ఆదివారం పోలీసు సంస్మరణ పరుగులో పాల్గొన్న గవర్నర్ నరసింహన్, డీజీపీ అనురాగ్ శర్మ, సీపీ మహేందర్‌రెడ్డి తదితరులు
హైదరాబాద్: దేశ రక్షణలో సైనికుల పాత్ర ఎంతో కీలకమని, అలా దేశం కోసం సేవ చేస్తూ అమరులైన సైనికులను స్మరించుకోవడం వారికిచ్చే గౌరవమని గవర్నర్ నరసింహన్ అన్నారు. హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్డు పీపుల్స్ ప్లాజా నుంచి పోలీసు అమరవీరుల స్మారకార్థం ఏర్పాటు చేసిన సంస్మరణ పరుగును ఆదివారం గవర్నర్ ప్రారంభించారు.
గవర్నర్ మాట్లాడుతూ సైనికుల్ని యువత స్ఫూర్తిగా తీసుకుని దేశ రక్షణకు ముందుకు రావాలన్నారు. పోలీసులు నిరంతరం ప్రజాసంక్షేమం కోసం కృషి చేస్తున్నారని ప్రశంసించారు. అనంతరం 10కె, 5కె, 2కె రన్‌లను గవర్నర్, డీజీపీ అనురాగ్‌శర్మ ప్రారంభించారు. పరుగులో సీపీ మహేందర్‌రెడ్డితో పాటు యువకులు, ఔత్సాహికులు వేలాదిగా రన్‌లో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment