సాక్షి, ఆదిలాబాద్: ఉట్నూరు ootnur మండల కేంద్రంలో పదవ తరగతి ఆన్సర్‌షీట్‌ల కట్ట మిస్ అయ్యింది. తపాలా కార్యాలయం నుంచి ఉట్నూర్ బస్టాండ్‌కు తీసుకు వస్తున్న క్రమంలో ఆటో నుంచి మాయమైనట్లు పోలీసులు భావిస్తున్నారు.
దాదాపు ఇరవై మంది విద్యార్థుల జవాబు పత్రాలు కనిపించకుండా పోయినట్లు తెలుస్తోంది. పోస్టల్ అధికారి ఫిర్యాదు తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
పేపర్లు ఆటోలో తరలిస్తుండగా.. కిందపడిపోయి ఉంటాయా? లేదంటే ఎవరైనా కావాలని మాయం చేశారా? అనే తేల్చే పనిలో ఉన్నారు ఎస్సై భరత్. మరోవైపు అవి ఏ సెంటర్ పేపర్లు అనేది స్పష్టత లేకపోవడంతో.. విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది.
ఈ వ్యవహారంపై విద్యాశాఖ స్పందించింది. సాక్షితో డీఈఓ ప్రణీత మాట్లాడుతూ.. ‘‘ఉట్నూరు పదవ తరగతి జవాబు పత్రాలు మాయం అయ్యాయి. పదిహేను మంది విద్యార్థుల తెలుగు జవాబు పత్రాలు మాయం అయినట్లు గుర్తించాం. పోస్టాఫీస్ నుంచి బస్టాండ్‌కు తరలిస్తుండగానే అవి పోయాయి. కాబట్టి, పోస్టల్ అధికారులదే బాధ్యత. వాళ్లకు ఆన్సర్‌షీట్లు అప్పగించినట్లు మా దగ్గర రిసిప్ట్ కూడా ఉంది. ఇది కేవలం వాళ్ల నిర్లక్ష్యమే. ఇందులో మా తప్పిదం ఏం లేదు. దర్యాప్తు ఆధారంగా చర్యలు తీసుకుంటాం’’ అని తెలిపారామె.
ఇదీ చదవండి: పరీక్ష ప్రారంభమైన కాసేపటికే.. టెన్త్ పేపర్ అవుట్!
Comments
Please login to add a commentAdd a comment