చైనాలో ఓ మెట్రోలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ యువతి తనకు కూర్చోవడానికి సీటు ఇవ్వలేదన్న కోపంలో 50 ఏళ్ల వృద్దుడు ఆమెపై కర్రతో దాడి చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
బీజింగ్ సబ్‌వేలైన్ 10లో ఈ ఘటన వెలుగుచూసింది. మెట్రోలో ఒక వృద్ధుడు తన కోసం సీటు ఇవ్వాల్సిందిగా యువతిని అడిగాడు. అయితే తన సీటును వెరొకరికి ఇస్తాను కానీ.. అతనికి మాత్రం ఇవ్వనని చెప్పింది. దీంతో ఆగ్రహించిన వృద్ధుడు ఆమెపై అరవడం ప్రారంభించాడు. అంతేగాక ఆమె మీద మీదకు వచ్చి ఆయన చేతిలోని, కర్రతో యువతిని ఇబ్బంది పెట్టాడు. తన చేతులతోనే ఆమె భుజం మీద కొట్టాడు.
అక్కడితో ఆగకుండా.. తన సీటు అడగడంలో తప్పేముందని చెప్పాడు. పోలీసులకు కాల్ చేయండి, మేము పోలీస్ స్టేషన్‌కి వెళ్తాము. నేను నిన్ను వేధిస్తున్నానని చెప్పు. నాకేం భయం లేదు అంటూ దబాయించడం వీడియోలో కనిపిస్తుంది. విషయం తెలుసుకున్న పోలీసులు వృద్ధుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన జూన్ 24 న జరిగినట్లు తెలిపారు.
Beijing China 🇨🇳- Young woman refused to give her seat to the old man. pic.twitter.com/ybCgv8oY6j
— Githii (@githii) June 26, 2024
Comments
Please login to add a commentAdd a comment