Shriya Saran Says Husband Andrei Koscheev Undergoes Hernia Surgery - Sakshi
Sakshi News home page

Shriya Saran: ఆస్పత్రిలో శ్రియా భర్త, పాపను కూడా ఎత్తుకోలేకపోయాడంటూ ఎమోషనల్‌

Mar 2 2022 3:14 PM | Updated on Mar 2 2022 4:08 PM

Shriya Saran Says Husband Andrei Koscheev Undergoes Hernia Surgery - Sakshi

భర్త ఆండ్రియో ఆసుపత్రిపాలైన విషయాన్ని వెల్లడించింది శ్రియ. హెర్నియాతో బాధపడుతున్న అతడికి అపోలో ఆస్పత్రిలో సర్జరీ జరిగింది. ఈ సర్జరీ విజయవంతం కావడంతో శ్రియా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఎమోషనల్‌ పోస్ట్‌ షేర్‌ చేసింది.

టాలీవుడ్‌ బ్యూటిఫుల్‌ హీరోయిన్‌ శ్రియ వ్యాపారవేత్త ఆండ్రీ కొశ్చీవ్‌ను పెళ్లి చేసుకున్నాక కూడా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. అటు కెరీర్‌ను ఇటు ఫ్యామిలీని రెండింటినీ బ్యాలెన్స్‌గా ఉంచుతోందీ సుందరి. తన ఫ్యామిలీతో ఆస్వాదించే క్షణాలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకునే శ్రియ తన భర్త ఆండ్రీ ఆసుపత్రిపాలైన విషయాన్ని ఆలస్యంగా వెల్లడించింది. హెర్నియాతో బాధపడుతున్న అతడికి అపోలో ఆస్పత్రిలో సర్జరీ జరిగింది. ఈ సర్జరీ విజయవంతం కావడంతో శ్రియా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఎమోషనల్‌ పోస్ట్‌ షేర్‌ చేసింది.

'నా భర్తకు మంచి చికిత్స అందించిన అపోలో ఆస్పత్రి యాజమాన్యానికి ధన్యవాదాలు. సుమారు రెండు నెలల పాటు అతడు మా కూతురు రాధను కూడా ఎత్తుకోలేకపోయాడు. ఇప్పుడతడు కోలుకున్నాడు. ఇందుకు సాయపడిన అపోలో ఆస్పత్రి మేనేజ్‌మెంట్‌తోపాటు ఉపాసన కొణిదెల, డాక్టర్‌ రజనీష్‌ రెడ్డికి కృతజ్ఞతలు' అని శ్రియ రాసుకొచ్చింది. దీనికి ఆండ్రియో చేతికి బ్యాండేజీలతో దర్శనమిచ్చిన ఫొటోలను జత చేసింది. ఈ పోస్ట్‌పై స్పందించిన ఉపాసన అంతా సవ్యంగానే జరిగినందుకు సంతోషంగా ఉందని రిప్లై ఇచ్చింది. కాగా శ్రియా, ఆండ్రీలది ప్రేమవివాహం. దాదాపు ఏడేళ్లపాటు ప్రేమించుకున్న ఈ జంట 2018లో ఉదయ్‌పూర్‌ వేదికగా పెళ్లిపీటలెక్కింది. గతేడాది తనకు 9 నెలల కూతురు(రాధ) ఉన్నట్లు మీడియాకు వెల్లడించింది. ప్రస్తుతం శ్రియ హిందీలో 'దృశ్యం 2'లో నటిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement