చైతన్యపురి: ర్యాగింగ్ పేరుతో తోటి విద్యార్థులు డబ్బు వసూలు చేశారని మనస్తాపంతో ఓ టెన్త్ వి ద్యార్థి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఆలస్యం గా వెలుగులోకి వచ్చి ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కర్మన్‌ఘాట్ గ్రీన్‌పార్కు కాలనీకి చెందిన వెంకట్‌రావు కుమారుడు రవికిరణ్ కర్మన్‌ఘాట్‌లోని నియో రాయల్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నా డు. గత బుధవారం రవికిరణ్ ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకోగా గమనించిన కుటుంబ సభ్యులు హు టాహుటిన అతడిని సమీపంలోని అవేర్ గ్లోబల్ ఆసుపత్రికి తరలించగా ఐసీయూలో చికిత్స అం దించారు. ప్రస్తుతం విద్యార్థి కోలుకుంటున్నాడు. ఈ విషయాన్ని కుటుంబసభ్యులు సరూర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, ఘటన జరిగిన నాలుగు రోజుల తర్వాత రవికిరణ్ రాసిన సూసైడ్ నోట్ బయటపడింది. పాఠశాలలో కొంద రు విద్యార్థులు ర్యాగింగ్ చేసి డబ్బులు తేవాలని బెదిరించడంతో రూ.6 వేలు తీసుకెళ్లి వారికి ఇచ్చినట్టు అందులో రవికిరణ్ రాశాడు. ఈ నేపథ్యంలో నే అతడు ఆత్మహత్యాయత్నం చేసినట్టు భా వి స్తు న్నారు. కాగా, రవికిరణ్ వద్ద స్టేట్ మెంట్ తీసుకు న్న పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు.
ర్యాగింగ్ పై అవగాహన కల్పించాలి..
నియో రాయల్ పాఠశాలలో ర్యాగింగ్‌కు గురై టెన్త్ విద్యార్థి ఆత్మహత్యా యత్నానికి పాల్పడటం దుర దృష్టకరమని ఏపీ బాలల హక్కుల సంఘం గౌరవ అధ్యక్షుడు అచ్యుతరావు ఒక ప్రకటనలో తెలిపారు. ర్యాంకులు, మార్కుల పేరుతో విద్యా సంస్థలు విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నాయని, ర్యాగింగ్‌కు పాల్పడకుండా పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆయన అన్నారు. ర్యాగింగ్ ఘటనపై తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment