ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాళేశ్వరం నుంచి కరీంనగర్ వెళుతోన్న ఆర్టీసీ బస్సు మంగళవారం రాత్రి మంథని సమీపంలో బోల్తా కొట్టింది.
కరీంనగర్: గోదావరి పుష్కరాల్లో ప్రధాన ఘాట్ గా కొనసాగుతున్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాళేశ్వరం నుంచి కరీంనగర్ వెళుతోన్న ఆర్టీసీ బస్సు మంగళవారం రాత్రి మంథని సమీపంలో బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో 20 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం తెలసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. కాగా, బాధితులు గోదావరి పుష్కరాలకు వెళ్లివస్తున్నవారా కాదా అనే విషయం తెలియాల్సి ఉంది. కాగా, పుష్కరాలకు వెళ్లేవారిలో ఎక్కువ మంది ఇదే రహదారిలో ప్రయాణిస్తుండటంతో బస్సు బోల్తా వార్త పలువురిని కలవరపెడుతోంది.