పది మూల్యాంకనం ప్రారంభం
Published Tue, Apr 4 2017 12:06 AM | Last Updated on Wed, Sep 26 2018 3:23 PM
భానుగుడి(కాకినాడ) :
పదోతరగతి పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. 5.50 లక్షల జవాబు పత్రాల మూల్యాంకనానికి సంబంధించి చీఫ్ ఎగ్జామినర్లు, అసిస్టెంట్ ఎగ్జామినర్లు, స్పెషల్ అసిస్టెంట్ ఎగ్జామినర్లుగా ఎస్‌జీటీలతో పాటుగా, పీఈటీలు, పండిట్‌లు, సబ్జెక్టు నిపుణులను రెండు వేల మంది సిబ్బందిని నియమించినట్టు డీఈవో ఎస్.అబ్రహాం పేర్కొన్నారు. ఈ నెల మూడో తేదీ నుంచి 16 వరకు 14రోజుల పాటు ఈ మూల్యాంకన ప్రక్రియ ఉంటుందన్నారు. కాకినాడ పీఆర్‌జీ బాలుర ఉన్నత పాఠశాల, బాలికల ఉన్నత పాఠశాలల్లో 35 తరగతి గదుల్లో ఈ ప్రక్రియ నిర్వహణకు ఏర్పాట్లు చేశామన్నారు. ఉపాధ్యాయులకు భోజన సదుపాయం, స్నాక్స్‌లను ఏర్పాటు చేశామన్నారు.
డ్యూటీల రద్దుకు ఉపా«ధ్యాయ సంఘాల పైరవీలు..
మూల్యాంకనానికి సంబంధించి చెక్కర్ డ్యూటీలు, ఇతరత్రా విధులకు నియమించిన ఉపా«ధ్యాయుల విధులు రద్దుకు ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు డీఈఓపై ఒత్తిడి తేవడం, కింది స్థాయి సిబ్బందితో పైరవీలు చేయడం సోమవారం ఉపాధ్యాయ వర్గాల్లో చర్చనీయాంశంగా నిలిచింది. ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులే ఇటువంటి కార్యకలాపాలకు దిగడం ఎంతవరకు సమంజసమని కొందరు విమర్శించారు. విలువల పేరుతో మైకులు పగిలేలా ప్రసంగాలిచ్చే వీరు రాజకీయ ధోరణిలతో ముందుకు సాగడం మంచి పరిణామం కాదని కొందరు ఉపాధ్యాయులు విమర్శించారు. ఉన్నతాధికారులు వీటిని ప్రోత్సహించరాదని కోరారు.
Advertisement
Advertisement