సీపీని కలిసిన కోదండరామ్ సతీమణి
హైదరాబాద్ : తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ(టీ-జేఏసీ) చైర్మన్ ప్రొ.కోదండరాం సతీమణి సుశీల హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డిని బుధవారం కలిశారు. కోదండరాం ఆచూకీ తెలపాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఆయన్ను అరెస్ట్ చేసిన తీరుపై సీపీకి ఫిర్యాదు చేశారు. మహేందర్ రెడ్డిని కలిసిన వారిలో న్యాయవాది రచనారెడ్డి, జేఏసీ నాయకులు ఉన్నారు.
(రాజధాని దిగ్బంధం: కోదండరాం అరెస్ట్ )
తార్నాకలోని కోదండరాం నివాసంలో బుధవారం తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో ఇంటి తలుపులను బద్దలుకొట్టి మరీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. నిరుద్యోగ ర్యాలీ, సభ నిర్వహించి తీరుతామని టీజేఏసీ ప్రకటించడంతో రాష్ట్రవ్యాప్తంగా జేఏసీ నేతలను పోలీసులు అరెస్ట్ చేయడంతో పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కోదండరాం అరెస్ట్ సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరుపట్ల పలు రాజకీయ పార్టీల నేతలు, జేఏసీ నాయకులు, విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
సంబంధిత వార్తలు
కోదండరాం అరెస్ట్ అప్రజాస్వామికం : ఉత్తమ్
కోదండరాం అరెస్ట్‌పై జేఏసీ నేతల ఆగ్రహం