సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా టీడీపీ నేతలపై విమర్శలు గుప్పించారు. యరపతినేని కేసు సీబీఐకి వెళ్తోందని తెలియగానే చంద్రబాబు మళ్లీ చిల్లర వేషాలు మొదలు పెట్టారని ఆరోపించారు. పల్నాడులో అరాచకాలు బయటకు రాకుండా చంద్రబాబు ఎదురు దాడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే బాబు డ్రామా వికటించినా.. నిద్ర పోతున్న పల్నాడుయేతర పచ్చనేతలను మేల్కొల్పిందన్నారు. ఫలితంగానే చలో ఆత్మకూర్‌కు ప్రత్తిపాటి, కోడెల, యరపతినేని రాకపోయినా.. అచ్చెన్నాయుడు, కాలువ శ్రీనివాసులు వచ్చారని విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు.
‘పల్నాడు ప్రాంతంలో చట్టంతో దోబూచులాడుతున్న తీసేసిన తాహసీల్దార్లకు ధైర్యాన్ని ఇవ్వడానికి చంద్రబాబు గారు చేపట్టిన డ్రామా వికటించినా.. నిదురపోతున్న పల్నాడుయేతర పచ్చనేతలను మేల్కొల్పింది. ప్రత్తిపాటి, కోడెల, యరపతినేని రాకపోయినా, బహుదూరాల నుంచి అచ్చెన్నాయుడు, కాలువ శ్రీనివాసులు వచ్చారు’ అన్నారు.
‘గత ఏడాది తన ‘వాళ్లపై’ ఐటి, ఈడీలు కేసులు పెడితే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని, మోదీని గద్దె దింపుతానని చంద్రబాబు వార్నింగులిచ్చేవాడు. ఇప్పడు యరపతినేని కేసు సీబీఐకి వెళ్తోందని తెలియగానే మళ్లీ చిల్లర వేషాలు మొదలు పెట్టాడు. పల్నాడులో అరాచకాలు బయటకు రాకుండా ఎదురు దాడి చేస్తున్నాడు’ అని విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. (చదవండి: టీడీపీ నేతల బండారం బట్టబయలు)
Comments
Please login to add a commentAdd a comment