
ప్రాణహిత బరాజ్ కడతామంటున్న ప్రభుత్వం..
17 ఏళ్లుగా ప్రాజెక్టు నిర్మాణంపై నిర్లక్ష్యం
సేకరించిన భూములు అన్యాక్రాంతం
భూముల ధరలు పెరిగినందున తిరిగి ఇవ్వాలంటున్న రైతులు
ఇవి ప్రాణహిత ప్రాజెక్టు కాలువల కోసం సేకరించిన భూములు. ప్రాజెక్టుపై ఆశలు వదిలేసి, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం రణవెల్లి, బెజ్జూరు మండలం సులుగుపల్లి, మందమర్రి మండలం శంకర్‌పల్లి గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలు, శ్మశాన వాటికలు నిర్మించారు. చాలాచోట్ల రైతులు సాగులో ఉన్నారు. వానాకాలంలో కాలువల్లో చేపలు పెంచుతున్నారు. మట్టి, బండరాయి, పైపులను తరలించుకుపోగా కొన్ని చోట్ల భూములు కబ్జాకు గురయ్యాయ్యాయి.
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: కాంగ్రెస్ ప్రభుత్వ ప్రకట నతో ప్రాణహిత ప్రాజెక్టుపై మళ్లీ ఆశలు చిగురిస్తు న్నాయి. రాష్ట్ర బడ్జెట్‌లో రూ.32 కోట్లు కూడా కేటాయించారు. అయితే పాత డిజైనా, లేక కొత్తది ప్రతిపాది స్తారా, వార్దాపై బరాజ్ నిర్మిస్తారా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. తలాపునే పుష్కలైన నీళ్లు ఉన్నా.. ఏళ్లుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు వర్షాధార పంటలే దిక్కు. రెండో పంటతోపాటు వరి పండించని పల్లెలు ఎన్నో ఉన్నాయి.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ప్రాణహిత–చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టు నిర్మాణానికి 17ఏళ్లుగా మోక్షం కలగడం లేదు. భూ సేకరణలో ఎకరానికి రూ.1.50 నుంచి రూ.1.75 లక్షల లోపే పరిహారం ఇస్తే, ఇప్పుడా భూముల ధరలు రూ.15 నుంచి రూ.30 లక్షల వరకు పెరిగాయి. దీంతో భూములు తిరిగి ఇవ్వాలనే డిమాండ్లు రైతుల నుంచి వినిపిస్తున్నాయి.
అభ్యంతరాలతో ఆగిపోయి...
తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దు వెన్‌గంగా, వార్దా కలిసే ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తుమ్మడి హెట్టి వద్ద ప్రాణహిత నదిపై ప్రాజెక్టు కట్టాలనేది ప్రణాళిక. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి 2008లో ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. 152 అడుగుల ఎత్తులో బరాజ్ నిర్మించి కాలువలతో ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల మీదుగా గోదావరి నదిపై ఉన్న ఎల్లంపల్లి ప్రాజెక్టు వరకు నీటిని తరలించి, అక్కడ నుంచి ఆరు జిల్లాలకు నీరు ఇవ్వాలి.
ఏడు జిల్లాలకు నీటి సరఫరాకు భూసేకరణ, కాలువల కోసం రూ.10 వేల కోట్లు వెచ్చించారు. 152 మీటర్ల ఎత్తులో బరాజ్ నిర్మిస్తే.. చంద్రపూర్, గడ్చిరోలి జిల్లాల్లో 30 గ్రామాల ముంపు ఉంటుందని మహారాష్ట్ర దీనికి అభ్యంతరం చెప్పింది. ఉమ్మడి ఏపీలోనూ, తెలంగాణ వచ్చాక కూడా దీనిపై చర్చలు జరిగాయి. చివరగా 2015లో నాటి నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు జరిపిన చర్చల్లో కూడా 148 మీటర్ల వరకు ఒప్పుకున్నారు.
అయితే అభ్యంతరాల సాకుతో ప్రాజెక్టును పూర్తిగా పక్కకు పెట్టి, దిగువన గోదావరిలో ప్రాణహిత కలిసే మేడిగడ్డ వద్ద ‘కాళేశ్వరం’మొదలు పెట్టి శరవేగంగా పూర్తి చేశారు. తర్వాత వార్దానదిపై బరాజ్ కట్టి మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలకే రెండు లక్షల ఆయకట్టుకు నీరిస్తామని డిజైన్లు చేసినా ముందుకు సాగలేదు.
మా భూములు మాకియ్యాలి..
నాలుగెకరాలు తీసుకొని, ఎకరానికి రూ.1.75 లక్షలు ఇచ్చారు. ఏళ్లు గడుస్తున్నా నీళ్లు రాలేదు. ప్రాజెక్టు కట్టకపోతే మా భూములు మాకియ్యాలి.– కోట అశోక్, శంకర్‌పల్లి
కాలువల ఉపయోగం లేదు
30 గుంటలు తీసుకు న్నారు. కాలువలు తవ్వినా, రైతులకు ఉపయోగం లేదు. ప్రాజెక్టు భూమిలోనే పల్లె ప్రకృతివనం నిర్మించారు.– విశ్వనాథ్, రణవెల్లి,