ఆరుగురు సజీవ సమాధి | Six of family killed as truck overturns in Punjab Patiala (Pb), | Sakshi
Sakshi News home page

ఆరుగురు సజీవ సమాధి

Published Sat, Aug 15 2015 12:22 PM | Last Updated on Tue, Nov 6 2018 4:55 PM

Six of family killed as truck overturns in Punjab Patiala (Pb),

లుథియానా:  దేశమంతా స్వాతంత్య్ర దినోత్సవ సంబరాల్లో  మునిగి తేలుతోంటే పంజాబ్లోని  ఓ కుటుంబం మాత్రం సజీవ సమాధి అయింది.   అర్థరాత్రి ఓ వాహనం పటియాలాలోని కుటుంబం  ముంగిట  మృత్యుఘంటికలు మోగించింది.   దీంతో నలుగురు చిన్నారులు సహా దంపతులు ఈ ప్రమాదంలో మరణించారు.

వివరాల్లోకి వెళితే...నిర్మాణ పనులు జరుగుతున్న ప్రదేశానికి ఇసుకలోడ్తో వెళుతున్న ఓ టిప్పర్ వాహనం అదుపు తప్పి  పక్కనే ఉన్న గుడిసెలోకి దూసుకెళ్లింది.  దీంతో గుడిసెలో నిద్రిస్తున్న రాజు(32) భార్య మాన్సి(30)  నలుగురు పిల్లలు  ఖుషి(1) షీతల్ (3) నిహాల్(5) అశు(10) ఆ ఇసుక కింద  కూరుకుపోయారు. పోలీసులు సంఘటనా  స్థలానికి  చేరుకుని వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే వారు అప్పటికే  చనిపోయినట్టుగా వైద్యులు తెలిపారు.   పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement