పదో తరగతి పరీక్షల్లో పదికి పదిపాయింట్లు సాధించిన జిల్లా ట్రెజరీ కార్యాలయ ఉద్యోగుల పిల్లలకు ఆ శాఖ డీడీ శనివారం బంగారు పతకాలు బహూకరించారు.
పదిలో ప్రతిభకు పతకాలు
Published Sun, May 28 2017 12:09 AM | Last Updated on Tue, Sep 5 2017 12:09 PM
కర్నూలు(అగ్రికల్చర్): పదో తరగతి పరీక్షల్లో పదికి పదిపాయింట్లు సాధించిన జిల్లా ట్రెజరీ కార్యాలయ ఉద్యోగుల పిల్లలకు ఆ శాఖ డీడీ శనివారం బంగారు పతకాలు బహూకరించారు. ఎం.హారిక, పి.గౌతమ్, షేక్ అక్షాతంజిలా, పి.రేఖప్రియ, కే.సాయితేజ, షేక్‌గౌషియాకు డీడీ గోల్డ్ మెడల్స్‌ను బహుకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఉన్నత లక్ష్యాన్ని కలిగి ఉండాలని, అపుడే ఏ రంగంలోనైనా రాణించేందుకు వీలవుతుందన్నారు. మంచి మార్కులు సాధించిన వారికి బహుమతులు ఇస్తే మరింత ప్రోత్సహించినట్లవుతుందన్నారు. కార్యక్రమంలో ఏడీ సుబ్రమణ్యం, ఏటీఓలు శ్రీనివాసులు, రవికుమార్, ఎస్‌టీఓలు రెడ్డి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement