ఓ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.
రంగారెడ్డి(వికారాబాద్): ఓ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా వికారాబాద్ మండల కేంద్రంలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. వివరాలు... మండల కేంద్రంలోని సంగం లక్ష్మీ బాయి గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్న అనూష(15), హాస్టల్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.
ఈ విషయమై సమాచారం అందుకున్న పోలీసులు, జిల్లా ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థి మృతిపై ఆరా తీశారు. పోస్టు మార్టం రిపోర్టు, ఫోరిన్సిక్ నివేదిక అందిన తర్వాత అన్ని విషయాలు వెల్లడిస్తామన్నారు.