వచ్చే ఏడాది మార్చి తొలి వారంలో ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షల తేదీలను నవంబర్ రెండో వారంలో ఖరారు....
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది మార్చి తొలి వారంలో ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షల తేదీలను నవంబర్ రెండో వారంలో ఖరారు చేసేందుకు పదో తరగతి పరీక్షల విభాగం కసరత్తు చేస్తోంది. పరీక్ష ఫీజుల చెల్లింపు, నామినల్ రోల్స్, పరీక్ష కేంద్రాలకు సంబంధించిన సమాచారంపై ప్రస్తుతం దృష్టి సారించింది. ఈసారి ఇంటర్మీడియెట్, పదో తరగతి పరీక్షలను ఒకేసారి నిర్విహ ంచాలని ప్రభుత్వం మొదట్లో నిర్ణయించింది.
అయితే ఉదయం, సాయంత్రం పరీక్షలు నిర్వహించడం, జవాబు పత్రాలను తీసుకెళ్లడంలో సమస్యలు తలెత్తుతాయన్న ఆందోళన నేపథ్యంలో వేర్వేరుగా నిర్వహించే అవకాశం ఉంది. పదో తరగతికి ప్రత్యేకంగా పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసుకునేందుకు అధికారులు ప్రస్తుతం కసరత్తు చేస్తున్న నేపథ్యంలో అది పూర్తయితేనే స్పష్టత రానుంది.