నెల్లూరు: నెల్లూరు జిల్లా కావలి జాతీయ రహదారిపై మద్యంలోడ్తో వెళ్తున్న లారీ ఆదివారం బోల్తా పడింది. ఈ ఘటనలో లారీలోని దాదాపు రూ.12 లక్షల విలువైన మద్యం బాటిళ్లు ధ్వంసమైనాయి. డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. దాంతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని డ్రైవర్ను ఆసుపత్రికి తరలించారు. లారీని రహదారిపై నుంచి నిలిచిపోయిన ట్రాఫిక్ జామ్ ను క్లియర్ చేశారు.