
AP SSC Improvement Exams 2022: టెన్త్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు అందించింది. తొలిసారి టెన్త్ విద్యార్థులకు బెటర్‌మెంట్ అవకాశమిచ్చింది ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటివరకూ ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు మాత్రమే బెటర్‌మెంట్ అవకాశం ఉంది. కాగా, రెండేళ్ల కోవిడ్ పరిస్థితులతో ఉత్తీర్ణతాశాతం తగ్గిన నేపథ్యంలో పదవ తరగతి విద్యార్థుల సౌలభ్య కోసం బెటర్‌మెంట్ అవకాశమిస్తూ నిర్ణయం తీసుకుంది.
50 మార్కుల కంటే తక్కువ వచ్చిన ఏదైనా రెండు సబ్జెక్ట్‌లకు సప్లిమెంటరీలో బెటర్‌మెంట్ రాసే అవకాశమిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకుగాను సబ్జెక్ట్‌కు 500 రూపాయల చొప్పున రెండు సబ్జెక్ట్‌లకు 1000 రూపాయిల ఫీజుగా నిర్ణయించింది.
Comments
Please login to add a commentAdd a comment