
తలకొండపల్లి: ఆటా ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా మెడికల్ క్యాంపునకు విశేష స్పందన వచ్చింది. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం పడ్కల్ గ్రామంలో ఆటా వారు బుధవారం మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఆటా మెడికల్ క్యాంపునకు స్థానికులు భారీ సంఖ్యలో హాజరై.. హెల్త్ చెకప్ చేయించుకున్నారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అన్ని వయసుల వారు వైద్య శిబిరానికి వచ్చారు. డాక్టర్ల బృందం పేషెంట్లకు మెడిసిన్ పంపిణీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment