
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 9.50 లక్షల మంది ఇంటర్మీడియట్ విద్యార్థుల పరీక్షల వ్యాల్యుయేషన్ ప్రక్రియ మొదలైందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఆమె గురువారం పదో తరగతి పరీక్షల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రి మాట్లాడుతూ.. ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తి అయ్యాయి. విద్యా సంవత్సరాని ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటామని ఆమె చెప్పారు. 33 సెంటర్లలో మే 12వ తేదీ నుంచి ఇంటర్మీడియట్ వాల్యుయేషన్ ప్రారంభం అవుతుందని తెలిపారు. (కరెంట్ బిల్లులు, అద్దె మాఫీ చేయండి..)
ఇక వాల్యుయేషన్ ప్రక్రియలో అన్ని జాగ్రత్తులు తీసుకుంటామని సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. జూన్ రెండో వారంలో ఇంటర్మీడియట్ ఫలితాలను విడుదల చేస్తామని అమె తెలిపారు. 856 మంది ఇంటర్మీడియెట్ విద్యార్థులకు ఒక పరీక్ష మిగిలిపోయిందని, ఆ పరీక్షను 18వ తేదీన నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. పదో తరగతికి సంబంధించిన 8 పరీక్షల నిర్వహణ కోసం కోర్టు అనుమతి తప్పనిసరి అని, అందుకు కోర్టుకు అఫిడవిడ్ దాఖలు చేస్తామని ఆమె తెలిపారు. పదో తరగతి విద్యార్థులు పరీక్షలకు సిద్ధంగా ఉండాలని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. (‘కాంగ్రెస్ నేతలు నిజంగా జోకర్లు, బ్రోకర్లు’)