Actress Shriya Reveals Reason Behind Why She Hide Her Pregnancy From Media, Deets Inside - Sakshi
Sakshi News home page

Actress Shriya Saran: అందుకే నా ప్రెగ్నెన్సీ విషయాన్ని దాచాను: శ్రియ ఆసక్తికర వ్యాఖ్యలు

Published Thu, Dec 15 2022 11:57 AM | Last Updated on Thu, Dec 15 2022 12:31 PM

Actress Shriya Reveals Why She Hide Her Pregnancy From Media - Sakshi

హీరోయిన్‌ శ్రియ సరన్‌ టాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.  ఇష్టం సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిన ఆమె వరుస సినిమాలతో స్టార్‌ హీరోయిన్‌గా సత్తాచాటింది. అయితే 2018లో ఆండ్రీ అనే వ్యక్తిని పెళ్లాడిన శ్రియ 2021లో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే కూతురు పుట్టే వరకు శ్రియ తన ప్రెగ్నెన్సీని సీక్రెట్‌గా ఉంచిన విషయం తెలిసిందే. జీవితంలో ఎంతో ఆనందించే ఈ గుడ్‌న్యూస్‌ను శ్రియ అభిమానులతో కానీ, మీడియాతో కాని షేర్‌ చేసుకోలేదు.

తాజాగా తన ప్రెగ్నెన్సీ విషచాన్ని దాచడానికి కారణం ఏంటో రివీల్‌ చేసింది ఆమె. తాజాగా ఆమె హిందీ దృశ్యం-2 మూవీలో నటించింది. ఇటీవల విడుదలైన ఈ మూవీ మంచి విజయం సాధించింది. ఇక ఈ మూవీ సక్సెస్‌ మీట్‌లో భాగంగా బాలీవుడ్‌ మీడియాతో ముచ్చటించిన ఆమె తన ప్రెగ్నెన్సీ విశేషాలను పంచుకుంది. అలాగే బిడ్డ పుట్టేవరు ప్రెగ్నెన్నీని దాచడానికి కారణం ఏంటో కూడా తెలిపింది. ‘‘నా కూతురు ‘రాధ’ కడుపులో ఉన్న అందమైన క్షణాలను ఎలాంటి ఒత్తిడి లేకుండా గడపాలనుకున్నాను.

ఆ సమయంలో ఎవరైనా లావు అవుతారు. అయితే హీరోయిన్స్‌ విషయంలో దాన్ని సాధారణ విషయం చూడలేరు నేను లావు అవుతుండడంతో ఆ క్షణాలను షేర్‌ చేసుకోవడానికి చింతించాల్సి వచ్చింది. అభిమానులకు, మీడియాకు ఈ విషయం తెలిస్తే నా బాడీ షేప్‌పై ట్రోల్‌ చేస్తారు. నా బిడ్డపై దృష్టి పెడతారు. అందుకే ఇలాంటివి విని ఒత్తిడి గురవ్వాలనుకోలేదు. అమ్మతనాన్ని ఆనంద క్షణాలతో​ ఆస్వాధించాలనుకున్నా. అందుకే ఈ విషయాన్ని నా ప్రెగ్నెన్సి విషయాన్ని దాచాను’’ అంటూ శ్రియ చెప్పుకొచ్చింది. 

చదవండి: 
ప్రముఖ నటుడు, కొరియోగ్రాఫర్‌ ఆత్మహత్య
నా చిరకాల స్వప్నం నెరవేరింది.. ఆయన నాకు చేయి ఊపారు: అనన్య

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement