SSC/10th Class Exams 2020: దేశవ్యాప్తంగా టెన్త్‌ పరీక్షలు లేనట్టే! - Sakshi Telugu
Sakshi News home page

కరోనా అలర్ట్‌ : టెన్త్‌ క్లాస్‌ పరీక్షలు నిర్వహించం

Published Tue, May 5 2020 7:06 PM | Last Updated on Wed, May 6 2020 12:03 AM

Hrd Ministry Says No Exam For Class 10 Students Nationwide - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కోవిడ్‌-19 వ్యాప్తితో సీబీఎస్ఈ పదవ తరగతి పరీక్షల నిర్వహణపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. తూర్పు ఢిల్లీ విద్యార్ధులకు మినహా కేంద్ర విద్యాలయాల్లో విద్యనభ్యసిస్తున్న వారికి పెండింగ్‌లో ఉన్న పదో తరగతి వార్షిక పరీక్షలను నిర్వహించబోమని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి (హెచ్‌ఆర్‌డీ) మంత్రిత్వ శాఖ మంగళవారం వెల్లడించింది. ఇక తూర్పు ఢిల్లీ విద్యార్ధులకు పదవ తరగతి పరీక్షలు నిర్వహించేముందు ప్రిపరేషన్‌ కోసం పది రోజుల సమయం ఇస్తామని హెచ్‌ఆర్‌డీ మంత్రిత్వ శాఖ ట్వీట్‌ చేసింది. ఇక సీఏఏ అల్లర్లతో అట్టుడుకిన తూర్పు ఢిల్లీలో మాత్రం వాయిదా పడిన పదవ తరగతి పరీక్షలను నిర్వహించేందుకు అధికారులు కసరత్తు సాగిస్తున్నారు.  

చదవండి : కోవిడ్‌-19 : మహిళా రైతు ఔదార్యం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement