- తొలిసారి సీసీఈ విధానంలో పబ్లిక్ పరీక్షలు
- ఫిబ్రవరి మొదటి వారంలో తొలి ప్రీ ఫైనల్
- మార్చి 17 నుంచి జరిగే పబ్లిక్ పరీక్షలకు 65,029 మంది విద్యార్థులు
‘పది’ పరీక్షలకు వేళాయెనే..
Published Tue, Jan 31 2017 12:24 AM | Last Updated on Mon, Oct 8 2018 7:35 PM
రాయవరం :
పదో తరగతి పరీక్షలకు సమయం ముంచుకొస్తోంది. మరో 45 రోజుల్లో పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది గతానికి పూర్తి భిన్నంగా పరీక్షలు నిర్వహించనున్నారు. తొలిసారి సీసీఈ విధానంలో పరీక్షలు జరగనుండగా వచ్చే నెల మొదటి వారంలో తొలి ప్రీఫైనల్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పబ్లిక్ పరీక్షలకు తేదీలు ఖరారు చేయడంతో పది విద్యార్థుల్లో పరీక్షల ఫీవర్ ప్రారంభమైంది.
65,029 మంది విద్యార్థులు..
జిల్లాలో 303 పరీక్షా కేంద్రాల్లో 65,029 మందికి పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 32,188 మంది బాలురు, 32,834 మంది బాలికలు 10వ తర గతి
పబ్లిక్ పరీక్షలకు హాజరవుతున్నారు. 462 జెడ్పీ, 24 ప్రభుత్వ, 48 ఎయిడెడ్, 47 మున్సిపాలిటీ, 12 కస్తూర్బా, 38 ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ్ ఉన్నత పాఠశాలలు, రెండు మోడల్ స్కూల్స్ 15 సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ ఉన్నత పాఠశాలలకు చెందిన విద్యార్థులతోపాటు ప్రైవేటు ఉన్నత పాఠశాలల విద్యార్థులు పరీక్షలకు సన్నద్దమవుతున్నారు. ఇప్పటికే ప్రత్యేక తరగతులు జిల్లాలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు ఉన్నత పాఠశాలల్లో ప్రారంభమయ్యాయి.
నూతన విధానంలో..
పదో తరగతి పబ్లిక్ పరీక్షలు గత పరీక్షలకు భిన్నంగా ఈ ఏడాది నుంచి సీసీఈ విధానంలో జరగనున్నాయి. గతంలో ప్రతి సబ్జెక్టుకు 100 మార్కులు కేటాయించి ఫలితాలు ప్రకటించేవారు. అయితే ఈ కొత్త విధానంలో ప్రతి సబ్జెక్టుకు 80 మార్కులకే పరీక్ష నిర్వహించనున్నారు. మిగిలిన 20 మార్కులు అంతర్గత మూల్యాంకనం ద్వారా కేటాయించనున్నారు. పరీక్షల్లో పది పాయింట్లు సాధించాలంటే అన్ని సబ్జెక్టుల్లో 91 మార్కులు తప్పనిసరిగా సాధించాలి. అలాగే ఈ ఏడాది నుంచి గణితం, సై¯Œ్స, సోషల్ పరీక్షల్లో 1,2 మార్కుల ప్రశ్నలకు చాయిస్ ఉండదు.
అంతర్గత మూల్యాంకన మార్కులు ఇలా..
అంతర్గత మూల్యాంకనం ద్వారా ప్రతి సబ్జెక్టుకు 20 మార్కులు లభించనున్నాయి. నిర్మాణాత్మక మూల్యాంకనం (ఎస్‌ఏలో విద్యార్థికి లభించిన మార్కులు పరిగణనలోకి తీసుకుంటారు. గతంలో నిర్వహించే యూనిట్ పరీక్షల స్థానంలో ఈ ఏడాది ఎఫ్‌ఏ పరీక్షలు, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ పరీక్షల స్థానంలో ఎస్‌ఏ పరీక్షలు నిర్వహిస్తున్నారు. విద్యా సంవత్సరం మొత్తం మీద నాలుగు ఎఫ్‌ఏ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఒక్కో ఎఫ్‌ఏ పరీక్ష 50 మార్కులకు నిర్వహిస్తున్నారు. ఈ 50 మార్కుల్లో లఘు పరీక్ష ద్వారా 20 మార్కులు, ప్రాజెక్టులకు 10 మార్కులు, రాత అంశాలకు 10 మార్కులు ఉంటాయి. నాలుగు ఎఫ్‌ఏ పరీక్షలకు కలిపి 200 మార్కులు. సమ్మేటివ్ అసెస్‌మెంట్‌లు (ఎస్‌ఏ) రెండు ఉంటాయి. ఒక్కోదానికి 80 మార్కులకు నిర్వహిస్తారు. రెండు ఎస్‌ఏ పరీక్షలను 160 మార్కులకు నిర్వహిస్తారు. ఎస్‌ఏ, ఎఫ్‌ఏ పరీక్షల మొత్తం మార్కులు 360ను 18తో భాగించి 20బమార్కులకు విద్యార్థికి అంతర్గత మూల్యాంకనం మార్కులు కేటాయిస్తారు. గతంలోకంటే భిన్నంగా ప్రతి సబ్జెక్టులోనూ 20 మార్కులు అంతర్గత మూల్యాంకనం నుంచి మిగిలిన 80 మార్కులకు విద్యార్థి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాయాల్సి ఉంది.
సబ్జెక్టు పబ్లిక్ పరీక్షలు
తెలుగు–1 మార్చి 17
తెలుగు–2 మార్చి 18
హిందీ మార్చి 20
ఇంగ్లీష్–1 మార్చి 21
ఇంగ్లీష్–2 మార్చి 22
గణితం–1 మార్చి 23
గణితం–2 మార్చి 24
పీఎస్ మార్చి 25
ఎ¯ŒS మార్చి 27
సోషల్–1 మార్చి 28
సోషల్–2 మార్చి 30
Advertisement
Advertisement