ఆ సబ్జెక్టు వరకు పాస్‌ చేసేద్దామా? | Telangana: Officers Thinks Passes Students Over Missing Utnoor SSC Answer Papers | Sakshi
Sakshi News home page

ఆ సబ్జెక్టు వరకు పాస్‌ చేసేద్దామా?

Published Thu, Apr 6 2023 10:14 AM | Last Updated on Thu, Apr 6 2023 10:18 AM

Telangana: Officers Thinks Passes Students Over Missing Utnoor SSC Answer Papers - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఉట్నూర్‌ కేంద్రంలో సోమవారం మాయమైన పదో తరగతి విద్యార్థుల సమాధాన పత్రాలపై విద్యాశాఖ ఉన్నతాధికారులు ఆ సబ్జెక్టు వరకూ వారిని పాస్‌ చేయడమే సరైన నిర్ణయంగా భావిస్తున్నట్టు తెలుస్తోంది. తొలిరోజు టెన్త్‌ పరీక్ష సందర్భంగా ఉట్నూర్‌ కేంద్రంగా ప్రైవేటు విద్యార్థులు (సప్లిమెంటరీ) 9 మంది పరీక్ష రాశారు.

ఆ పేపర్లను ముందే నిర్ణయించిన ప్రకారం వాల్యూయేషన్‌ కేంద్రానికి తరలించాల్సి ఉంది. వీటిని దగ్గర్లోని పోస్టాఫీసుకు తీసుకెళ్తుండగా మార్గమధ్యలో ఎక్కడో పడిపోయాయి. దీన్ని గుర్తించిన విద్యాశాఖాధికారులు ఈ వ్యవహారంపై విచారణ చేపట్టారు. జవాబు పత్రాలు మాయమైన ఘటనకు విద్యార్థులను బాధ్యులను చేయడం సరికాదని భావించి, ఆ సబ్జెక్టు వరకు పాస్‌ చేయడం మంచిదనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement