
ముంబై: ముంబైలో ఘోర ప్రమాదం జరిగింది. విహార యాత్రకు వెళ్లిన బస్సు తిరిగి వస్తుండగా.. బోల్తా పడింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఇద్దరు విద్యార్థులు మరణించగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ఆదివారం ముంబైలో రాయ్‌గఢ్ జిల్లాలోని ఖోపోలిలో చోటు చేసుకుంది. ముంబైలో చెంబూర్‌లోని కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో 10వ తరగతి చదువుతున్న సుమారు 48 మంది విద్యార్థులు, ఇద్దరు టీచర్లతో కలిసి బస్సులో విహారయాత్రకు వెళ్లినట్లు అధికారులు తెలిపారు.
ఆదివారం రాత్రి సుమారు ఎనిమిది గంటల ప్రాంతంలో పాత ముంబై-పూణె హైవే వద్ద కొండలు దిగుతుండగా బస్సు బోల్తా పడిందని అధికారులు వెల్లడించారు. ఈ మేరకు పోలీసులు మాట్లాడుతూ...ఈ ఘటనలో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందారని, గాయపడిన ఇతర ప్రయాణకులు లోనావాలా, ఖపోలీ సమీప ప్రాంతాల్లోని ఆస్పత్రులకు తరలించినట్లు పేర్కొన్నారు.
(చదవండి: అతి వ్యాయామంతో గుండెపోటు! ఈ మధ్యకాలంలోనే ఎక్కువగా ఎందుకంటే..)
Comments
Please login to add a commentAdd a comment