తెలుగు వారి సాంప్రదాయ భారతీయ నాట్యం కూచిపూడికి ఆటా వేదికపై పట్టం కట్టించారు న్యూజెర్సీలోని సెంటర్ ఫర్ కూచిపూడి. ఇటీవల వాషింగ్టన్ డీసీ వేదికగా జరిగిన అమెరికన్ తెలుగు అసొసియేషన్ ప్రపంచ మహాసభల్లో సెంటర్ ఫర్ కూచిపూడి కళాకారిణులు అద్భుత ప్రదర్శనతో అలరించారు. హైదరాబాద్‌లో పుట్టి పెరిగి కూచిపూడి నృత్యం అభ్యసించి.. అమెరికాలో సెంటర్ ఫర్ కూచిపూడి ఏర్పాటు చేశారు ఇందిరా శ్రీరాం రెడ్డి దీక్షిత్.
న్యూజెర్సీ కేంద్రంగా గత 20 ఏళ్లుగా ఎంతో మందికి కూచిపూడిని నేర్పిస్తున్నారు. అమెరికా సంయుక్త రాష్ట్రాలతో పాటు పలు చోట్ల కూచిపూడి ప్రదర్శనలు ఏర్పాటు చేసి దాని గొప్పదనాన్ని చాటి చెప్పుతున్నారు ఇందిరా శ్రీరాం దీక్షిత్. అమెరికన్ తెలుగు అసొసియేషన్ సభల్లో ఇందిరా టీంలోని సభ్యులు సాంప్రదాయ కూచిపూడితో పాటు కోలాట నృత్యాలు చేసి అలరించారు.
Comments
Please login to add a commentAdd a comment