నేటి నుంచి ఎస్‌ఏ–3 ప్రశ్నపత్రాల తరలింపు | sa3 question papers transfers today | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ఎస్‌ఏ–3 ప్రశ్నపత్రాల తరలింపు

Published Fri, Mar 10 2017 12:02 AM | Last Updated on Tue, Sep 5 2017 5:38 AM

sa3 question papers transfers today

అనంతపురం ఎడ్యుకేషన్‌ : 6–9 తరగతుల విద్యార్థులకు ఈనెల 14 నుంచి 27 వరకు వార్షిక పరీక్షల (సమ్మేటివ్‌–3)కు సంబంధించిన ప్రశ్నపత్రాలను శుక్రవారం నుంచి మండలాలకు తరలించనున్నారు. స్థానిక ఉపాధ్యాయ భవనం నుంచి మండల కేంద్రాల్లోని ఎమ్మార్సీలకు తరలించనున్నారు. అన్ని యాజమాన్యాలకు సంబంధించిన ప్రశ్నపత్రాలు ఎమ్మార్సీల్లోనే భద్రపరుస్తారు. పరీక్ష జరిగే రోజున ఉదయం ఎమ్మార్సీకి ఆయా పాఠశాలల యాజమాన్యాలు వచ్చి ప్రశ్నపత్రాలు తీసుకెళ్లాలని జిల్లా విద్యాశాఖ అధికారి పగడాల లక్ష్మీనారాయణ,  డీసీఈబీ కార్యదర్శి నాగభూషణం తెలిపారు. జిల్లా కేంద్రం నుంచి ఎమ్మార్సీలకు తరలించేందుకు ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement