janak prasad
-
రేపు వైఎస్సార్సీపీ విస్తృతస్థాయి భేటీ
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీని పటిష్టం చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహాలు, రూపొందించాల్సిన కార్యక్రమాలపై చర్చించేందుకు ఈ నెల 8న హైదరాబాద్ మాసాబ్‌ట్యాంక్ సమీపంలోని క్రిస్టల్ గార్డెన్స్‌లో ఆ పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరగనుంది. గ్రామస్థాయి నుంచి రాష్ర్టస్థాయి వరకు కమిటీలను ఏర్పాటు చేసుకుని సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. గతనెల 26వ తేదీన జరిగిన సమావేశంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ సమావేశాన్ని ఏర్పాటుచేస్తున్నారు. దివంగత మహానేత డా.వైఎస్ రాజశేఖరరెడ్డి అమలుచేసిన పథకాలను గురించి ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు జనక్ ప్రసాద్ తెలిపారు. ప్రస్తుతం మహానేత వైఎస్ చేపట్టిన పథకాలకు ఏ విధంగా తూట్లు పొడుస్తున్నారనే విషయంపై భేటీలో చర్చిస్తామన్నారు. రైతులు, వివిధవర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి నాయకులకు దిశానిర్దేశం చేస్తారని చెప్పారు. ఈ సమావేశంలో తెలంగాణలోని సీజీసీ, సీఈసీ సభ్యులు, ఎంపీ, ఎమ్మెల్యేలతోపాటు జిల్లా అధ్యక్షులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీ సభ్యులు తదితరులు పాల్గొంటారు. -
వచ్చే నెల 8న వైఎస్సార్సీపీ తెలంగాణ జిల్లాల భేటీ
పార్టీ తెలంగాణ కమిటీ సభ్యుడు జనక్‌ప్రసాద్ వెల్లడి హైదరాబాద్ : తెలంగాణలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పటిష్టం చేసేందుకు.. వచ్చేనెల 8న హైదరాబాద్‌లోని మాసబ్‌ట్యాంక్ సమీపంలో గల క్రిస్టల్ ఫంక్షన్‌హాలులో పార్టీ విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్సీపీ తెలంగాణ కమిటీ సభ్యుడు జనక్‌ప్రసాద్ తెలిపారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు.. తెలంగాణలో వైఎస్సార్సీపీని ప్రజాబలమున్న పటిష్టపార్టీగా రూపుదిద్దేందుకు చర్యలు చేపడతారని ఆదివారం ఆయన మీడియాకు చెప్పారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు పార్టీ రాష్ట్రకమిటీ సభ్యులు కె.శివకుమార్ పాల్గొన్నారు. పార్టీ నిర్మాణంలో భాగంగా నిర్వహించనున్న ఈ విస్తృత సమావేశం పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్ఢి అధ్యక్షతన జరగనుందన్నారు. ఈ సమావేశానికి తెలంగాణలోని పది జిల్లాల్లోని నాయకులు, సీజీసీ, పీయూసీ, జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీచేసిన వారు, జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్‌లుగా పోటీచేసిన అభ్యర్థులు, అధికార, ప్రజాసంఘాల నాయకులు పాల్గొంటారని ఆయన తెలియజేశారు. ఈ సమావేశానికి పైన పేర్కొన్న నాయకులంతా హాజరుకావాలని కోరారు. ఈ నెల 26న పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన జరిగిన పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గసమావేశంలో పార్టీ పటిష్టత, భవిష్యత్‌తో చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించి, 8న విస్తృతసమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పారు. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన ప్రజాసంక్షేమ కార్యక్రమాల అమలు తెలంగాణలో ఏ విధంగా జరుగుతున్నది, వాటిపై అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ విస్తృతస్థాయి భేటీలో చర్చించనున్నట్లు జనక్‌ప్రసాద్ తెలియజేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఆందోళ న కార్యక్రమాలను చేపట్టేందుకు పార్టీ సిద్ధంగా ఉందన్నారు. పార్టీ ఆధ్వర్యంలో భవిష్యత్‌లో నూతన కార్యక్రమాలను చేపట్టే విషయంపై విస్తృతభేటీలో చర్చిస్తామన్నారు. ఈ కార్యక్రమాల విజయం కోసం రాష్ర్ట కమిటీ సభ్యులను జిల్లాల ఇన్‌చార్జీలుగా పార్టీ నాయకత్వం నియమించిందని జనక్‌ప్రసాద్ చెప్పారు. -
'అవే ఫలితాలు పునరావృతమవుతాయి'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధించడం ఖాయమని వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు జనక్‌ప్రసాద్ అన్నారు. గతంలో గుజరాత్లో బీజేపీ అన్ని జిల్లా పరిషత్ స్థానాల్లో ఓడిపోయిన రెండు నెలల తర్వాత నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి అయ్యారని ఆయన గుర్తు చేశారు. అవే ఫలితాలు ఇక్కడ కూడా పునరావృతమవుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాబోతుందని చెప్పారు. -
కార్మికులకు మంచి రోజులు
ఉద్యోగులు సుఖసంతోషాలతో జీవించాలి కార్మికులను చీడపురుగుల్లా చూసిన చంద్రబాబు వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు జనక్ ప్రసాద్ యూనియన్‌లో చేరిన వందల మంది స్వర్ణకార, ఆటోవర్కర్లు విజయవాడ, న్యూస్‌లైన్ : రానున్న రోజుల్లో కార్మికులు, ఉద్యోగులకు మంచి రోజులు వస్తాయని, వారు సుఖ సంతోషాలతో జీవిస్తారని వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు జనక్‌ప్రసాద్ అన్నారు. మరోవారం రోజుల్లో జరగనున్న ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తథ్యమని, జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఏర్పడి కార్మికులు, ఉద్యోగుల సంక్షేమానికి కృషి చేస్తుందని పేర్కొన్నారు. వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ నగర శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వాస్పత్రి వద్ద మే డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథి జనక్‌ప్రసాద్ తొలుత యూనియన్ పతాకాన్ని ఆవిష్కరించి కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కార్మికులకు శ్రమ దోపిడీ నుంచి విముక్తి కలిగిన రోజే మేడే అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కార్మికులను చంద్రబాబు చీడపురుగుల్లా చూశారని విమర్శించారు. చంద్రబాబు 54 ప్రభుత్వ రంగ పరిశ్రమలను ప్రయివేటు పరం చేయడంతో 20 వేల మంది కార్మికులు రోడ్డున పడ్డారని గుర్తుచేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం రోశయ్య, కిరణ్ సర్కార్లు రూ.32 వేల కోట్ల మేరకు విద్యుత్ బిల్లుల విధించడంతో అనేక కంపెనీలు మూతపడి వేల మంది కార్మికులు ఉపాధి కోల్పోయారని ఆవేదన వ్యక్తంచేశారు. రానున్న రోజుల్లో జగన్మోహన రెడ్డి ఏ ఒక్క కార్మికుడికీ అన్యాయం జరగకుండా చర్యలు చేపడతారన్నారు. అర్హులైన కాంట్రాక్టు కార్మికులందరినీ రెగ్యులర్ చేసే అంశాన్ని పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచారని జనక్‌ప్రసాద్ తెలిపారు. కార్మికులు, ఉద్యోగులు సుఖసంతోషాలతో జీవించాలన్నదే జగన్మోహన్రెడ్డి ఆశయమని పేర్కొన్నారు. అనంతరం ఆయన సిద్ధార్థ వైద్య కళాశాల ఎదుట యూనియన్ పతాకాన్ని ఆవిష్కరించారు. వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మనోరంజని, స్టేట్వైస్ ప్రెసిడెంట్ ఎ.ఎం.ఆర్.పాల్, నగరశాఖ అధ్యక్షుడు విశ్వనాథ రవి, జిల్లా కార్యదర్శి జ్యోతిరెడ్డి, హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రభుత్వాస్పత్రి శాఖ అధ్యక్ష కార్యదర్శులు డి.సత్యనారాయణ, నాళం మురళీకృష్ణ, బాపట్ల శ్రీను, విశ్వనాథపల్లి జ్యోతిరాజు, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పి.వి.సత్యనారాయణ, రవిరాజ్ తదితరులు పాల్గొన్నారు. స్వర్ణకార, ఆటో కార్మికుల చేరిక మేడే సందర్భంగా ప్రభుత్వాస్పత్రి వద్ద జరిగిన వేడుకల్లో నగరంలోని స్వర్ణకారులు 150 మంది పొన్నాడ గంగాధర్, శివశంకర్ ఆధ్వర్యంలో వైఎస్సార్ ట్రేడ్ యూనియన్‌లో చేరారు. ఆటోవర్కర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు ఎండి.రఫీ, ఎం.భర ద్వాజ్ తదితరులు 200 మంది కూడా చేరగా వారిని జనక్‌ప్రసాద్ సాదరంగా ఆహ్వానించారు. -
తెలంగాణలో కూడా అవే ఫలితాలు!
ఇడుపులపాయ: తెలంగాణలో వైఎస్ఆర్ సిపి కనుమరుగైందనడం అవాస్తవం అని ఆ పార్టీ నేతలు కొండా రాఘవరెడ్డి, జనక్ ప్రసాద్ అన్నారు. వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయలో ఈ ఉదయం పార్టీ 2వ ప్లీనరీ ప్రారంభం సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడారు. సీమాంధ్రలో పార్టీకి ఎలాంటి ఫలితాలొస్తాయో, తెలంగాణలో కూడా అలాంటి ఫలితాలే వస్తాయని తెలిపారు. పార్టీ ప్లీనరీకి తెలంగాణ నుంచి కూడా వేలాదిగా కార్యకర్తలు తరలివచ్చారని చెప్పారు. -
జగన్ సభకు జిల్లా నేతలు
ఆదిలాబాద్, న్యూస్‌లైన్ : హైదరాబాద్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సభకు జిల్లా నుంచి ఆ పార్టీ నాయకులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. శుక్రవారమే జిల్లా నుంచి రైళ్లు, బస్సుల్లో కొంతమంది వెళ్లగా.. శనివారం ఉదయం ప్రత్యేక వాహనాల్లో ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, భైంసా, చెన్నూర్, కాగజ్‌నగర్, బెల్లంపల్లి, ఖానాపూర్ తదితర ప్రాంతాల నుంచి తరలారు. పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కన్వీనర్ బి.జనక్‌ప్రసాద్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు మేకల ప్రమీల, ఆదిలాబాద్ నియోజకవర్గ సమన్వయకర్త బి.అనిల్‌కుమార్, పార్టీ కో కన్వీనర్ రవిప్రసాద్, నేతలు ముత్తినేని రవికుమార్, చల్లగుల్ల విజయ్శ్రీ, చిప్పకుర్తి లక్ష్మీనారాయణ, అతికేటి శ్రీనివాస్ తదితరులు వెళ్లినవారిలో ఉన్నారు. హైదరాబాద్‌లో వేదికపై పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డిని జనక్‌ప్రసాద్ శాలువా కప్పి సన్మానించారు. జిల్లా నాయకులు పలువురు వేదికపై ఆసీనులై కనిపించారు. ఈ సందర్భంగా జగన్‌ను కలిసి జిల్లా పరిస్థితులు వివరించారు.