Hernia
-
90 ఏళ్ల వృద్దుడికి అరుదైన వ్యాధి..కడుపు ఛాతిలోకి చొచ్చుకుపోయి..
ఓ వృద్దుడు అత్యంత అరుదైన పరిస్థితిని ఎదుర్కొన్నాడు. నూటికి ఒక్కరికి వచ్చే సమస్యతో నరకం చూశాడు. పాపం ఈసమస్యతో తినడం కూడా మానేశాడు. దీంతో రోజుల వ్యవధిలోనే ఐదు కిలోలు బరువు తగ్గిపోయాడు. వైద్యులు సైతం అతడి పరిస్థితిని చూసి విస్తుపోయారు. ఇంతకీ అతడికీ ఏం వ్యాధి వచ్చిందంటే..90 ఏళ్ల వృద్ధుడు గత కొద్ది రోజులుగా అత్యంత అరుదైన విరామ హెర్నియాతో బాధపడ్డాడు. దీని కారణంగా కడుపు ఛాతీ భాగంలోకి చొచ్చుకు వచ్చి.. తిన్న ఆహారం వాంతి రూపంలో బయటకు వచ్చేసేది. ఇక్కడ పొట్టలో ఆహారం ఇమడక వెనక్కి వాంతి రూపంలో వచ్చేటప్పుడూ ఉండే బాధకు తాళ్లలేకపోయాడు. దీంతో అతడు తినడమే మానేశాడు. దెబ్బకు ఆ వృద్ధుడి కేవలం 11 రోజుల వ్యవధిలోనే ఏకంగా 5 కిలోల మేర బరువు తగ్గిపోయాడు. ఇక్కడ హెర్నియా అనేది సాధారణ సమస్యే. ఒక అవయవం లేదా కణజాలం బలహీనమైన ప్రదేశం ద్వారా పొడుచుకు వచ్చినప్పుడు లేదా చుట్టుపక్కల కండరాలు లేదా బంధన కణజాలంలో చిరిగిపోయినప్పుడు అవి సంభవిస్తాయి. హెర్నియాలు తరచుగా ప్రాణాంతకం కానప్పటికీ, అవి అసౌకర్యాన్ని కలిగిస్తాయి. ఇక్కడ ఈ వృద్ధుడికి వచ్చిన పరిస్థితి కాస్త క్రిటికల్.అతని కడుపులోని కొంత భాగం డయాఫ్రాగమ్‌లోని ఓపెనింగ్ ద్వారా ఛాతీలోకి నెట్టబడి ఊపిరితిత్తు కుదించుకుపోయేలా తీవ్రమైన పరిస్థితిని కలిగిస్తుంది. దీన్ని సివియర్ హయాటల్ హెర్నియా అనిపిలుస్తారు. ఇక్కడ వృద్ధుడి అధిక వయసు రీత్యా చాలా క్లిష్టమైన ఆపరేషన్ చేశారు వైద్యులు. డయాఫ్రాగమ్ లోపంను మూసి వేసి కడుపుని ఉదరకుహరంలోకి యథావిధిగా అమర్చారు. సదరు వృద్ధుడు కోలుకోవడమే గాక డిశ్చార్జ్ అయ్యి వెళ్లిపోయాడు కూడా.(చదవండి: అత్యుత్తమమైన డైట్ ఇదే! నిర్థారించిన వైద్యులు!) -
ఆస్పత్రిలో శ్రియా భర్త, ఎమోషనలైన హీరోయిన్
టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ శ్రియ వ్యాపారవేత్త ఆండ్రీ కొశ్చీవ్‌ను పెళ్లి చేసుకున్నాక కూడా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. అటు కెరీర్‌ను ఇటు ఫ్యామిలీని రెండింటినీ బ్యాలెన్స్‌గా ఉంచుతోందీ సుందరి. తన ఫ్యామిలీతో ఆస్వాదించే క్షణాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకునే శ్రియ తన భర్త ఆండ్రీ ఆసుపత్రిపాలైన విషయాన్ని ఆలస్యంగా వెల్లడించింది. హెర్నియాతో బాధపడుతున్న అతడికి అపోలో ఆస్పత్రిలో సర్జరీ జరిగింది. ఈ సర్జరీ విజయవంతం కావడంతో శ్రియా ఇన్స్టాగ్రామ్ వేదికగా ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. 'నా భర్తకు మంచి చికిత్స అందించిన అపోలో ఆస్పత్రి యాజమాన్యానికి ధన్యవాదాలు. సుమారు రెండు నెలల పాటు అతడు మా కూతురు రాధను కూడా ఎత్తుకోలేకపోయాడు. ఇప్పుడతడు కోలుకున్నాడు. ఇందుకు సాయపడిన అపోలో ఆస్పత్రి మేనేజ్‌మెంట్‌తోపాటు ఉపాసన కొణిదెల, డాక్టర్ రజనీష్ రెడ్డికి కృతజ్ఞతలు' అని శ్రియ రాసుకొచ్చింది. దీనికి ఆండ్రియో చేతికి బ్యాండేజీలతో దర్శనమిచ్చిన ఫొటోలను జత చేసింది. ఈ పోస్ట్‌పై స్పందించిన ఉపాసన అంతా సవ్యంగానే జరిగినందుకు సంతోషంగా ఉందని రిప్లై ఇచ్చింది. కాగా శ్రియా, ఆండ్రీలది ప్రేమవివాహం. దాదాపు ఏడేళ్లపాటు ప్రేమించుకున్న ఈ జంట 2018లో ఉదయ్‌పూర్ వేదికగా పెళ్లిపీటలెక్కింది. గతేడాది తనకు 9 నెలల కూతురు(రాధ) ఉన్నట్లు మీడియాకు వెల్లడించింది. ప్రస్తుతం శ్రియ హిందీలో 'దృశ్యం 2'లో నటిస్తోంది. View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) -
కోసేస్తారు..తీసేస్తారు..!
ఎంబీబీఎస్ చదవక పోయినా వారు డాక్టర్లుగా చెలామణీ అవుతున్నారు. పేరు ముందు డాక్టర్ అని బోర్డు తగిలించుకుని అబార్షన్లు, హెర్నియా, గర్భసంచి తొలగింపు వంటి శస్త్రచికిత్సలు చేస్తూ అనేక మంది మరణానికి కారణమవుతున్నారు. హైదరాబాద్‌లోనే ఇలాంటి శంకర్‌దాదా ఎంబీబీఎస్‌లు గల్లీకొకరు వెలుగు చూస్తుండటంపై సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. హైదరాబాద్: గ్రేటర్ పరిధిలో 1804 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు, నర్సింగ్ హోమ్‌లు ఉండగా వీటిలో కేవలం 800 ఆస్పత్రులకు మాత్రమే అనుమతులు ఉన్నాయి. మరో ఐదు వేలకుపైగా క్లీనిక్స్ ఉన్నాయి. వీటిలో ఒక్క హైదరాబాద్ జిల్లాలోనే 1200 వరకు ఉన్నాయి. మిగిలినవన్నీ శివారు ప్రాంతాల్లో ఉన్నాయి. వీటిలో ఏ ఒక్క దానికి అనుమతి లేదు. నిబంధనలకు విరుద్ధంగా క్లీనిక్‌లు నడుపుతూ ప్రజారోగ్యంతో చలగాటమాడుతున్న కొంత మంది ఆర్ఎంపీలను ఇటీవల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి విద్యార్హత లేకపోయినా పేరుకు ముందు డాక్టర్ అని చేర్చుకున్న వారిపై కేసులు నమోదు చేయడం విశేషం. హెర్నియా నుంచి అబార్షన్ల వరకు: బస్తీల్లోని నిరుపేదల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న వీరు గైనకాలజిస్టులుగా, జనరల్ ఫిజిషయన్స్గా, జనరల్ సర్జన్స్‌గా చలామణి అవుతున్నారు. హెర్నియా, అపెండిసైటీస్, అబార్షన్లు, గర్భసంచి తొలగింపు తదితర ఆపరేషన్లు చేస్తున్నారు. కొన్నిసార్లు అధిక రక్తస్త్రావం వల్ల రోగులు మృత్యువాతపడుతున్నారు. నగరంలోని చార్మినార్, బార్కాస్, చాంద్రాయణగుట్ట, కాటేదాన్, కంచన్‌బాగ్, బీఎన్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం, భూపేష్గుప్తానగర్, నందనవనం, మీర్పేట్, హస్తినాపూర్, హయత్‌నగర్, వనస్థలిపురం, మన్సూరాబాద్, బండ్లగూడ, బోడుప్పల్, రాజేంద్రనగర్, మల్కజ్గిరి, మాణికేశ్వరినగర్, కుత్బుల్లాపూర్ ప్రాంతాల్లో నకిలీ వైద్యుల బెడద ఎక్కువగా ఉన్నట్లు జిల్లా వైద్యాధికారులకు ఫిర్యాదులు అందగా, వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో దాడులు నిర్వహించి నకిలీ వైద్యులపై కేసులు నమోదు చేశారు. ఇదిలా ఉండగా వారు స్వయంగా డయాగ్నోస్టిక్ ల్యాబ్‌లు, మెడికల్ షాపులు నడుపుతున్నారు. వీటికి ఎలా ంటి అనుమతులు లేకపోవడం కొసమెరుపు. మచ్చుకు కొన్ని ఘటనలుః ఫిలింనగర్ దుర్గాభవానీనగర్‌లో ఓ నర్సింగ్‌హోంలో గర్భవతికి డాక్టర్ ఇంజెక్షన్ ఇవ్వడంతో తీవ్ర రక్తస్రావం కావడంతో శిశువుకు జన్మనిచ్చి మృతి చెందడం తీవ్ర కలకలం సృష్టించింది. ఓ నర్సు గాంధీ ఆస్పత్రిలో వైద్యురాలిగా పని చేస్తున్నట్లు చెప్పుకుంటూ రోగులకు చికిత్స చేస్తుండగా కంచన్‌బాగ్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తీరా సదరు మహిళ చదివింది బీఎస్సీనర్సింగ్ అని తెలిసి పోలీసులే నివ్వెర పోయారు. ఇటీవల చాంద్రాయణగుట్ట పరిధిలోని ఓ యునాని వైద్యుడు నొప్పితో బాధపడుతున్న ఓ రోగికి ఇంజక్షన్ ఇవ్వడంతో వికటించి మృతి చెందగా, శవాన్ని మూటలో కట్టి శంషాబాద్ సమీపంలో తగులబెడుతూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన సంఘటన సంచ లనం సృష్టించింది. లేఖ రాసినా..స్పందన లేదు: హైదరాబాద్ జిల్లా పరిధిలో 1804 ఆస్పత్రులు ఉండగా, వాటిలో 800 ఆస్పత్రులకు మాత్రమే అనుమతులు ఉన్నాయి. మరో 1100-1200 క్లీనిక్స్ ఉన్నట్లు గుర్తించిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వాటికి నోటీసులు జారీ చే శారు. అనుమతుల్లేని వాటికి మంచినీరు, డ్రైనేజీ, కరెంట్ సరఫరా నిలిపివేయాలని కోరుతూ జీహెచ్ఎంసీ సహా టీఎస్ఎస్పీడీసీఎల్కు లేఖ రాసినా వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఇక ఆర్ఎంపీలు నిర్వహించే క్లీనిక్స్ పై చర్యలు తీసుకునే అధికారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు లేక పోవడంతో వారేమీ చేయలేక పోతున్నారు. 16 మంది నకిలీ ఆర్ఎంపీ డాక్టర్లు అరెస్టు వైద్యం పేరుతో రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న 16 మంది నకిలీ ఆర్ఎంపీలను సైబరాబాద్ ఈస్ట్ ఎస్ఓటీ పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. షెడ్యూల్డ్ మందులు, ఇంజక్షన్లు, సెలైన్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. నకిలీ ఆర్ఎంపీలపై ఇటీవల పోలీసులకు ఫిర్యాదులు అందడంతో సైబరాబాద్ ఈస్ట్ ఎస్ఓటీ డీసీపీ రాంచంద్రారెడ్డి నేతృత్వంలో ఇన్స్పెక్టర్ కె.నర్సింగరావు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ఏకకాలంలో దాడులు నిర్వహించి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో పలువురు ప్రత్యేకంగా ఆస్పత్రులను నిర్వహిస్తుండటం గమనార్హం. అరెస్టయిన వారి వివరాలు.. కె.రామలింగయ్య(శ్రీనివాస క్లీనిక్), కాళిదాస్(డాక్టర్ కాళీదాస్ పాలీ క్లీనిక్), కృష్ణమూర్తి( (విజయ పాలీక్లీనిక్)), మోహనాచారి( శ్రీసాయి క్లీనిక్), ఎస్.నరసింహులు(శ్రీ వెంకటసాయి క్లీనిక్),డి.శంకర్, ఎస్ఎం హుస్సేన్(అన్సారి క్లీనిక్), ఎం.పవన్‌కుమార్(శ్రీసాయి అక్షర క్లీనిక్), జనార్థనాచారి,డి.చెన్నారెడ్డి( వినిషా క్లీనిక్)లతో పాటు మేడిపల్లి, నాచారంలో మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరు ఎలాంటి సర్టిఫికెట్లు లేకపోయినా క్లినిక్ లు ఏర్పాటు చేసి రోగులకు చికిత్స అందిస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. -
హెర్నియా అని వస్తే...గర్భసంచి..!
