cp mahender reddy
-
దేశ రక్షణలో సైనికుల పాత్ర కీలకం
హైదరాబాద్: దేశ రక్షణలో సైనికుల పాత్ర ఎంతో కీలకమని, అలా దేశం కోసం సేవ చేస్తూ అమరులైన సైనికులను స్మరించుకోవడం వారికిచ్చే గౌరవమని గవర్నర్ నరసింహన్ అన్నారు. హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్డు పీపుల్స్ ప్లాజా నుంచి పోలీసు అమరవీరుల స్మారకార్థం ఏర్పాటు చేసిన సంస్మరణ పరుగును ఆదివారం గవర్నర్ ప్రారంభించారు. గవర్నర్ మాట్లాడుతూ సైనికుల్ని యువత స్ఫూర్తిగా తీసుకుని దేశ రక్షణకు ముందుకు రావాలన్నారు. పోలీసులు నిరంతరం ప్రజాసంక్షేమం కోసం కృషి చేస్తున్నారని ప్రశంసించారు. అనంతరం 10కె, 5కె, 2కె రన్లను గవర్నర్, డీజీపీ అనురాగ్‌శర్మ ప్రారంభించారు. పరుగులో సీపీ మహేందర్‌రెడ్డితో పాటు యువకులు, ఔత్సాహికులు వేలాదిగా రన్లో పాల్గొన్నారు. -
ప్రశాంతంగా గణేశ్ నిమజ్జనం: సీపీ మహేందర్ రెడ్డి
హైదరాబాద్: గణేశ్ నిమజ్జనం ప్రశాంతంగా కొనసాగుతున్నదని సీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. బాలాపూర్ నుంచి ట్యాంక్ బండ్ వరకు శోభాయాత్ర కొనసాగుతుందన్నారు. అనుకున్న సమయానికే పూర్తవుతుందని, ట్యాంక్‌బండ్‌పైకి ఖైరతాబాద్ మహాగణపతిని తీసుకువచ్చామని వెల్లడించారు.హైదరాబాద్‌లో 12వేల విగ్రహాలకు జియోట్యాగింగ్ చేశామని చెప్పారు. ఎప్పటికప్పుడు విగ్రహాలు ఎక్కడ ఉన్నది తెలిసిపోతుందని ఆయన అన్నారు. రేపు ఉదయం కల్లా నిమజ్జనం ప్రక్రియ పూర్తవుతుందన్నారు. -
ఉత్సాహంగా మారథాన్ రన్..
హైదరాబాద్: టెలికం దిగ్గజం ఎయిర్టెల్ ఆధ్వర్యంలో చేపట్టిన ఫుల్ మారథాన్, హాఫ్ మారథాన్ ఆదివారం ఉదయం నెక్లెస్‌రోడ్డులో ప్రారంభమైంది. నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి ఫుల్ మారథాన్ (42కి.మీ)ను ఉదయం 5 గంటలకు ప్రారంభించగా.. హాఫ్ మారథాన్(21 కి.మీ)ను జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్ధన్‌రెడ్డి ఆరు గంటలకు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వేలాది మంది ఔత్సాహికులు పీపుల్స్ ప్లాజా నుంచి ఖైరతాబాద్ ఫ్లైఓవర్, రాజ్‌భవన్ రోడ్, రాజీవ్ సర్కిల్, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ మీదుగా హైటెక్స్ సిటీకి పరుగు తీశారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ.. గ్లోబల్ సిటీగా ఎదుగుతున్న నగరంలో ఇలాంటి వాక్‌లు ఎంతో అవసరమన్నారు. ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడం కోసం ప్రతి ఒక్కరూ నడక, పరుగు అలవరుచుకోవాలని సూచించారు. -
ఉత్సాహంగా మారథాన్ రన్..
-
విక్రమ్ గౌడ్ డైరెక్షన్లో కాల్పుల డ్రామా
హైదరాబాద్ : మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ముఖేష్ గౌడ్ తనయుడు విక్రమ్ గౌడ్‌పై కాల్పుల కేసులో మిస్టరీ ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు. ఈ కేసుకు సంబంధించి అనంతపురానికి చెందిన నలుగురు నిందితులను వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ నిందితులను పోలీసులు మంగళవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ ముఠాకు, విక్రమ్ గౌడ్‌కు గతంలోనే పరిచయం ఉన్నట్లు పోలీసులు తమ విచారణలో గుర్తించారు. అంతేకాకుండా ఈ కాల్పుల సూత్రధారి విక్రమ్ గౌడేనని పోలీసులు తమ విచారణలో తేల్చారు. సానుభూతి కోసమే విక్రమ్ కాల్పుల పథకం రచించినట్లు తెలుస్తోంది. తనకు తెలిసినవారితోనే తతంగం నడిపినట్లు సమాచారం, తన ఇంటి వెనుక కొత్త చెరువులో గన్ పడేసినట్లు తెలుస్తోంది. కాగా శుక్రవారం తెల్లవారుజామున 3.20 గంటల ప్రాంతంలో విక్రమ్‌గౌడ్‌పై కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. మరోపక్క ఆర్థిక ఇబ్బందులు, ఆయుధ లైసెన్స్ పునరుద్ధరణ, కుటుంబానికి దగ్గర కావడం తదితర కారణాల నేపథ్యంలో ఈ కథ మొత్తానికీ విక్రమ్‌గౌడే సూత్రధారా అన్న కోణాన్నీ పరిగణలోకి తీసుకుని ఆరా తీశారు. ఉదంతం జరిగిన విక్రమ్‌గౌడ్ ఇంటికి సమీపంలోనే ఆపోలో ఆస్పత్రి సైతం ఉండటంతో ఇంటినే స్పాట్‌గా ఎంచుకుని ఉంటారని భావిస్తున్నారు. ఈ వ్యవహారంలో విక్రమ్ ప్రమేయం బయటపడి, ఆయన ప్లాన్ ప్రకారమే కాల్పులు జరిగినట్లు లేదా కాల్చుకున్నట్లు తేలితే ఆయనతో పాటు సంబంధం ఉన్న వారిపైనా కేసుల నమోదుకు నిర్ణయించారు. అగంతకులు వాడిని ద్విచక్ర వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. కిరాయి హంతకులతో ఒప్పందం కుదుర్చుకున్న అతడు ఈ కాల్పుల డ్రామాకు తెరతీశాడు. కాగా పోలీసులను తప్పుదోవ పట్టించినందుకు విక్రమ్‌తో పాటు అతడి భార్య షిపాలీపై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు. -
‘నా భర్తను ఎవరో చంపడానికి యత్నించారు’
హైదరాబాద్ : కాల్పుల ఘటనలో గాయపడ్డ విక్రమ్‌గౌడ్ భార్య శిఫాలి మాత్రం తన భర్తపై హత్యాయత్నం జరిగిందని ఆరోపించారు. దర్గాలో అన్నదానం కోసం ఉదయం రెండున్నర గంటలకు నిద్ర లేచామని తనకంటే ముందు భర్త హాల్లోకి వెళ్లారని తెలిపారు. ఇంతలోనే కాల్పుల శబ్ధం రావడంతో.... కిందకు దిగానని అప్పటికే విక్రమ్ గౌడ్ రక్తపు మడుగులో ఉన్నారని చెప్పరు. ఒక వ్యక్తి కాల్పులు జరిపాడని భర్త విక్రమ్‌గౌడ్ తనతో చెప్పాడని శిఫాలి చెప్పారు. తన భర్తను ఎవరో చంపడానికి యత్నించారని ఆరోపించిన ఆమె, కాల్పులు జరిపిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని... బంజారాహిల్స్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. కాగా విక్రమ్ గౌడ్‌కు గత కొంతకాలంగా బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, ఈ బెదిరింపులకు సంబంధించి పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. వారం కిందటే గన్ లైసెన్స్ కోసం అప్లయి చేయగా పోలీసులు తిరస్కరించారన్నారు. తెలిసినవాళ్లే కాల్పులు జరిపారని, ఒక్కరే వచ్చి కాల్పులు జరిపినట్లు విక్రమ్ చెప్పాడని కుటుంబసభ్యులు పేర్కొన్నారు. విక్రమ్ కోలుకున్న తర్వాత నిందితుడి పేరు చెబుతాడన్నారు. -
విక్రమ్ కాల్పుల ఘటనపై దర్యాప్తు వేగవంతం: సీపీ
హైదరాబాద్ : మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ తనయుడు విక్రమ్‌గౌడ్‌పై కాల్పుల ఘటనపై అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నామని సీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. ఆయన శుక్రవారం ఉదయం ఘటనా స్థలాన్ని పరిశీలించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మహేందర్ రెడ్డి కాల్పుల ఘటన వివరాలను మీడియా సమావేశంలో వివరించారు. రోజు తెల్లవారుజామున 3 గంటలకు కాల్పులు జరిగాయన్నారు. ఆ సమయంలో వాచ్మెన్, అతని భార్య, ఇంకో పనిమనిషితో పాటుగా భార్యాభర్తలు (విక్రమ్ గౌడ్, శిఫాలీ) మాత్రమే ఉన్నారని, సంఘటన జరగటం బాధాకరమని,ఈ కేసును త్వరలోనే ఛేదిస్తామని మహేందర్ రెడ్డి తెలిపారు. విక్రమ్ శరీరంపై రెండు గాయాలున్నాయని, ఎలా జరిగిందనే దానిపై విచారణ చేస్తున్నామన్నారు. కేసు తీవ్రత దృష్ట్యా వెస్ట్ జోన్‌తో పాటు టాస్క్‌ఫోర్స్ కూడా విచారణ చేయనున్నట్లు ఆయన తెలిపారు. విక్రమ్ గౌడ్ నివాసంలో ఆధారాలు సేకరించామని, క్లూస్‌టీమ్‌తో పాటు టాస్క్‌ఫోర్స్ బృందాలు రంగంలోకి దిగాయన్నారు. తెల్లవారుజామున పెద్దమ్మ గుడికి వెళ్లే సమయంలో కాల్పుల శబ్ధం వినిపించిందని విక్రమ్ భార్య తెలిపారని, ఆస్పత్రికి తీసుకు వచ్చిన సమయంలో విక్రమ్ స్పృహలోనే ఉన్నారని సీపీ పేర్కొన్నారు. ఏం జరిగిందనేది కొంత సమయం తర్వాత చెబుతానన్నాడని, విక్రమ్ సమాధానం కోసం ఎదురు చూస్తున్నామన్నారు. మొత్తం రెండు రౌండ్లు కాల్పులు జరిగినట్లు తెలుస్తోందన్నారు. ఇక కాల్పుల సమయంలో ఫ్లోర్‌పై రక్తం పడి ఉందని, తుడిచి వేసినట్లుగా కనిపిస్తోందన్నారు. తెలియక తుడిచానని వాచ్మెన్ చెబుతున్నాడని సీపీ చెప్పారు. విక్రమ్ వద్ద ఎలాంటి ఆయుధం లేదని, సమీపంలోని అన్ని సీసీ ఫుటేజ్‌లు సేకరించామన్నారు. వాహనాల కదలికలను పరిశీలిస్తున్నామని, నిందితులను సాధ్యమైనంత త్వరగా పట్టుకుంటామన్నారు. కాగా ఘటన జరిగి ఏడు గంటలు దాటుతున్నా....కాల్పుల కారణాలపై పోలీసులు నిర్దారణకు రాలేకపోతున్నారు. బయట వ్యక్తులే తమ వాడిపై కాల్పులు జరిపాడని...విక్రమ్‌గౌడ్ బంధువులు ఆరోపిస్తున్నప్పటికీ పోలీసులు మాత్రం ధ్రువీకరించడం లేదు. కొన్ని రోజులుగా విక్రమ్‌గౌడ్‌కు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని అని కూడా బంధువులు అంటున్నారు. ఈ ఘటనపై పూర్తి విచారణ జరిగితేకానీ ఏమీ చెప్పలేమంటున్నారు. అయితే ఆగంతకులే కాల్పులు జరిపారనే దాన్ని తోసిపుచ్చుతున్నారు. ఆ మేరకు ఆధారాలు లభించనందు వల్లే పోలీసులు ఈ నిర్ణయానికొచ్చినట్టు తెలుస్తోంది. సీసీ కెమెరాల్లో ఆగంతకులకు సంబంధించిన ఎలాంటి విజువల్స్ రికార్డు కాలేదని తెలిసింది. ఒక సమయంలో ఆత్మహత్యాకోణంపైనే పోలీసులు ఎక్కువుగా దృష్టి సారించారు. అయితే ఈ కోణంలోనూ ఎన్నో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆత్మహత్యాయత్నం చేసుకుంటే ఆయుధం ఏమూంది? దాన్ని ఎవరు మాయం చేశారు?. ఆత్మహత్యే అయితే దాన్ని దాచాల్సిన అవసరం బంధువులకు ఎందుకొచ్చింది? అనేది కీలకంగా మారింది. ఇదిలా ఉంటే అసలు విక్రమ్‌గౌడ్‌కు లైసెన్స్ వెపనే లేదని పోలీసులు చెబుతున్నారు. మరి లైసెన్స్ గన్ లేకపోతే కాల్పులకు కారణమైన గన్ ఎవరిది?. విక్రమ్‌గౌడ్ అక్రమంగా ఆయుధం కలిగి ఉన్నారా? మరెవరిదైనా ఇంట్లో పెట్టుకున్నారా? ఇలా ఎన్నో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు కాల్పులు జరిగింది పిస్టల్తోనో, రివాల్వర్తోనూ అనేది కూడా అంతుపట్టడం లేదు. అయితే తాము అన్ని కోణాల్లో శాస్త్రీయ విచారణ చేసిన తర్వాతే ఒక నిర్ణయానికొస్తామని వెస్ట్‌జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు తెలిపారు. విక్రమ్‌గౌడ్‌పై ఆగంతకులు వచ్చి కాల్పులు జరిపినట్టు చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లభించలేదని అన్నారు. బెదిరింపు కాల్స్ విక్రమ్‌కు వచ్చాయా లేదా అనేది తమ దృష్టికి రాలేదని చెబుతున్నారు. మిస్టరీగా మారిన కాల్పుల కేసులో అన్ని కోణాల్లో విచారిస్తున్నామంటున్న డీసీపీ తెలిపారు. సెక్షన్ 307 ప్రకారం కేసు నమోదు చేశామని, సీసీ కెమెరా, ఫోన్ కాల్స్ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
విక్రమ్ కాల్పుల ఘటనపై దర్యాప్తు వేగవంతం: సీపీ
-
తాగండి తప్పులేదు.. కానీ.. : అల్లు అర్జున్
హైదరాబాద్: రూల్స్ బ్రేక్ చేయడం ప్రజలు అలవాటుగా మార్చుకుంటున్నారని హీరో అల్లు అర్జున్ అన్నాడు. మన పరిసరాల పరిశుభ్రత, మన ట్రాఫిక్ తీరు చూసిన వారు మన మనస్తత్వం ఏంటో చెప్పగలరని తెలిపాడు. ట్రాఫిక్ నిబంధనలు పాటిద్దామని కోరారు. మందు తాగండి.. కానీ ఆ మత్తులో వాహనాలు నడపవద్దని సూచించాడు. ‘నీ కారణాలు తప్పు ముందు నిలబడవు , రూల్స్ కఠినంగా ఉన్నా... ఇంకా మార్పు రావాలి, చాదస్తం అనుకున్నా సరే... అవతలివారి ప్రాణాలతో ఆడుకోవద్దు’ అని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణపై శ్రీనగర్ కాలనీలోని సత్యసాయి నిగమంలో అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి, ట్రాఫిక్ డీసీపీ రంగనాథ్‌తో పాటు సినీ నటుడు అల్లు అర్జున్, దర్శకుడు రాజమౌళి పాల్గొన్నారు. దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ.. యువతకు అన్నీ విషయాల్లో స్పీడ్ అవసరమే కానీ, డ్రైవింగ్ విషయంలో మాత్రం ఈ స్పీడ్ అవసరంలేదని తెలిపారు. అతివేగానికి మన రహదారులు అనుకూలంగా లేవని చెప్పారు. ఈ సందర్భంగా సీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. సేఫ్ అండ్ సెక్యూర్ సిటీగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుకుందామన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించి ఈ క్యాంపెయిన్ లో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని కోరారు. స్ట్రీట్ బేస్ టెక్నాలజీని త్వరలో అందుబాటులో తీసుకురానున్నట్టు తెలిపారు. నగరంలో 15 వేల సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని, లక్ష సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. తప్పు చేస్తే శిక్ష పడుతుందనే భయం ఉండాలన్నారు. -
