బక్రీద్ పండుగ నేపథ్యంలో సీపీ ఎం.మహేందర్‌రెడ్డి ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
- మంగళవారం ఉదయం 8 నుంచి 11.30 వరకు అమలు
హైదరాబాద్: బక్రీద్ పండుగ నేపథ్యంలో మంగళవారం వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. మీరాలం ట్యాంక్ ఈద్గాతో పాటు సికింద్రాబాద్‌లోని ఈద్గా వద్దా ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 11.30 గంటల వరకు వన్ వే అమలులో ఉంటుందని కమిషనర్ పేర్కొన్నారు.
మీరాలం
- ఈద్గా వైపు వెళ్లే వాహనాలను పురానాపూల్, బహదూర్‌పుర పోలీసుస్టేషన్ మీదుగా పంపిస్తారు. ఈద్గా వైపు నుంచి బహదూర్‌పుర పోలీసుస్టేషన్ వైపు వాహనాలను అనుమతించరు.
- శివరామ్‌పల్లి, నేషనల్ పోలీసు అకాడెమీ మీదుగా బహుదూర్‌పుర వచ్చే ట్రాఫిక్‌ను దానమ్మ గుడిసెల వద్ద ఉన్న టి జంక్షన్ నుంచి ఇంజన్ బౌలీ మీదుగా పంపిస్తారు.
- ఈద్గా క్రాస్ రోడ్స్ నుంచి సైకిళ్లు, రిక్షాలను ఈద్గా వైపు అనుమతించరు. నిర్దేశించిన ప్రాంతాల్లో వీటిని పార్క్ చేసుకోవాలి.
- ఈద్గా వద్దకు వస్తున్న వారిని తీసుకువచ్చే కార్లు, ఆర్టీసీ బస్సులు, టూరిస్ట్ బస్సులు, లారీలు ఇతర వాహనాలను ఈద్గా వద్దకు అనుమతించరు. వీటిని మీరాలం ఫిల్టర్ బెడ్ టి జంక్షన్ వద్ద కేటాయించిన ప్రాంతాల్లో పార్క్ చేసుకోవాలి.
- ప్రార్థనల అనంతరం ఈద్గాకు వచ్చిన వారిని తీసుకుని వెళ్లే వాహనాల్లో వేగంగా వెళ్లే వాటిని తాడ్‌బన్ రోడ్, బోయిస్ టౌన్ స్కూల్, న్యూ రోడ్ షంషీర్‌గంజ్, ఆలియాబాద్, చార్మినార్ మీదుగా పంపుతారు.
సికింద్రాబాద్
- కార్లు, ఆర్టీసీ బస్సులు, మోటారు సైకిళ్లు, లారీలు ఈద్గా చౌరస్తా నుంచి బాలమ్‌రాయ్ మీదుగా బాలమ్‌రాయ్ టి జంక్షన్‌కు చేరుకోవాలి.