అరిజోనాలో కనుల విందుగా రెట్రో నేపథ్య సంగీత వేడుక! | Indian Retro Dance Party Arizona Hosted By ATA | Sakshi
Sakshi News home page

ATA: అరిజోనాలో కనుల విందుగా రెట్రో నేపథ్య సంగీత వేడుక!

Published Thu, Sep 21 2023 1:01 PM | Last Updated on Thu, Sep 21 2023 2:35 PM

Indian Retro Dance Party Arizona Hosted By ATA - Sakshi

అమెరికన్ తెలుగు అసోసియేషన్ - ఆటా ఆధ్వర్యంలో అద్భుతమైన రెట్రో నేపథ్య పార్టీ కనులవిందుగా ప్రారంబమైంది. అరిజోనాలోని ఫీనిక్స్‌లో జరిగిన ఈ మనోహరమైన సంగీతం ప్రేక్షకులకు ఆనందాన్ని ఇచ్చింది. ఈ వేడుక భారతీయ సినిమా స్ఫూర్తిని, చలనచిత్ర వాతావరణాన్ని తీసుకువచ్చింది. భారతదేశం గొప్ప సంస్కృతి, వినోదాన్ని జరుపుకోవడానికి అన్ని వర్గాల నుంచి అతిథులు హాజరయ్యారు.

300 మందికి పైగా హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సినీ సంగీతం, ఫ్యాషన్‌ షో అలరించింది. అద్భుతమైన అలంకరణ, మిరుమిట్లు గొలిపే వెలుగులు, నేపధ్య సంగీతంతో గుర్తువుండిపోయే వేదికను ఏర్పాటు చేశారు. ప్రధాన వేదిక ఆహ్లాదకరమైన నృత్య ప్రదర్శనలతో మారుమ్రోగింది. నటి లయ, గాయకుడు రఘు కుంచె తమ ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించారు. హాజరైన ప్రేక్షకులు భారతీయ వంటకాలు, పానీయాలను ఆస్వాదించారు.

ఆటా ప్రాంతీయ డైరెక్టర్ రఘు ఘాడీ భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు. సమాజ సేవను ప్రోత్సహించడం, సాంస్కృతిక వైవిధ్యం, వారసత్వాన్ని జరుపుకోవడం కోసం ఈ సందర్భంగా ప్రణాళికలు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ప్రాంతీయ కోఆర్డినేటర్లు చెన్నయ్య మద్దూరి, వంశీ ఏరువరం, శేషిరెడ్డి గాదె, సునీల్ అన్నపురెడ్డి, ఫరితొష్ పొలి, మహిళా చైర్ శుభ, బింద్య,నివేదిత ఘాడీ, తదితరులు ఈ కార్యక్రమం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి సహాయ సహాకారాలు అందించిన ప్రతిఒక్కరికీ ఆటా టీమ్ ధన్యవాదాలు తెలిపింది.

(చదవండి: న్యూజెర్సీలో తెలంగాణ ఉద్యమ నేత కడియం రాజుకు ఘనంగా నివాళులు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement