సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీని పటిష్టం చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహాలు, రూపొందించాల్సిన కార్యక్రమాలపై చర్చించేందుకు ఈ నెల 8న హైదరాబాద్ మాసాబ్‌ట్యాంక్ సమీపంలోని క్రిస్టల్ గార్డెన్స్‌లో ఆ పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరగనుంది. గ్రామస్థాయి నుంచి రాష్ర్టస్థాయి వరకు కమిటీలను ఏర్పాటు చేసుకుని సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. గతనెల 26వ తేదీన జరిగిన సమావేశంలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ సమావేశాన్ని ఏర్పాటుచేస్తున్నారు.
దివంగత మహానేత డా.వైఎస్ రాజశేఖరరెడ్డి అమలుచేసిన పథకాలను గురించి ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు జనక్ ప్రసాద్ తెలిపారు. ప్రస్తుతం మహానేత వైఎస్ చేపట్టిన పథకాలకు ఏ విధంగా తూట్లు పొడుస్తున్నారనే విషయంపై భేటీలో చర్చిస్తామన్నారు. రైతులు, వివిధవర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి నాయకులకు దిశానిర్దేశం చేస్తారని చెప్పారు. ఈ సమావేశంలో తెలంగాణలోని సీజీసీ, సీఈసీ సభ్యులు, ఎంపీ, ఎమ్మెల్యేలతోపాటు జిల్లా అధ్యక్షులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీ సభ్యులు తదితరులు పాల్గొంటారు.
రేపు వైఎస్సార్‌సీపీ విస్తృతస్థాయి భేటీ
Published Tue, Oct 7 2014 2:36 AM | Last Updated on Fri, May 25 2018 9:17 PM
Advertisement
Advertisement