
రంగారెడ్డి జిల్లా కన్హా గ్రామంలో గల కన్హా శాంతి వనంను ఆటా అధ్యక్షురాలు మధు బొమ్మినేని ఆధ్వర్యంలో ఆటా ప్రతినిధులు సందర్శించారు. ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకులు కమలేష్ డి పటేల్(దాజీ) ని కలిశారు. ఇదే సందర్భంలో ఆశ్రమంలో యోగ చేసి, యోగ వల్ల కలిగే లాభాలను తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఆటా వేడుకల చైర్, ఎలెక్ట్ ప్రెసిడెంట్ జయంత్ చల్లా, ఆటా వేడుకల కో చైర్ వేణు సంకినేని, సెక్రెటరీ రామకృష్ణ రెడ్డి అల, ట్రెజరర్ సతీష్ రెడ్డి, జాయింట్ ట్రెజరర్ రవీందర్ గూడూరు, 18వ ఆటా కాన్ఫరెన్స్ నేషనల్ కో ఆర్డినేటర్ సాయి సూదిని, కన్వెన్షన్ కన్వీనర్ కిరణ్ పాశం, అడ్వైసర్ కరుణాకర్ అసిరెడ్డి, ఆటా మాజీ ప్రెసిడెంట్లు భీమ్ రెడ్డి పరమేష్, కరుణాకర్ మాధవరం, ట్రస్టీస్ కాశీ కొత్త, నరసింహ రెడ్డి ద్యాసాని, కిషోర్ గూడూరు, శివ గీరెడ్డి వారి కుటుంబసభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment