జగన్ సభకు జిల్లా నేతలు | District leaders attended Jagan's Samaikya Sankharavam meeting | Sakshi
Sakshi News home page

జగన్ సభకు జిల్లా నేతలు

Published Sun, Oct 27 2013 3:41 AM | Last Updated on Wed, Aug 8 2018 5:41 PM

District leaders attended Jagan's Samaikya Sankharavam meeting

ఆదిలాబాద్, న్యూస్‌లైన్ : హైదరాబాద్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సభకు జిల్లా నుంచి ఆ పార్టీ నాయకులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. శుక్రవారమే జిల్లా నుంచి రైళ్లు, బస్సుల్లో కొంతమంది వెళ్లగా.. శనివారం ఉదయం ప్రత్యేక వాహనాల్లో ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, భైంసా, చెన్నూర్, కాగజ్‌నగర్, బెల్లంపల్లి, ఖానాపూర్ తదితర ప్రాంతాల నుంచి తరలారు. పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కన్వీనర్ బి.జనక్‌ప్రసాద్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు మేకల ప్రమీల, ఆదిలాబాద్ నియోజకవర్గ సమన్వయకర్త బి.అనిల్‌కుమార్, పార్టీ కో కన్వీనర్ రవిప్రసాద్, నేతలు ముత్తినేని రవికుమార్, చల్లగుల్ల విజయ్‌శ్రీ, చిప్పకుర్తి లక్ష్మీనారాయణ, అతికేటి శ్రీనివాస్ తదితరులు వెళ్లినవారిలో ఉన్నారు. హైదరాబాద్‌లో వేదికపై పార్టీ అధినేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని జనక్‌ప్రసాద్ శాలువా కప్పి సన్మానించారు. జిల్లా నాయకులు పలువురు వేదికపై ఆసీనులై కనిపించారు. ఈ సందర్భంగా జగన్‌ను కలిసి జిల్లా పరిస్థితులు వివరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement