శిరివెళ్ల: పదో తరగతి పేపర్లోకి పోలీసులు విచారణ వేగవంతం చేశారు. గురువారం రాత్రి కొందరిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించినట్లు తెలిసింది. దీంతో వారు కొంత సమాచారం అందించినట్లు తెలుస్తోంది. ఈమేరకు శుక్రవారం కూడా విచారణ కొనసాగినట్లు సమాచారం. మొదట నంద్యాలకు చెందిన ఓ ప్రైవేట్ పాఠశాలకు చెందిన ఓ టీచర్ నుంచి వాట్సాప్‌లో శిరివెళ్లలోని ఓ వ్యక్తికి, మళ్లీ అతడి నుంచి మరో వ్యక్తికి వాట్సాప్ ద్వారా సమాచారం అందినట్లు తెలుస్తోంది. నంద్యాలకు చెందిన వ్యక్తే కొంత మంది ఏర్పాటు చేసుకొన్న గ్రూప్‌కు పేపర్ లీక్ చేసినట్లు సమాచారం. ఆ గ్రూప్ అడ్మిన్‌ను కూడా పోలీసులు రెండు సార్లు విచారించినట్లు తెలుస్తోంది. నంద్యాలకు చెందిన ప్రైవేట్ పాఠశాల టీచర్‌ను విచారణ చేస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం. ఈ విషయంపై సీఐ యుగంధర్‌ను సంప్రదించగా మండలంలో పేపర్ లీక్ కాలేదని తమ విచారణలో స్పష్టమైందన్నారు
Comments
Please login to add a commentAdd a comment