
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి ప్రశ్నపత్రాల మూల్యంకనం గురువారం మొదలైంది. మొత్తం 12 కేంద్రాల్లో భద్రతా ఏర్పాట్ల మధ్య ఈ ప్రక్రియ కొనసాగుతోంది. మూల్యాంకన విధు ల్లో మొత్తం 15 వేల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ఈ నెల 11 నాటికి స్పాట్ వాల్యూయేషన్ పూర్తి చేయాలని టెన్త్ పరీక్షల విభాగం ఆదేశాలు జారీ ఇచ్చింది. ప్రతీ ఉపాధ్యాయుడు విధిగా రోజుకు 40 పేపర్లు మూల్యాంకనం చేయాలని నిర్దేశించింది.
ఇది పూర్తయిన వెంటనే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సమాధాన పత్రాలను స్కాన్ చేసి, మార్కులను క్రోడీకరిస్తారు. దీంతో ఏ సబ్జెక్టులో ఎన్ని మార్కులు వచ్చాయనేది స్పష్టంగా తెలుస్తుంది. తక్కువ సమయంలో దీన్ని పూర్తి చేయాల్సి రావడంతో టీచర్లు ఎక్కువ కష్టపడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఉపాధ్యాయ వర్గాలు అంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment