
Shriya Saran Welcomes Baby Girl: హీరోయిన్ శ్రియ సరన్ అతి పెద్ద సీక్రెట్‌ను రివీల్ చేసింది. గతేడాది తాను పండంటి బిడ్డకు జన్మనిచ్చినట్లు చెప్పి అందరికి షాకిచ్చింది. '2020 ప్రపంచం మొత్తం తలకిందులు అయిపోయింది. ఒక ఏడాదంతా అందరూ క్వారంటైన్‌లో ఉండిపోయారు. కోవిడ్ కారణంగా అందరూ ఎన్నో గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నారు. కానీ మా జీవితంలో మాత్రం అద్భుతం జరిగింది. చిన్నారి రాకతో మా ప్రపంచమే మారిపోయింది. ఏంజిల్ లాంటి చిన్నారిని మాకు ప్రసాదించినందుకు ఆ దేవుడికి ఎంతో రుణపడి ఉంటాను' అంటూ సోషల్ మీడియా వేదికగా శుభవార్తను పంచుకుంది. చదవండి: చేయి కొరకడంపై శివబాలాజీ భార్య సీరియస్
కాగా 2018లో రష్యన్ క్రీడాకారుడు, బిజినెస్ మ్యాన్ ఆండ్రీ కోషీవ్‌ను శ్రియ పెళ్లాడిన సంగతి తెలిసిందే. గతేడాది స్పెయిన్‌లోని బోర్సిలోనాలోనే శ్రియ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. సంవత్సరం వరకు శ్రియ తన ప్రెగ్నెన్సీ గురించి బయటపెట్టకపోవడం గమనార్హం. ఇక గతేడాది వెకేషన్ నిమిత్తం బోర్సిలోనాకు వెళ్లిన శ్రియ దంపతులు లాక్‌డౌన్ కారణంగా అక్కడే ఉండిపోయారు.
ఈ మధ్యే భారత్‌కు తిరిగి వచ్చేసిన ఈ జంట ముంబైలో నివాసం ఉంటుంది. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం శ్రియ ప్రతిష్టాత్మక ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలో ఓ కీలకపాత్ర పోషిస్తుంది. చదవండి: మణిశర్మ కుమారుడి నిశ్చితార్థం.. వైరలవుతోన్న ఫోటోలు
Comments
Please login to add a commentAdd a comment