పదో తరగతి ఫెయిలైనందుకు మనస్తాపం చెందిన ఓ బాలిక ఆత్మహత్యకు పాల్పడింది.
పార్వతీపురం(విజయనగరం): పదో తరగతి ఫెయిలైనందుకు మనస్తాపం చెందిన ఓ బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. విజయనగరం జిల్లా కొమరాడ మండలం సోమినాయుడు వలస గ్రామానికి చెందిన సవిటన్నదొర, మహాలక్ష్మి దంపతుల కుమార్తె ప్రియాంక కోటిపాం జడ్పీ హైస్కూల్‌లో పదో తరగతి చదువుకుంది.
బుధవారం ప్రకటించిన ఫలితాల్లో ఆమె ఫెయిలైంది. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన ప్రియాంక ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.