కేబీఎస్ బ్యాంకు సీఈవోపై కాల్పులు జరిపిన నిందితులను పోలీసులు ఆదివారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. గత ఆదివారం మాసబ్ ట్యాంక్ శాంతినగర్లోని శ్రీ దుర్గా కనుమిల్లి అపార్ట్మెంట్లో నివసించే కేబీఎస్ బ్యాంకు సీఈవో మన్మథ్ దాలియా ఇంటికి బైక్పై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి తుపాకీతో కాల్పులు జరిపి పరారయ్యాడు. ఆదివారం మధ్యాహ్నం దుండగుడు అపార్ట్మెంట్ వాచ్మెన్ను సంప్రదించి మన్మథ్ ఇంట్లోకి ప్రవేశించాడు.