పదో తరగతి పరీక్షల ఫలితాలను వచ్చే నెల 5న విడుదల చేసేందుకు ప్రభుత్వ పరీక్షల విభాగం కసరత్తు చేస్తోంది.
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి పరీక్షల ఫలితాలను వచ్చే నెల 5న విడుదల చేసేందుకు తెలంగాణ ప్రభుత్వ పరీక్షల విభాగం కసరత్తు చేస్తోంది. గత నెల 14న ప్రారంభమైన పరీక్షలు 30వ తేదీతో ముగిశాయి. ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 5 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ప్రస్తుతం జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి కావచ్చింది. డీకోడింగ్, ఫలితాల ప్రాసెస్ చేసేందుకు మరో వారం రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో మే 5న ఫలితాలను వెల్లడిం చేందుకు ప్రభుత్వ పరీక్షల విభాగం కసరత్తు చేస్తోంది. అయితే ఫలితాల ప్రాసెస్‌లో ఏమైనా జాప్యం జరిగినా, మే 5న ఫలితాల వెల్లడి వీలుకాకున్నా 6న విడుదల చేసేందుకు చర్యలు చేపడుతోంది.