
ఓ వృద్దుడు అత్యంత అరుదైన పరిస్థితిని ఎదుర్కొన్నాడు. నూటికి ఒక్కరికి వచ్చే సమస్యతో నరకం చూశాడు. పాపం ఈసమస్యతో తినడం కూడా మానేశాడు. దీంతో రోజుల వ్యవధిలోనే ఐదు కిలోలు బరువు తగ్గిపోయాడు. వైద్యులు సైతం అతడి పరిస్థితిని చూసి విస్తుపోయారు. ఇంతకీ అతడికీ ఏం వ్యాధి వచ్చిందంటే..
90 ఏళ్ల వృద్ధుడు గత కొద్ది రోజులుగా అత్యంత అరుదైన విరామ హెర్నియాతో బాధపడ్డాడు. దీని కారణంగా కడుపు ఛాతీ భాగంలోకి చొచ్చుకు వచ్చి.. తిన్న ఆహారం వాంతి రూపంలో బయటకు వచ్చేసేది. ఇక్కడ పొట్టలో ఆహారం ఇమడక వెనక్కి వాంతి రూపంలో వచ్చేటప్పుడూ ఉండే బాధకు తాళ్లలేకపోయాడు. దీంతో అతడు తినడమే మానేశాడు. దెబ్బకు ఆ వృద్ధుడి కేవలం 11 రోజుల వ్యవధిలోనే ఏకంగా 5 కిలోల మేర బరువు తగ్గిపోయాడు.
ఇక్కడ హెర్నియా అనేది సాధారణ సమస్యే. ఒక అవయవం లేదా కణజాలం బలహీనమైన ప్రదేశం ద్వారా పొడుచుకు వచ్చినప్పుడు లేదా చుట్టుపక్కల కండరాలు లేదా బంధన కణజాలంలో చిరిగిపోయినప్పుడు అవి సంభవిస్తాయి. హెర్నియాలు తరచుగా ప్రాణాంతకం కానప్పటికీ, అవి అసౌకర్యాన్ని కలిగిస్తాయి. ఇక్కడ ఈ వృద్ధుడికి వచ్చిన పరిస్థితి కాస్త క్రిటికల్.
అతని కడుపులోని కొంత భాగం డయాఫ్రాగమ్‌లోని ఓపెనింగ్ ద్వారా ఛాతీలోకి నెట్టబడి ఊపిరితిత్తు కుదించుకుపోయేలా తీవ్రమైన పరిస్థితిని కలిగిస్తుంది. దీన్ని సివియర్ హయాటల్ హెర్నియా అనిపిలుస్తారు. ఇక్కడ వృద్ధుడి అధిక వయసు రీత్యా చాలా క్లిష్టమైన ఆపరేషన్ చేశారు వైద్యులు. డయాఫ్రాగమ్ లోపంను మూసి వేసి కడుపుని ఉదరకుహరంలోకి యథావిధిగా అమర్చారు. సదరు వృద్ధుడు కోలుకోవడమే గాక డిశ్చార్జ్ అయ్యి వెళ్లిపోయాడు కూడా.
(చదవండి: అత్యుత్తమమైన డైట్ ఇదే! నిర్థారించిన వైద్యులు!)