నా భర్త ఎక్కడున్నారో చెప్పండి:సుశీల
-
నా భర్త ఎక్కడున్నారో చెప్పండి: కోదండరామ్ భార్య
హైదరాబాద్: తన భర్త, జేఏసీ కన్వీనర్, ప్రొఫెసర్ కోదండరామ్‌ను తెల్లవారు జామున అరెస్టు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన భార్య సుశీల ప్రశ్నించారు. తన భర్త ఆచూకీ తెలపాలని, ఆయనను వెంటనే విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ‘నిరుద్యోగ ర్యాలీలో సంఘ విద్రోహ శక్తులు ఉన్నాయంటున్నారు.. అలాంటప్పుడు తెలంగాణ ఉద్యమానికి మద్దతిచ్చింది కూడా సంఘ విద్రోహ శక్తులేనా’ అని ఆమె నిలదీశారు. నిరుద్యోగ ర్యాలీ నేపథ్యంలో కోదండరామ్‌ను ముందస్తు అరెస్టు చేసిన సందర్భంగా సుశీల మంగళవారం పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డిని కలిసి వివరాలు అడిగారు. ఉదయం 6గంటలకు బయటకు వస్తానని చెప్పినా తెల్లవారు జామున 3.30గంటల ప్రాంతంలో తలుపులు బద్ధలు కొట్టి అరెస్టు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దొంగలు, దోపిడీ దారులు తమ వద్ద ఉన్నట్లు పోలీసులు ప్రవర్తించారని దిగులుచెందారు. తన భర్తను వెంటనే విడుదల చేయాలని, ఉద్యోగ ఖాళీలపై నోటిఫికేషన్ ఇచ్చి తీరాల్సిందేనని కోదండరామ్ భార్య సుశీల డిమాండ్ చేశారు. జేఏసీ తరుపున కోర్టులో వాదనలు చేసిన అడ్వకేట్ రచనా రెడ్డి మాట్లాడుతూ ‘ఉదయం ఆరుగంటలకు బయటకు వస్తానని, కావాలంటే అప్పుడు అరెస్టు చేసుకోండని కోదండరామ్ చెప్పారు. కానీ పోలీసులు పట్టించుకోలేదు. తెల్లవారు జామున తలుపులు పగులగొట్టి అరెస్టు చేయాల్సిన అవసరం ఏముంది? మూడుగంటల నుంచి ఇప్పటి వరకు ఆయనను ఎక్కడ ఉంచారో ఎవరికీ తెలియదు. ఆయనను వెంటనే విడుదల చేయాలి. దుర్మార్గంగా వ్యవహరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి’ అని ఆమె డిమాండ్ చేశారు. మరోపక్క, సీపీ మహేందర్‌రెడ్డిని కలిసిన అనంతరం సుశీల గవర్నర్ నరసింహన్‌ను కలిసేందుకు వెళ్లారు. అయితే, ఆయన లేకపోవడంతో వెనుదిరిగారు. సంబంధిత వార్తలకై చదవండి.. సీపీని కలిసిన కోదండరామ్ సతీమణి కోదండరాం అరెస్ట్ అప్రజాస్వామికం : ఉత్తమ్ కోదండరాం అరెస్ట్‌పై జేఏసీ నేతల ఆగ్రహం (రాజధాని దిగ్బంధం: కోదండరాం అరెస్ట్ ) -
సీపీని కలిసిన కోదండరామ్ సతీమణి
హైదరాబాద్ : తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ(టీ-జేఏసీ) చైర్మన్ ప్రొ.కోదండరాం సతీమణి సుశీల హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డిని బుధవారం కలిశారు. కోదండరాం ఆచూకీ తెలపాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఆయన్ను అరెస్ట్ చేసిన తీరుపై సీపీకి ఫిర్యాదు చేశారు. మహేందర్ రెడ్డిని కలిసిన వారిలో న్యాయవాది రచనారెడ్డి, జేఏసీ నాయకులు ఉన్నారు. (రాజధాని దిగ్బంధం: కోదండరాం అరెస్ట్ ) తార్నాకలోని కోదండరాం నివాసంలో బుధవారం తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో ఇంటి తలుపులను బద్దలుకొట్టి మరీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. నిరుద్యోగ ర్యాలీ, సభ నిర్వహించి తీరుతామని టీజేఏసీ ప్రకటించడంతో రాష్ట్రవ్యాప్తంగా జేఏసీ నేతలను పోలీసులు అరెస్ట్ చేయడంతో పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కోదండరాం అరెస్ట్ సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరుపట్ల పలు రాజకీయ పార్టీల నేతలు, జేఏసీ నాయకులు, విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత వార్తలు కోదండరాం అరెస్ట్ అప్రజాస్వామికం : ఉత్తమ్ కోదండరాం అరెస్ట్‌పై జేఏసీ నేతల ఆగ్రహం -
1500మంది పోలీసులతో బందోబస్తు
హైదరాబాద్ : నూతన సంవత్సరం వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 1500మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు సీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ న్యూ ఇయర్ పార్టీలో డ్రగ్స్ సరఫరా చేస్తే ఈవెంట్ మేనేజర్ పై కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. అలాగే ఈవెంట్‌కు వచ్చినవారిని సురక్షితంగా ఇంటికి చేర్చే బాధ్యత కూడా ఈవెంట్ నిర్వహకులదే అని సీపీ పేర్కొన్నారు. ఇక డీజేలకు అనుమతి లేదని న్యూ ఇయర్ వేడుకలకు డిసెంబర్ 31 రాత్రి 8 గంటల నుంచి తెల్లవారుజాము 2 గంటల వరకు మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. ఆలోపే వేడుకలను పూర్తి చేసుకోవాలని సీపీ సూచించారు. నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో మరింత పకడ్బందిగా డ్రంక్ అండ్ డ్రైవ్‌ను నిర్వహిస్తామన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ట్రిబుల్ రైడింగ్, ర్యాస్ డ్రైవింగ్ నిర్వహించే వారిని ఉపేక్షించేది లేదన్నారు. వారిపై మోటార్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. -
బీహార్ లో తుపాకీ కొని..
హైదరాబాద్: కేబీఎస్ బ్యాంకు సీఈవోపై కాల్పులు జరిపిన నిందితులను పోలీసులు ఆదివారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. గత ఆదివారం మాసబ్ ట్యాంక్ శాంతినగర్‌లోని శ్రీ దుర్గా కనుమిల్లి అపార్ట్మెంట్లో నివసించే కేబీఎస్ బ్యాంకు సీఈవో మన్మథ్ దాలియా ఇంటికి బైక్‌పై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి తుపాకీతో కాల్పులు జరిపి పరారైన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితులైన నలుగురిలో షేక్ అబ్దుల్ రహీం, నరేష్, రాజేందర్ లను పట్టుకున్నట్లు సీపీ మహేందర్ రెడ్డి చెప్పారు. నాలుగో నిందితుడు వెంకటరత్నం ఇంకా పరారీలో ఉన్నట్లు తెలిపారు. నిందితులందరూ రాజమండ్రికి చెందనివారేనని పేర్కొన్నారు. వీరిలో ఇద్దరు తుపాకీ కొనుగోలు చేసేందుకు బీహార్ వెళ్లినట్లు తెలిపారు. తుపాకీ కొనుగోలు తర్వాత ప్లాన్ ప్రకారం.. దాలియాపై దాడి చేసి డబ్బు దోచుకునేందుకు ఆయన ఇంటి వద్దకు వెళ్లి కాల్పులు జరిపినట్లు చెప్పారు. ప్లాన్ విఫలం అవడంతో అక్కడి నుంచి పరారయ్యారని.. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో మొత్తం పది ప్రత్యేక పోలీసు బృందాలు ఈ కేసులో రెండు రోజుల్లోనే పురోగతి సాధించినట్లు తెలిపారు. -
డబ్బు కోసమే బ్యాంకు సీఈవోపై కాల్పులు
-
'సోషల్ మీడియా ఫోటోలతో జాగ్రత్త'
బహదూర్‌పురా : సోషల్ మీడియాలో వచ్చే ఎలాంటి చిత్రాలనైనా ఎక్కువగా ఇతరులకు పంపిస్తూ ప్రచారం చేయవద్దని నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్ రెడ్డి సూచించారు. ఇటీవల సోషల్ మీడియాలో హల్చల్ చేసిన ఫోటోల నేపథ్యంలో కమిషనర్ వివిధ మత పెద్దలు, విద్యా సంస్థల ఉపాధ్యాయులు, విద్యార్థులతో శనివారం సాలార్జంగ్ మ్యూజియంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సోషల్ మీడియా వాట్సాఫ్, ఫేస్బుక్, ట్విట్టర్లలో వచ్చే చిత్రాలు మత విశ్వాసాలకు భంగం కలిగిస్తూ మనోభావాలను దెబ్బతిసేలా ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. గత కొద్దిరోజుల కిందట సోషల్ మీడియాలో వచ్చిన ఓ చిత్రం పాతబస్తీలో కలకలం రేపిందన్నారు. ఇలాంటి వాటిపై మత పెద్దలు, విద్యావంతులు జాగ్రత్తతో ఉండాలన్నారు. విదేశాల నుంచి వచ్చే వాటిపై కూడా కేంద్ర సహకారం తీసుకుని, ఆ దేశాలకు ఫిర్యాదు చేస్తూ తగిన చర్యలు తీసుకుంటామన్నారు. వీటన్నిటిపై పాఠశాల, కళాశాల దశలోనే విద్యార్థులకు అవగాహన కల్పించనున్నట్లు మహేందర రెడ్డి చెప్పారు. -
బక్రీద్ నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు
- మంగళవారం ఉదయం 8 నుంచి 11.30 వరకు అమలు హైదరాబాద్: బక్రీద్ పండుగ నేపథ్యంలో మంగళవారం వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. మీరాలం ట్యాంక్ ఈద్గాతో పాటు సికింద్రాబాద్‌లోని ఈద్గా వద్దా ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 11.30 గంటల వరకు వన్ వే అమలులో ఉంటుందని కమిషనర్ పేర్కొన్నారు. మీరాలం - ఈద్గా వైపు వెళ్లే వాహనాలను పురానాపూల్, బహదూర్‌పుర పోలీసుస్టేషన్ మీదుగా పంపిస్తారు. ఈద్గా వైపు నుంచి బహదూర్‌పుర పోలీసుస్టేషన్ వైపు వాహనాలను అనుమతించరు. - శివరామ్‌పల్లి, నేషనల్ పోలీసు అకాడెమీ మీదుగా బహుదూర్‌పుర వచ్చే ట్రాఫిక్‌ను దానమ్మ గుడిసెల వద్ద ఉన్న టి జంక్షన్ నుంచి ఇంజన్ బౌలీ మీదుగా పంపిస్తారు. - ఈద్గా క్రాస్ రోడ్స్ నుంచి సైకిళ్లు, రిక్షాలను ఈద్గా వైపు అనుమతించరు. నిర్దేశించిన ప్రాంతాల్లో వీటిని పార్క్ చేసుకోవాలి. - ఈద్గా వద్దకు వస్తున్న వారిని తీసుకువచ్చే కార్లు, ఆర్టీసీ బస్సులు, టూరిస్ట్ బస్సులు, లారీలు ఇతర వాహనాలను ఈద్గా వద్దకు అనుమతించరు. వీటిని మీరాలం ఫిల్టర్ బెడ్ టి జంక్షన్ వద్ద కేటాయించిన ప్రాంతాల్లో పార్క్ చేసుకోవాలి. - ప్రార్థనల అనంతరం ఈద్గాకు వచ్చిన వారిని తీసుకుని వెళ్లే వాహనాల్లో వేగంగా వెళ్లే వాటిని తాడ్బన్ రోడ్, బోయిస్ టౌన్ స్కూల్, న్యూ రోడ్ షంషీర్గంజ్, ఆలియాబాద్, చార్మినార్ మీదుగా పంపుతారు. సికింద్రాబాద్ - కార్లు, ఆర్టీసీ బస్సులు, మోటారు సైకిళ్లు, లారీలు ఈద్గా చౌరస్తా నుంచి బాలమ్రాయ్ మీదుగా బాలమ్రాయ్ టి జంక్షన్‌కు చేరుకోవాలి. -
బాధ్యులపై చర్యలు తీసుకుంటాం
-
రమ్య మృతి బాధాకరం, నిందితుడికి కఠినశిక్ష : సీపీ
హైదరాబాద్: పంజాగుట్ట కారుప్రమాదంలో గాయపడ్డ చిన్నారి రమ్య మృతిచెందడం అత్యంత బాధాకరమని నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. సీపీ ఆదేశాల మేరకు డీసీపీ వెంకటేశ్వరరావు ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు తీసుకున్న చర్యలపై సీపీ మహేందర్‌రెడ్డి పత్రికా ప్రకటన విడుదల చేశారు. ప్రమాదానికి కారణమైన నిందితుడికి కఠినశిక్ష పడేవిధంగా చర్యలు తీసుకుంటామని సీపీ తన పత్రికా ప్రకటనలో వెల్లడించారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ జరిగేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కారు ప్రమాదం తీవ్రత దృష్ట్యా యాక్సిడెంట్ కేసులా కాకుండా..తీవ్రమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. వాహనం నడిపిన డ్రైవర్‌ను అరెస్ట్ చేసి జైలుకు పంపామని..నిందితుడికి పదేళ్ల వరకు శిక్ష పడే అవకాశముందన్నారు. ఈ కేసుకు సంబంధించి మద్యం సేవించడం, సీసీ టీవీ ఫుటేజ్‌తో పాటు అన్నీ ఆధారాలను సేకరించినట్లు వెల్లడించారు. నిందితుని గుర్తింపు కోసం పరేడ్ నిర్వహిస్తామన్నారు. నిందితుడి కస్టడీ కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు చెప్పారు. 21 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న వారికి మద్యం అమ్మినందుకు బార్‌పై చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ కమిషనర్‌కు నివేదిక పంపినట్లు తెలిపారు. కారు నడిపిన వ్యక్తిని షవెల్గా గుర్తించినట్లు అతనికి డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేదని తమ విచారణలో నిర్థారించినట్లు పోలీసులు చెప్పారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఆరుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు ఉన్నారని.. అందరు మైనర్లేనన్నారు. వెహికల్ ఓనర్‌పై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. పిల్లలు ఏంచేస్తున్నారో తల్లిదండ్రులు శ్రద్థ వహించాలని సీపీ సూచించారు. కారు నడిపిన షవెల్ ప్రస్తుతం జైలులో ఉన్నాడని..అతనికి శిక్ష పడేలా 164 స్టేట్మెంట్ తీసుకున్నామన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అన్ని విభాగాలతో సమన్వయం చేసుకునేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మహేందర్ రెడ్డి తన ప్రకటనలో వెల్లడించారు. ఈ నెల ఒకటో తేదీన పంజాగుట్ట ఫ్లైఓవర్‌పై జరిగిన కారు ప్రమాదంలో రమ్య కుటుంబం చిన్నాభిన్నమైంది. ఈ ప్రమాదంలో రమ్య బాబాయి రాజేష్ అక్కడిక్కడే మృతిచెందగా, 9 రోజులుగా రమ్య మృత్యువుతో పోరాడి మృతిచెందింది. రమ్య తల్లి, తాతయ్య ఆసుపత్రి పాలైన విషయం తెలిసిందే. -
రమ్య మృతి బాధాకరం, నిందితుడికి కఠినశిక్ష
-
రూ. 1.30 కోట్లను శివ ఎలా కొట్టేశాడంటే..!
బురిడీ బాబా శివను పిలిపించి, తన ఇంట్లో పూజ చేయించినది లైఫ్‌స్టైల్ భవన యజమాని మధుసూదన్ రెడ్డేనని హైదరాబాద్ పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి తెలిపారు. శివతో పాటు ఈ కేసులో అరెస్టుచేసిన మరో ఇద్దరిని మీడియా ముందు శుక్రవారం సాయంత్రం ప్రవేశపెట్టారు. మోహన్ రెడ్డి అనే మరో వ్యక్తికి కూడా ఈ కేసులో సంబంధం ఉందని, అసలు అతడే తొలుత శివను మధుసూదన్ రెడ్డికి పరిచయం చేసి, అతడికి అతీంద్రియ శక్తులు ఉన్నట్లు చెప్పాడని, ప్రస్తుతం అతడు పరారీలో ఉండటంతో గాలిస్తున్నామని ఆయన అన్నారు. గతంలో బెంగళూరు గోల్ఫ్ క్లబ్బులో కలిసినప్పుడు శివ లక్ష రూపాయలను రెండు లక్షలుగా చేసినట్లు మభ్యపెట్టి మధుసూదన్ రెడ్డిని నమ్మించాడన్నారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం ఈ ఘటన ఇలా జరిగింది... బెంగళూరు గోల్ఫ్ క్లబ్ ఘటన తర్వాత నుంచి ఇద్దరి పరిచయం కొనసాగింది. లక్ష్మీపూజ ద్వారా డబ్బును డబుల్ చేస్తానని, రైస్ పుల్లింగ్ కాయిన్ కూడా ఉందని, దీన్ని విదేశాల్లో అమ్మితే వందల కోట్లు వస్తుందని శివ చెప్పాడు. దాంతో బాగా నమ్మిన మధుసూదన్ రెడ్డి తన ఇంట్లో పూజ చేయించుకోడానికి 14వ తేదీన బెంగళూరు నుంచి టాక్సీ బుక్ చేసి అక్కడి నుంచి శివను రప్పించారు. హైదరాబాద్ బంజారాహిల్స్ ఓహ్రీ హోటల్లో రూం బుక్ చేశారు. మధుసూదన్ రెడ్డికి తెలియకుండానే మరో ఇద్దరు రంగప్రవేశం చేశారు. దామోదర్, శ్రీనివాసరెడ్డి అనే ఇద్దరూ 1.75 లక్షలు తెచ్చి శివకు ఇచ్చారు. పూజ తర్వాత వాళ్లకు 3 నుంచి 4 రెట్లు డబ్బు ఇస్తానని శివ వారికి చెప్పాడు. వాళ్లిద్దరూ కూడా ఓహ్రీస్ హోటల్లోనే రూం తీసుకున్నారు. 14వ తేదీన మధుసూదన్ రెడ్డి శివను తీసుకుని, ఎంజే మార్కెట్లో పూజ సామగ్రి తీసుకుని, అక్కడి నుంచి ఉదయం 10.30 -11 గంటల మధ్యలో ఇంటికి తీసుకెళ్లారు. ముందుగా పూజలో 1.5 లక్షలు పెట్టించాడు. దానికి దామోదర్, శ్రీనివాసరెడ్డి ఇచ్చిన డబ్బును కలిపి, 3 లక్షలుగా చూపించాడు. ఇంకా పెద్ద మొత్తంలో డబ్బు పెడితే చాలా రెట్లు అవుతుందని చెప్పాడు. దాంతో, ఈ పూజ కోసమే తాను తెప్పించిన రూ. 1.30 కోట్లను మధుసూదన్ రెడ్డి పూలరేకుల వద్ద పెట్టారు. పూజ మధ్యాహ్నం వరకు కొనసాగినా డబ్బు మాత్రం రెట్టింపు కాలేదు. దాంతో మరో పూజ చేయాల్సి ఉంటుందని, ఇంకో పూజ చేయాల్సి ఉంటుందని, దగ్గరలోని ఆలయానికి డబ్బు తీసుకెళ్లి పూజ చేయాలన్నాడు. బయటకు వెళ్లేముందు మధు సూదన్ రెడ్డికి, ఆయన భార్యకు, కుమారుడు సందేశ్ రెడ్డికి అక్కడ తాను తయారుచేసిన ప్రసాదాన్ని పంచాడు. ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం ఉమ్మెత్త ఆకులు, సీసం లాంటి పదార్థాలతో దాన్ని తయారుచేశాడు. దంపతులను ఇంట్లోనే ఉంచి, కేవలం సందేశ్‌రెడ్డిని మాత్రం తనవెంట తీసుకెళ్లాడు. అక్కడ పూజ చేసిన తర్వాత తన చేతులు కడుక్కోవాలని అతడిని హోటల్ వద్దకు తీసుకెళ్లాడు. వాళ్లిద్దరూ పైకి వెళ్లినప్పుడు సందేశ్ రెడ్డి కారు లాక్ చేశారు. పైకి వెళ్లిన తర్వాత డబ్బు ఎలా తీసుకోవాలన్న ఆలోచనతో.. కాసేపు మెడిటేషన్ చేద్దాం, అందుకోసం మెటల్ వస్తువులు ఏమైనా ఉంటే అన్నీ తీసి పక్కన పెట్టాలన్నాడు. దాంతో సందేశ్ రెడ్డి కారు తాళాలు, ఫోను, ఇతర వస్తువులన్నీ పక్కన పెట్టారు. కాస్త మగతగా ఉన్న అతడిని ఏమార్చి కారు తాళాలు తీసుకుని, నేరుగా కిందకు వచ్చి కారులో ఉన్న రూ. 1.30 కోట్ల మొత్తాన్ని టాక్సీలోకి మార్చేశాడు. తర్వాత కారు తీసుకుని సందేశ్ రెడ్డి వెళ్లిపోయారు. కాసేపటికి శివ పైకి వెళ్లి గది ఖాళీ చేసి టాక్సీ ఎక్కి, వేరే వైపు వెళ్లిపోయాడు. తీరా ఇంటికి వెళ్లిన తర్వాత సందేశ్ రెడ్డి చూసుకుంటే కారులో డబ్బు లేదని తెలిసింది. లోపల తల్లిదండ్రులు ఇద్దరూ స్పృహతప్పి ఉండటంతో వారిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. శివ తాను బయల్దేరిన టాక్సీలోనే కొంతదూరం వెళ్లి, దామోదర్, శ్రీనివాసరెడ్డిలను జీవీకే మాల్ వద్దకు పిలిపించాడు. తనవద్ద ఉన్న రూ. 1.30 కోట్ల లోంచి రూ. 12 లక్షలు తీసి వాళ్లకు ఇచ్చాడు. తర్వాత అక్కడినుంచి ఆటోలో ఆరాంగఢ్ చౌరస్తాకు వెళ్లాడు. అక్కడ బ్యాగులు కొనుక్కుని, డబ్బు వాటిలో ప్యాక్ చేసి బెంగళూరుకు బస్సులో వెళ్లిపోయాడు. -
రంజాన్ వ్యాపారాలకు ప్రత్యేక అనుమతి
* సమస్యల పరిష్కారానికి కంట్రోల్ రూం * 22న పోలీస్ ఇఫ్తార్ * సీపీ మహేందర్‌రెడ్డి ప్రకటన బహదూర్‌పురా: రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం వ్యాపార సముదాయాలు ఉన్నచోట రోజంతా (24 గంటలు) వ్యాపారాలు కొనసాగేందుకు అనుమతిస్తున్నట్టు నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి ప్రకటించారు. సోమవారం సాలార్జంగ్ మ్యూజియంలో మసీదు కమిటీతో పాటు సంబంధిత ప్రభుత్వ విభాగాల ఉన్నతాధికారులతో కో ఆర్డినేషన్ కమిటీ సమావేశం జరిగింది. ఇందులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యుత్, జలమండలి, జీహెచ్ఎంసీ సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశామన్నారు. నగర వ్యాప్తంగా లక్ష సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామని, దక్షిణ మండలంలోనూ పెద్ద ఎత్తున వీటిని ఏర్పాటు చేస్తామన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పికెట్ నిర్వహిస్తూ, 24 గంటల పాటు పెట్రోలింగ్, మహిళల రక్షణ కోసం షీ టీమ్ బృందాలను రంగంలోకి దింపామన్నారు. రంజాన్‌లో ఎలాంటి సంఘటనలు జరగకుండా అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్టు ఆయన తెలిపారు. నగర పోలీసు విభాగంలో ఈ నెల 22న చౌమహల్లా ప్యాలెస్‌లో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. విద్యుత్, జలమండలి, జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు మాట్లాడుతూ.. మసీదుల వద్ద అదనపు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశామన్నారు. చెత్త తొలగించేందుకు ఉదయం, సాయంత్రం వేళల్లో పనిచేసేందుకు సిబ్బందిని నియమించామని, నీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకున్నామన్నారు. సాయంత్రం నమాజ్ అనంతరం వచ్చే వ్యర్ధాలను ఎక్కడ పడితే అక్కడే వేయకుండా మసీదులకు ప్లాస్టిక్ కవర్లను సరఫరా చేస్తున్నట్టు వివరిచారు. నెల రోజులకు సరిపడ ప్లాస్టిక్ కవర్లను ఒక్కసారిగా మసీదులకు అందజేసి, సిబ్బంది ద్వారా వాటిని సేకరిస్తామన్నారు. మసీదుల ఇమామ్‌లు, కమిటీల సభ్యుల నుంచి వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించేందుకు ఏర్పాట్లు చేశామని ఆయా విభాగాల అధికారులు పేర్కొన్నారు. ఈ సమావేశంలో నగర ట్రాఫిక్ అడిషనల్ సీపీ జితేంద్ర, లా అండ్ ఆర్డర్ అడిషనల్ సీపీ శ్రీనివాసరావు, దక్షిణ మండలం డీసీపీ వి. సత్యనారాయణ, టీఎస్ఎస్పీడీసీఎల్ ఎస్ఈ ఆనంద్, జీహెచ్ఎంసీ దక్షిణ మండలం జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, దక్షిణ అడిషనల్ డీసీపీ బాబూరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
ముందు తాగిస్తాడు.. తర్వాత దోచేస్తాడు
♦ జ్యువెలరీ దొంగను అరెస్టు చేసిన మార్కెట్ పోలీసులు ♦ గతంలో రైతులను కూడా మోసం చేసిన చిన్నారెడ్డి ♦ వివరాలు వెల్లడించిన సీపీ మహేందర్ రెడ్డి సాక్షి, హైదరాబాద్: చూసేందుకు జెంటిల్మన్ వేషధారణ.. చేతిలో నగదు కట్టలు ఉన్నట్టుగా భ్రమింపజేసే ఓ బ్యాగ్.. మార్కెట్‌కు వచ్చే జ్యువెలరీ షాప్ ఉద్యోగులు.. రైతులను లక్ష్యంగా చేసుకుని చోరీలు.. ఇదీ ఆ జ్యువెలరీ దొంగ తీరు. దర్జాగా డ్రెస్ చేసుకుని ఉన్నత స్థాయి వర్గాలకు చెందిన వ్యక్తిలా హడావుడి చేస్తూ ఫైనాన్స్ బిజినెస్ చేస్తున్నానని బాధితులతో పరిచయం పెంచుకుంటాడు. వారికున్న మద్యం తాగే అలవాటును ఆసరాగా చేసుకుని పీకలదాకా తాగిస్తాడు. ఆ తర్వాత వారి వద్ద ఉన్న బంగారు ఆభరణాల సంచిని, డ బ్బుల్ని చోరీ చేసి ఉడాయిస్తాడు. ఈ రకమైన చోరీలు చేసిన నిజామాబాద్‌కు చెందిన అబ్దుల్లాపురం చిన్నారెడ్డిని మార్కెట్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. జంటనగరాల్లోని జ్యువెలరీ షాప్‌ల నుంచి కొనుగోలు చేసిన 2.3 కిలోల బంగారు ఆభరణాలను తీసుకొస్తున్న తన డ్రైవర్ ప్రశాంత్‌కు పీకలదాకా మద్యం తాగించి ఓ వ్యక్తి తస్కరించుకుని పోయాడని వరంగల్‌కు చెందిన నగల వ్యాపారి బొల్లామ్ సంపత్ కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన మార్కెట్ పోలీసులు చాకచాక్యంగా వ్యవహరించి ఈ కేసును ఛేదించారు. ఈ కేసు వివరాలను నగర పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి శనివారం విలేకర్లకు వెల్లడించారు. సీసీటీవీ ఆధారంగా... బాధితుడి ఫిర్యాదు మేరకు ఘటనాస్థలిని సందర్శించిన విచారణ బృందం ఆయా మార్గాల్లోని కమ్యూనిటీ సీసీటీవీ ఫుటేజీలోని దృశ్యాలను సేకరించింది. నిందితుడిని గుర్తించిన పోలీసులు... జనగామ్, వరంగల్, అచ్చంపేట, తిరుపతి, ఆర్మూర్, నిజామాబాద్‌కు బృందాలను పంపించారు. చివరకు నిజామాబాద్ జిల్లాలోని ముబారక్‌నగర్‌లోని లక్ష్మీప్రియానగర్ నివాసంలో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు పట్టుకున్నాయి. నిందితుడి నుంచి మార్కెట్ ఠాణాలో చోరీకి గురైన 2.4 కిలోల బంగారం, తులం రింగ్, గోపాలపురం ఠాణా పరిధిలో దొంగలించిన 10 తులాల బంగారం, సెల్‌ఫోన్‌తో పాటు కరీంనగర్ గోదావరిఖనిలో చోరీ చేసిన 25 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఇదే తరహాలో నిజామాబాద్, కరీంనగర్, హైదరాబాద్‌లలో 13 చోరీలు చేసినట్టు నిందితుడు విచారణలో ఒప్పుకున్నాడు. నార్త్‌జోన్ డీసీపీ ప్రకాశ్ రెడ్డి పర్యవేక్షణలో ఏసీపీ తిరుపతి ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ చేసిన బృంద సభ్యులందరినీ రివార్డులతో సీపీ సన్మానించారు. -
సెక్యూరిటీ లేని ‘మోసం’!
సాక్షి, హైదరాబాద్: తక్కువ వడ్డీకే రుణం.. ఎటువంటి సెక్యూరిటీ అవసరం లేదు.. షరతులు అసలే లేవు.. ఇవే మాటలతో వందలాది మందిని మోసగించిందో ముఠా. నగరవాసి ఫిర్యాదుతో ఈ భారీ మోసం వెలుగులోకి రావడంతో గుర్గావ్, ఢిల్లీకి చెందిన ముగ్గురిని పోలీసులు పట్టుకున్నారు. గుర్గావ్కు చెందిన మహిపాల్‌సింగ్ యాదవ్, ఢిల్లీ వాసులు విమల్ అరోరా, శాంతనూ కుమార్‌లను శనివారం గుర్గావ్లో అరెస్ట్ చేసి.. ట్రాన్సిట్ వారంట్‌పై సోమవారం నగరానికి తీసుకొచ్చారు. మరో ఇద్దరు నిందితులు సందీప్ జునేజా, రాకేశ్ శర్మ పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన సయ్యద్ ఖుతుబుద్దీన్ రుణం పేరిట ఆరు లక్షల వరకు మోసపోయానని సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వీరి బాగోతం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ పోలీసు కమిషనర్ కార్యాలయంలో సోమవారం సీపీ మహేందర్‌రెడ్డి కేసు వివరాలు వెల్లడించారు. మహిపాల్‌సింగ్ 2005 నుంచి 2012 వరకు వివిధ కాల్ సెంటర్లలో వివిధ స్థాయిల్లో పనిచేశాడు. 2013 జూలైలో మై ఇన్వెస్ట్మెంట్ గురూజీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను రాకేశ్ శర్మతో కలసి ప్రారంభించాడు. తొలినాళ్లలో సందీప్ జునేజాకు చెందిన వాల్యూ అడెడ్ కార్డ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన వాల్యూ అడెడ్ కార్డ్స్ విక్రయించేవాడు. ఈ వ్యాపారం సక్సెస్ కాకపోవడంతో రుణాల పేరిట ప్రజలను మోసగించాలని జునేజాతో కలసి మహిపాల్ స్కెచ్ వేశాడు. సెక్యూరిటీ, నిబంధనలు లేకుండా తక్కువ వడ్డీకే రుణమిస్తామని మై ఇన్వెస్ట్మెంట్ గురూజీ సర్వీసెస్ ద్వారా తతంగం నడిపించాడు. ఓకే అనుకున్న కస్టమర్‌కు ముందుగా అప్లికేషన్ పంపి.. ఆధార్, పాన్ కార్డ్ తదితర జిరాక్స్‌లు పంపాలని పోస్టల్ అడ్రస్ ఇచ్చేవారు. ఆ తర్వాత వాల్యూ ఫిన్వెస్ట్ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి లోన్ అప్రూవల్ అయిందనే సందేశాన్ని పంపేవారు. ప్రాసెసింగ్ ఫీజు కింద రూ. 15 వేల నుంచి రూ. లక్ష వరకు.. ఆర్బీఐ, ఐటీ అధికారులను మేనేజ్ చేసేందుకు రూ. 50 వేల నుంచి రూ. లక్ష వరకు, వ్యాపారంలో నష్టం వస్తే ఇన్సూరెన్స్ కింద లక్ష.. ఇలా వివిధ రూపాల్లో రూ. ఐదు లక్షల వరకు డబ్బులు పిండుకునేవారు. ఇందుకోసం వివిధ బ్యాంక్ ఖాతాలు ఇచ్చేవారు. 30 బ్యాంక్ ఖాతాలు వీరి కంపెనీల పేరిట ఉన్నట్టు గుర్తించిన పోలీసులు.. వాటిలో ఉన్న రూ. 1,51,49,675లను ఫ్రీజ్ చేశారు. కాగా, ఏపీ, తెలంగాణలో 118 మందితో కలిపి మూడు నెలల్లో 522 మంది బాధితులు ఉన్నట్టు నిం దితుల నుంచి సేకరించిన డాటా ప్రకారం పోలీసులు గుర్తించారు. ఈ సంఖ్య వేలల్లో ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. -
అర్ధరాత్రి పాతబస్తీలో కొత్వాల్ పర్యటన
చార్మినార్ (హైదరాబాద్) : నగర పోలీస్ కమీషనర్ ఎం.మహేందర్‌రెడ్డి గురువారం అర్ధరాత్రి పాతబస్తీలో సందడి చేశారు. రంజాన్ మాసం నేపథ్యంలో పాతబస్తీలో కొనసాగుతున్న మార్కెట్‌ను పరిశీలించారు. రోడ్డుపై కాలినడకన కలియ తిరిగారు. దుకాణాల వద్దకు వెళ్లి వ్యాపారస్తులను పలకరించారు. ముస్లిం వ్యాపారులకు రంజాన్ శుభాకాంక్షలు (ముబారక్) తెలిపారు. పుట్‌పాత్ వ్యాపారులను కలిసి మామూళ్ల పేరుతో ఎవరైనా వేధిస్తున్నారా? అని అడిగి తెలుసుకున్నారు. గురువారం రాత్రి 10.30 గంటలకు చార్మినార్ పోలీసు స్టేషన్‌కు చేరుకున్న ఆయన 11 గంటలకు పాదయాత్ర ప్రారంభించారు. 12.15 గంటల వరకు ఆయన పర్యటన కొనసాగింది. చార్మినార్ నుంచి కాలినడకన బయలు దేరారు. చార్‌కమాన్, గుల్జార్‌హౌజ్, పత్తర్‌గట్టి మసీదు వరకు .. అక్కడి నుంచి తిరిగి గుల్జార్‌హౌజ్, చార్మినార్ ద్వారా శాలిబండ పిస్తాహౌజ్, శాలిబండ చౌరస్తా వరకు ఆయన పాదయాత్ర కొనసాగింది. దక్షిణ మండలం డీసీపీ వి.సత్యనారాయణ, అదనపు డీసీపీ బాబురావు, చార్మినార్ ఏసీపీ అశోక్ చక్రవర్తి, చార్మినార్, హుస్సేనీఆలం ఇన్స్పెక్టర్లు యాదగిరి, బాలాజీ ఆయన వెంట ఉన్నారు. -
ఏడాదిలో హైదరాబాద్‌లో లక్ష సీసీ కెమెరాలు
సోమాజిగూడ (హైదరాబాద్) : వచ్చే ఏడాది కాలంలో నగరవ్యాప్తంగా లక్ష సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నామని హైదరాబాద్ పోలీస్ కమీషనర్ మహేందర్ రెడ్డి చెప్పారు. సోమవారం సీసీ కెమెరాల నిర్వహణపై కానిస్టేబుళ్లకు నిర్వహించిన శిక్షణా ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నగరంలోని అన్ని ప్రార్థనా మందిరాలు, మార్కెట్లు, కాలనీలు, విద్యాలయాలు, కళాశాలలతోపాటు ప్రతి 50 మీటర్లకు ఒక సీసీ కెమెరా ఏర్పాటు దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ క్రమంలో కెమెరాల నిర్వహణ, సమాచార విశ్లేషణకు నిపుణుల కొరత ఉందన్నారు. దీంతో ఇంజనీరింగ్ చదువుకొని పోలీస్ శాఖలో కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్న 28 మందిని ఎంపిక చేసి శిక్షణ ఇప్పించినట్లు తెలిపారు. వీరు సీసీ కెమెరాల ఏర్పాటు, పర్యవేక్షణ, సమాచార విశ్లేషణతో పాటు కమాండ్ కంట్రోల్‌కు నిరంతరం సమాచారం అందిస్తారని చెప్పారు. మరి కొంతమంది కానిస్టేబుళ్లను ఎంపిక చేసి శిక్షణ ఇప్పించనున్నామని పేర్కొన్నారు. -
మరో గంటైతే.. పారిపోయేవాణ్ణే!
-
కాల్పులు జరిపింది ఓబులేశే: సీపీ
-
కాల్పులు జరిపింది ఓబులేశే: సీపీ
హైదరాబాద్: కేబీఆర్ పార్క్ కాల్పుల కేసులో నిందితుడు పులి ఓబులేశును అరెస్ట్ చేసినట్టు పోలీసులు అధికారికంగా ప్రకటించారు. అరబిందో ఫార్మా వైస్ చైర్మన్ నిత్యానందరెడ్డిపై కాల్పులకు తెగబడింది ఓబులేశేనని హైదరాబాద్ పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి తెలిపారు. అతనొక్కడే ఈ నేరం చేశాడని చెప్పారు. బెల్ ఫామ్(తుపాకులను శుభ్రం చేసే చోటు) నుంచి ఎత్తుకుపోయిన ఏకే 47 రైఫిల్, లోడెడ్ మేగజీన్ తో అతడీ ఘాతుకానికి పాల్పడ్డాడని తెలిపారు. కడప జిల్లా కోరుమామిళ్ల మండలానికి చెందిన ఓబులేసు పోలీసు కానిస్టేబుల్ గా చేరాడని, తర్వాత గ్రేహౌండ్స్ కు మారాడని చెప్పారు. దొంగిలించిన ఆయుధాన్ని కర్నూలు జిల్లా ఓర్వకల్లు ప్రాంతంలో గుట్టల్లో దాచాడన్నారు. గత ఫిబ్రవరిలో కేబీఆర్ పార్క్ వద్ద ఒకరిని అపహరించి సఫలమయ్యాడన్నారు. కిడ్నాప్ చేసిన వ్యక్తిని మహబూబ్ నగర్ జిల్లాలోని కొత్తూరు వరకు తీసుకెళ్లి రూ.10 లక్షల వసూలు చేశాడని చెప్పారు. అయితే బాధితులు ఫిర్యాదు చేయకపోవడంతో ఇది వెలుగులోకి రాలేదన్నారు. నిత్యానంద రెడ్డిని కూడా కిడ్నాప్ చేసి డబ్బు గుంజాలని చేసిన ప్రయత్నం బెడిసి కొట్టడంతో దొరికిపోయాడని వివరించారు. కాల్పులు జరిగిన ఆరేడు గంటల్లోనే నిందితుడిని గుర్తించామన్నారు. ఇమ్లిబన్ బస్టాండ్ నుంచి బస్సులో కర్నూలు పారిపోయాడని చెప్పారు. 37 ఏళ్ల ఓబులేశుకు ఇంకా పెళ్లికాలేదని, విలాసాలకు అలవాటు పడి వక్రమార్గం పట్టాడని మహేందర్‌రెడ్డి తెలిపారు.