ఉత్సాహంగా మారథాన్ రన్..
హైదరాబాద్: టెలికం దిగ్గజం ఎయిర్‌టెల్ ఆధ్వర్యంలో చేపట్టిన ఫుల్ మారథాన్, హాఫ్ మారథాన్ ఆదివారం ఉదయం నెక్లెస్‌రోడ్డులో ప్రారంభమైంది. నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి ఫుల్ మారథాన్ (42కి.మీ)ను ఉదయం 5 గంటలకు ప్రారంభించగా.. హాఫ్ మారథాన్(21 కి.మీ)ను జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్ధన్‌రెడ్డి ఆరు గంటలకు ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వేలాది మంది ఔత్సాహికులు పీపుల్స్ ప్లాజా నుంచి ఖైరతాబాద్ ఫ్లైఓవర్, రాజ్‌భవన్ రోడ్, రాజీవ్ సర్కిల్, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ మీదుగా హైటెక్స్ సిటీకి పరుగు తీశారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ.. గ్లోబల్ సిటీగా ఎదుగుతున్న నగరంలో ఇలాంటి వాక్‌లు ఎంతో అవసరమన్నారు. ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడం కోసం ప్రతి ఒక్కరూ నడక, పరుగు అలవరుచుకోవాలని సూచించారు.