
పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య
పదో తరగతి పరీక్షల ఫలితాల విడుదల రోజే ఓ విద్యార్థి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
♦ మార్కులు తగ్గుతాయేమోననే భయంతోనే..
♦ ఫలితాల్లో 9.2 జీపీఏ పాయింట్లు
కంకిపాడు: పదో తరగతి పరీక్షల ఫలితాల విడుదల రోజే ఓ విద్యార్థి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇటీవల విడుదలైన పాలిసెట్ ఫలితాల్లో వినయ్‌కు ర్యాంకు (40 వేలకు పైగా) తగ్గింది. పదో తరగతి ఫలితాల్లోనూ ఆశించిన మేర ఫలితం ఉంటుందో? లేదో? అనే భయంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడా? లేదా కుటుంబంలో మందలించారా? అనే అనుమానాలు నెలకొన్నాయి. ఈ కోణాల్లో పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. అయితే మంగళవారం విడుదలైన టెన్త్ ఫలితాల్లోవినయ్‌కు(హాల్‌టికెట్ నంబరు: 1612115141) 9.2 జీపీఏ పాయింట్లు వచ్చాయి. పోలీసుల చెప్పిన వివరాల ప్రకారం.. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం గొడవర్రుకు చెందిన వెలిశెల వినయ్‌కుమార్(16) తల్లిదండ్రులు మంగళవారం ఉదయం ఉపాధి హామీ పనులకు వెళ్లారు. అదే సమయంలో వినయ్ తమ ఇంట్లోని ఫ్యాన్ హుక్కుకు చీర కట్టి ఉరివేసుకున్నాడు. ఇంటి వద్ద ఉన్న తాత కోటేశ్వరరావు గమనించి మనవడిని కంకిపాడు ఆరోగ్య కేంద్రానికి తరలించగా.. అప్పటికే వినయ్ మృతి చెందాడు.