ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం: సీఎం రేవంత్‌ | Cm Revanth Review Meeting On Dharani Portal Issues | Sakshi
Sakshi News home page

ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం: సీఎం రేవంత్‌

Published Fri, Jul 26 2024 5:48 PM | Last Updated on Fri, Jul 26 2024 6:38 PM

Cm Revanth Review Meeting On Dharani Portal Issues

సాక్షి, హైదరాబాద్‌: ధరణి సమస్యల పరిష్కారానికి మరింత లోతుగా అధ్యయనం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన సచివాలయంలో ధరణిపై సమీక్ష నిర్వహించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, మాజీ మంత్రి జానారెడ్డి, ధరణి కమిటీ  సభ్యులు కోదండ రెడ్డి, సునీల్ కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సంబంధిత అధికారులు హాజరయ్యారు. ధరణిలో సమస్యలు, మార్పులు-చేర్పులు ఇతర అంశాలపై చర్చించారు.

ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలన్న సీఎం.. సవరణలపై కొత్త సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సవరణలపై ప్రజాభిప్రాయం పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. అఖిలపక్ష సమావేశం నిర్వహించి అభిప్రాయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్న ముఖ్యమంత్రి. ప్రజల అభిప్రాయాలు, సూచనల ఆధారంగా సమగ్ర చట్టం రూపొందించాలన్నారు. అవసరమైతే అసెంబ్లీలోనూ చర్చ పెడదామని సీఎం రేవంత్‌ చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement