విశాఖలో ‘ఆటా’ మెడికల్ క్యాంప్ సక్సెస్ | American Telugu Association successful medical camp in Vizag | Sakshi
Sakshi News home page

విశాఖలో ‘ఆటా’ మెడికల్ క్యాంప్ సక్సెస్

Published Tue, Dec 19 2017 6:00 PM | Last Updated on Tue, Oct 16 2018 3:25 PM

American Telugu Association successful medical camp in Vizag - Sakshi

సాక్షి, విశాఖపట్నం: అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) రెండు తెలుగు రాష్ట్రాల్లో వరుసగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో తాజాగా విశాఖపట్నంలో మెడికల్ క్యాంపుతో పాటు స్వచ్ఛందంగా సామాజిక సేవలు అందించింది. ఆటా ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా మెడికల్ హెల్త్ క్యాంపు సక్సెస్ అయింది. 200 మందికి పైగా పేషెంట్లకు ట్రీట్‌మెంట్ చేసి మెడిసిన్‌ అందజేశారు. అనారోగ్యం బారిన పడకుండా ఉండేందుకు పలు జాగ్రత్తలు వైద్యులు సూచించారు. కొందరు చిన్నారులకు ఆట వస్తువులు అందజేసి వారిలో నూతన ఉత్సాహాన్ని నింపారు. హెల్త్ క్యాంపులో స్థానికులు అడిగిన సందేహాలు విని డాక్టర్లు పలు సూచనలు, సలహాలిచ్చారు.

కాగా, ఇటీవల తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం పడ్కల్ గ్రామంలో మెడికల్ క్యాంపునకు విశేష స్పందన వచ్చింది. అదే విధంగా జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండలం చిన్నఆముదాలపాడులో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆటా బృందం నిర్వహించిన విషయం తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement