transfers today
-
ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు చేపట్టింది ప్రభుత్వం. సీఎంఓ స్పెషల్ సీఎస్‌గా పూనం మాలకొండయ్య, వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్‌గాగా మధుసూదన రెడ్డిలను నియమించింది. పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శిగా ప్రవీణ్ ప్రకాష్, ఆర్ అండ్ బి సెక్రటరీగా ప్రద్యుమ్న, వ్యవసాయ శాఖ కమిషనరుగా రాహుల్ పాండే, హౌసింగ్ స్పెషల్ సెక్రటరీగా మహ్మద్ దివాన్లను బదిలీ చేసింది. ప్రస్తుతం సీఎంఓ స్పెషల్ సీఎస్‌గా బాధ్యతలు చేపడుతున్న కెఎస్ జవహర్‌ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్)గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. ఆ కొద్ది సేపటికే ఐఏఎస్‌ల బదిలీలపై ఉత్తర్వులు ఇచ్చింది. ఇదీ చదవండి: ఏపీ నూతన సీఎస్‌గా కె.ఎస్ జవహర్ రెడ్డి.. ఉత్తర్వులు జారీ -
నేటి నుంచి ఎస్ఏ–3 ప్రశ్నపత్రాల తరలింపు
అనంతపురం ఎడ్యుకేషన్ : 6–9 తరగతుల విద్యార్థులకు ఈనెల 14 నుంచి 27 వరకు వార్షిక పరీక్షల (సమ్మేటివ్–3)కు సంబంధించిన ప్రశ్నపత్రాలను శుక్రవారం నుంచి మండలాలకు తరలించనున్నారు. స్థానిక ఉపాధ్యాయ భవనం నుంచి మండల కేంద్రాల్లోని ఎమ్మార్సీలకు తరలించనున్నారు. అన్ని యాజమాన్యాలకు సంబంధించిన ప్రశ్నపత్రాలు ఎమ్మార్సీల్లోనే భద్రపరుస్తారు. పరీక్ష జరిగే రోజున ఉదయం ఎమ్మార్సీకి ఆయా పాఠశాలల యాజమాన్యాలు వచ్చి ప్రశ్నపత్రాలు తీసుకెళ్లాలని జిల్లా విద్యాశాఖ అధికారి పగడాల లక్ష్మీనారాయణ, డీసీఈబీ కార్యదర్శి నాగభూషణం తెలిపారు. జిల్లా కేంద్రం నుంచి ఎమ్మార్సీలకు తరలించేందుకు ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.