సాక్షి, అమరావతి: టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అరెస్ట్‌పై ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేస్తున్న రాజకీయంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా మండిపడ్డారు. ‘అరెస్ట్ చేస్తే కిడ్నాపు ఎలా అవుతుంది బాబు గారూ? అచ్చెన్న కుటుంబ సభ్యులు సైతం ఆ మాట అనలేదు. గొడవలు సృష్టించాలనే కుట్రతోనే గదా కిడ్నాప్ అని అరిచారు. అరెస్ట్ ప్రోటోకాల్స్ అన్నిటీనీ ఏసీబీ పాటించింది. స్కామ్ లో మీ పాత్ర బయట పడతుందనే భయంతోనే బట్టలు చించుకుంటున్నారు’అంటూ విజయసాయి రెడ్డి విమర్శించారు. (టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అరెస్ట్)
‘ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్ గా దొరికినపుడు ‘మీకు ఏసీబీ ఉంటే నాకూ ఏసీబీ ఉందని’ తెలంగాణా ప్రభుత్వంపై గర్జించావు కదా బాబు గారు. ఇప్పుడు అవినీతి కుంభకోణంలో అచ్చెన్నను అరెస్ట్ చేసేటప్పటికి అది చట్ట విరుద్ద సంస్థ అయిపోయిందా? అవినీతి మూలాలు కదులుతున్నాయని భయం పట్టుకుందా?’ అంటూ చంద్రబాబుపై మరో ట్వీట్‌లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. (రామ్మోహన్.. లోకేష్‌కు సమ ఉజ్జీనే)
‘దిగువ స్థాయి కార్మికులు, వారు పనిచేసే సంస్థలు చెల్లించే కంట్రిబ్యూషన్ తో నడిచే ఈఎస్‌ఐలో 900 కోట్ల అవినీతికి పాల్పడం సిగ్గు చేటు అనిపించడం లేదా బాబు గారూ. హెరిటేజ్ నెయ్యి కొనుగోలులో లీటరుకు రూ.150 ఎక్కువ వసూలు చేసారు. ప్రజాధనం ఉన్నది దోచుకోవడానికే అన్నట్టు జరిగింది మీపాలన’ అంటూ చంద్రబాబుపై ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు.
‘టీడీపీ అధ్యక్ష పదవికి ఎర్రన్న కుటుంబం పోటీకి వస్తోందని రూ.900 కోట్ల మందుల కొనుగోళ్ల కుంభకోణంలో కీలక డ్యాక్యుమెంట్లని లీక్ చేసిన చిట్టి నాయుడు టీం. అధికారంలో ఉన్నప్పుడు అవినీతి చెయించడం, వాటాలు పంచుకోవడం. అడ్డం అని అనుమానం రాగానే లీకులిచ్చి ఇరికించటం. అచ్చెన్న ఎవరెవరు వాటాలు పంచుకున్నారో ఏసీబీకి వెల్లడించాలి’ అంటూ విజయసాయిరెడ్డి మరో ట్వీట్ చేశారు.
#AvineethiAtchannaidu#TDPESIScam pic.twitter.com/CRDPHrzLd9
— Vijayasai Reddy V (@VSReddy_MP) June 12, 2020
#SaiRaaPunch #సైరాపంచ్ pic.twitter.com/1iGVPo0sS0
— Vijayasai Reddy V (@VSReddy_MP) June 12, 2020
అరెస్ట్ చేస్తే కిడ్నాపు ఎలా అవుతుంది బాబు గారూ? అచ్చెన్న కుటుంబ సభ్యులు సైతం ఆ మాట అనలేదు. గొడవలు సృష్టించాలనే కుట్రతోనే గదా కిడ్నాప్ అని అరిచారు. అరెస్ట్ ప్రోటోకాల్స్ అన్నిటీనీ ACB పాటించింది. స్కామ్ లో మీ పాత్ర బయట పడతుందనే భయంతోనే బట్టలు చించుకుంటున్నారు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) June 12, 2020
దిగువ స్థాయి కార్మికులు, వారు పనిచేసే సంస్థలు చెల్లించే కంట్రిబ్యూషన్ తో నడిచే ESI లో 900 కోట్ల అవినీతికి పాల్పడం సిగ్గు చేటు అనిపించడం లేదా బాబు గారూ. హెరిటేజ్ నెయ్యి కొనుగోలులో లీటరుకు రూ.150 ఎక్కువ వసూలు చేసారు. ప్రజాధనం ఉన్నది దోచుకోవడానికే అన్నట్టు జరిగింది మీపాలన.
— Vijayasai Reddy V (@VSReddy_MP) June 12, 2020
ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్ గా దొరికినపుడు ‘మీకు ఏసీబీ ఉంటే నాకూ ఏసీబీ ఉందని’ తెలంగాణా ప్రభుత్వంపై గర్జించావు కదా బాబు గారు. ఇప్పుడు అవినీతి కుంభకోణంలో అచ్చెన్నను అరెస్ట్ చేసేటప్పటికి అది చట్ట విరుద్ద సంస్థ అయిపోయిందా? అవినీతి మూలాలు కదులుతున్నాయని భయం పట్టుకుందా?
— Vijayasai Reddy V (@VSReddy_MP) June 12, 2020
Comments
Please login to add a commentAdd a comment