హెర్నియా చికిత్సకు వచ్చిన ఓ యువకుడి కడుపులో గర్భసంచి బయటపడింది. ఈ ఘటన చిత్తూరు జిల్లా కుప్పంలో చోటుచేసుకుంది. వివరాలివీ.. తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరి జిల్లా చిట్టిపల్లికి చెందిన అమర్నాథ్(23) కొన్ని రోజులుగా హెర్నియా(బుడ్డ)తో బాధపడుతున్నాడు. అతడు గురువారం కుప్పంలోని ప్రియా నర్సింగ్ హోంలో చికిత్స చేయించుకునేందుకు వచ్చాడు. ఆపరేషన్ చేసిన వైద్యులు అతడి కడుపులో గర్భసంచి ఉన్నట్లు గుర్తించి ఆశ్చర్యపోయారు. హెర్నియాను తొలగించటంతోపాటు గర్భసంచిని బయటకు తీసి చికిత్స పూర్తి చేశారు. ఈ విషయమై ఆస్పత్రి డాక్టర్లు మాట్లాడుతూ.. ఇది చాలా అరుదైన కేసని..ప్రతి 5కోట్లలో ఒకరికి మాత్రమే ఇలా జరిగే అవకాశం ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం అమర్నాథ్కు ఎటువంటి ప్రమాదం లేదని తెలిపారు. -
హెర్నియా కౌన్సెలింగ్
మహిళలకు కూడా హెర్నియా వస్తుందా? ఇటీవల మాకు తెలిసిన ఒక మహిళకు హెర్నియా వచ్చిందని తెలిసి ఆశ్చర్యపోయాను. హెర్నియా అంటే ఏమిటో తెలియజేయగలరు. - రోహిత్, సంగారెడ్డి హెర్నియా అన్నది పురుషులకూ, మహిళలకూ ఇద్దరికీ వచ్చే కండిషన్. బహుశా మీరు పురుషులకు వచ్చే హైడ్రోసిల్ కండిషన్‌ను హెర్నియాతో పోల్చుకుని, రెండో ఒకటే అని అపోహపడుతున్నట్లుగా అనిపిస్తోంది. మన కడుపులో ఉన్న అవయవాలూ, శరీర భాగాలు, పేగులు... ఇవన్నీ మన పొట్ట పైపొరల మీద అమరి ఉంటాయి. ఈ పొట్ట కండరాలు బలహీనంగా ఉన్నట్లయితే పొట్టలోపలి భాగాలు బలహీనంగా ఉన్న అబ్డామిన్ పొరల్లోంచి దూసుకొని లోపలికి వెళ్తాయి. అలాంటప్పుడు పురుషుల్లో ఆ పేగు వృషణాల సంచిలో కనిపించవచ్చు. అలాగే మహిళల్లో అబ్డామిన్ కండరాలు బలహీనంగా ఉంటే మన పొట్టలోని అవయవాలు అబ్డామిన్ కండరాలను దాటి లోపలికి వెళ్లవచ్చు. అలాంటప్పుడు ఆ అవయవాలను శస్త్రచికిత్స ద్వారా యథాస్థితికి తెచ్చి, మళ్లీ అలా దూరిపోకుండా అబ్డామిన్ కండరాలపైన ఒక వలలాంటి దాన్ని (మెష్‌ను) అమర్చుతారు. హెర్నియా ఉంటే తప్పక ఆపరేషన్ చేయించాల్సిందేనా? ఇది మందులతో తగ్గదా? - శ్రీనివాస్, గన్నవరం మామూలుగానైతే బలహీనమైన అబ్డామిన్ కండరాల్లోంచి పేగులు కిందికి జారిపోయే హెర్నియా అనే కండిషన్ అంత ప్రమాదకరమైనదేమీ కాదు. చాలా సందర్భాల్లో దీనికి నొప్పి కూడా ఉండదు. పడుకున్నప్పుడు పేగు తన యథాతథ స్థితికి రావడం లేదా చేత్తో తాకినప్పుడు వృషణాల సంచిలో పేగు తగలడం వంటి వాటితో హెర్నియాను గుర్తించవచ్చు. అయితే ఒక్కోసారి ఇది చాలా సమస్యాత్మకంగా మారుతుంది. అబ్డామిన్ పొరల్లోంచి దూసుకుపోయిన ఈ పేగులు ఒక్కోసారి అక్కడి ఖాళీలో ఇరుక్కుపోయి తీవ్రంగా బిగుసుకుపోతాయి. దీన్నే స్ట్రాంగ్యులేటెడ్ హెర్నియా అంటారు. అప్పుడు అలా ఇరుక్కున్న పేగులకు రక్తసరఫరా అందకుండా పోవడంతో పేగులు పాడైపోతాయి. అలాంటప్పుడు మెడికల్ ఎమర్జెన్సీగా పరిగణించి అత్యవసరంగా శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది. డాక్టర్ ఎం.ఏ. సలీమ్, సీనియర్ కన్సల్టెంట్ జనరల్ సర్జన్, కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్