 3న - కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన పరిష్కారం సెల్‌ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి హాజరయ్యారు. 3న - గురజాలను రెవెన్యూ డివిజన్‌గా ప్రభుత్వం ప్రకటించింది. 6న - తెనాలిలో వైభవంగా తిరుమలేశుని కల్యాణం జరిగింది. టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు, స్పీకర్ నాదెండ్ల మనోహర్ హాజరయ్యారు. 11న -సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఫిరంగిపురంలో పర్యటించారు. 17న - గుంటూరు మున్సిపల్ కమిషనర్‌గా కె.వెంకటేశ్వర్లు నియమితులయ్యారు. 27న - రాష్ట్ర గవర్నర్ నరసింహన్ మంగళగిరి లక్ష్మీనరసింహస్వామిని దర్శించారు. మే 3న - రొంపిచర్ల మండలం అన్నవరప్పాడు సమీపంలో లారీ ఢీ కొని ఇద్దరు మహిళలు దుర్మరణం చెందారు. 9న - గుంటూరులో జరిగిన రైతు సదస్సుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి హాజరయ్యారు. 12న - పిడుగుపాటుకు చౌడవరం, యడ్డపాడు, నాదెండ్ల ప్రాంతాలకు చెందిన ముగ్గురు మృతి చెందారు. 19న - చిలకలూరిపేట సమీపంలోని చౌడవరం వద్ద జరిగిన రోడ్డుప్రమాదంలో ముగ్గురు మరణించారు. మృతుల్లో మాజీ జెడ్పీటీసీ మల్లెల సత్యనారాయణ కూడా ఉన్నారు. 20న- బీఆర్స్టేడియంలో జరిగిన 10వ యూత్ ఫెస్టివల్ పోటీల్లో ఓవరాల్ చాంఫ్గా కేరళ జట్టు నిలిచింది. 26న- బాపట్లలో ముగిసిన ప్రథమాంధ్ర మహాసభ శతాబ్ధి వే డుకలకు తమిళనాడు గవర్నర్ రోశయ్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జూలై 3న - జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. 10న - హక్కుల సాధన కోసం జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్లు కలెక్టరేట్‌కు ఎదురు ధర్నా నిర్వహించారు. 13న - పంచాయతీ ఎన్నికలకు జిల్లా వ్యాప్తంగా ప్రచార పర్వం ముగిసింది. 23న - జిల్లాలో తొలిదశ పంచాయతీ ఎన్నికలకు పోలింగ్పూర్తి. అధిక పంచాయతీలను కైవసం చేసుకున్న వైఎస్ఆర్సీపీ 25న - రాష్ట్ర విభజన వ్యవహారంలో కాంగ్రెస్ తీరుకు నిరసనగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మేకతోటి సుచరితలు రాజీనామా చేశారు. జూన్ 17న - రాజ్యసభ సభ్యులు జేడీ శీలం కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 18న- మాజీ క్రికెటర్ పద్మ శ్రీ వీవీఎస్ లక్ష్మణ్ మంగళగిరిలోని ఏసీఏ క్రికెట్ అకాడమీని సందర్శించి ఔత్సాహిక క్రీడాకారుల్ని అభినందించారు. 19న - ప్రముఖ ఆలూరి భుజంగరావు గుంటూరులో మరణించారు. అంత్యక్రియలకు వరవరరావు, హాజరయ్యారు. 24న - చిలకలూరిపేటలో వైఎస్ఆర్సీపీ ప్రాంతీయ సదస్సు. ముఖ్యఅతిథిగా వైఎస్ విజయమ్మ హాజరు. ఇదే రోజున కేంద్రమంత్రులు చిరంజీవి, జేడీ శీలం, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలు గుంటూరులో పర్యటించారు. ఆగస్టు 2న - జిల్లాలో మొదలైన సమైక్యాంధ్ర ఆందోళనలు, మొదటి వైఎస్ఆర్సీపీ ప్రారంభించింది. 12న - సమైక్యాంధ్ర కోసం జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు సమ్మెలో పాల్గొనడంతో బస్సులన్నీ నిలిచిపోయాయి. 15న - హైదరాబాద్ నుంచి గుంటూరు వస్తోన్న టీడీపీ నేత,గుంటూరు మాజీ ఎంపీ లాల్‌జాన్‌బాషా రోడ్డుప్రమాదంలో దుర్మరణం చెందారు. 18న - రాష్ట్రానికి సమన్యాయం జరగాలని కోరుతూ వైఎస్ విజయమ్మ గుంటూరులో సమరదీక్ష చేపట్టారు. 24న - సమరదీక్షలో ఉన్న వైఎస్ విజయమ్మను పోలీసులు అర్ధరాత్రి అరెస్టు చేశారు. సెప్టెంబర్ 2న - జిల్లాలో చంద్రబాబునాయుడు ఆత్మగౌరవయాత్ర ప్రారంభమైంది. 11న - జిల్లాలో షర్మిల సమైక్య శంఖారావం ప్రారంభమైంది. 15న -సమైక్యాంధ్ర ఉద్యమం జిల్లావ్యాప్తంతా ఉవ్వెత్తున ఎగసిపడింది. 18న - అనుమతి లేకుండా సమైక్య సభలు జరిపారని కోడెల, పత్తిపాటి, జీవీలపై పోలీసుల కేసు నమోదు చేశారు. 23న - వైఎస్ జగన్మోహన్రెడ్డికి బెయిల్ లభించిన కారణంగా జిల్లా అంతటా సంబరాలు అంబరాన్నంటాయి. అక్టోబర్ 2న - సమైక్యాంధ్ర కోసం జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ దీక్షలు ప్రారంభం 4న - సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలో 72 గంటల బంద్ ప్రారంభమై విజయవంతమైంది. 8న - జిల్లాకు కొత్త జాయింట్ కలెక్టర్‌గా వివేక్‌యాదవ్ బాధ్యతలు స్వీకరించారు. 10న - జిల్లాను తాకిని పై-లీన్ తుపాను రైతాంగాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. 22 నుంచి 27 వరకూ కురిసిన భారీ వర్షాలు రైతుల్ని నట్టేట ముంచాయి. నవంబర్ 6న - సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా జిల్లా అంతటా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రహదారుల బంద్ కార్యక్రమాన్ని నిర్వహించింది. 9న - తెనాలికి చెందిన ప్రముఖ సినీహాస్యనటుడు ఏవీఎస్ కన్నుమూత. జిల్లా కళారంగం విషాదంలో మునిగిపోయింది. 11న - జిల్లా అంతటా ప్రభుత్వం రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంభించింది. 14న - మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణారావు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. డిసెంబర్ 4న - కృష్ణా మిగులు జలాల్లో న్యాయం చేయాలన్న డిమాండ్‌తో వైఎస్ విజయమ్మ పులిచింతల ప్రాజెక్టు దగ్గర ధర్నా నిర్వహించారు. 7న - పులిచింతల ప్రాజెక్టును సీఎం కిరణ్‌కుమార్ ప్రారంభించారు. 8న - ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త గొట్టిపాటి నరశింహారావు మరణించడంతో ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు వైఎస్ జగన్ చిలకలూరిపేట వచ్చారు. 9న - మాజీ ఎంపీ మాదాల నారాయణస్వామి గుంటూరులో కన్నుమూశారు.