పది డూప్లికేట్ సర్టిఫికెట్ పొందండిలా..!
ముప్పాళ్ళ : పదవ తరగతి మార్కుల లిస్టు పోతే దాన్ని పొందడం తెలియక చాలామంది ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి ఇబ్బందులేమీ లేకుండానే సరైన పద్ధతిలో సర్టిఫికెట్ పొందేందుకు ప్రభుత్వం కొత్త విధానాన్ని సూచించింది. ఈ విధానం ద్వారా సర్టిఫికెట్‌ను సులభంగా పొందవచ్చు.
చలానా వివరాలు....
మేజర్ హెడ్ - 0202 ఎడ్యుకేషన్,స్పోర్ట్స్ అండ్ కల్చర్
సబ్‌మేజర్ హెడ్ - 01-జనరల్ ఎడ్యుకేషన్
మైనర్‌హెడ్ -102-సెకండరీ ఎడ్యుకేషన్
సబ్‌హెడ్:006-డెరైక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్
డీటెయిల్డ్ హెడ్: 800-యూజర్ చార్జెస్
డీడీఓ కోడ్: సంబంధిత పాఠశాలలో ఉంటుంది. చలానాలో నేచర్ ఆఫ్ ఫీ అనే అంశం వద్ద డూప్టికేట్ ఎస్‌ఎస్‌సీ పాస్ సర్టిఫికెట్ అని రాయాలి.
ఇవి తప్పనిసరి
అభ్యర్థి తన పూర్తి పేరు(క్యాపిటల్ లెటర్స్),తండ్రిపేరు, చిరునామా, పుట్టిన తేదీ, స్వస్థలం, పదవ తరగతి చదివిన పాఠశాల, ఒరిజినల్ పదవతరగతి సీరియల్ నంబర్, రోల్ నెంబర్, సంవత్సరం ఏ నెలలో పదవతరగతి పాసయ్యారు తదితర వివరాలు ఎస్‌ఎస్‌సీ బోర్డుకు తెలియజేయాలి. వీటితో పాటుగా పదవతరగతి సర్టిఫికెట్ ఎలా పోయిందో తెలుపుతూ పోలీస్‌స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదు, వారు ఇచ్చిన నాన్‌ట్రేస్ సర్టిఫికెట్, నోటరీ ధ్రువీకరించిన రూ.50 పత్రం,ఎస్‌బీఐలో చెల్లించిన రు250ల చలానా,ఎస్‌ఎస్‌సి నకలు జతపరచాల్సి ఉంటుంది. ఇంకా పుట్టుమచ్చల వివరాలు(సర్టిఫికెట్‌లో నమోదు చేసినవి),అభ్యర్థి సెల్ఫ్ డిక్లరేషన్, ధ్రువీకరిస్తూ సంబంధిత పాఠశాల ప్రదానోపాధ్యాయుడు జారీ చేసిన పత్రం, ఫొటో, పాఠశాల ప్రదానోపాధ్యాయుడి కవరింగ్ లెటర్ జతపరచాల్సి ఉంటుంది. వీటన్నింటిని బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్‌కు పంపడం ద్వారా సర్టిఫికెట్ పొందవచ్చు. ఈ క్రమంలో పాత మార్కుల లిస్టును బోర్డు రద్దు చేస్తుంది.